breaking news
Nanna Nenu Na Boyfriends
-
క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి
‘‘గురువారం సినిమా చూశా. ట్రెండీగా, ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు బాగా తీశారు. క్లైమాక్స్‌లో రావు రమేశ్ నటనకు కన్నీళ్లు వచ్చాయి’’ అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. హెబ్బా పటేల్, రావు రమేశ్, తేజస్వి, అశ్విన్, నోయెల్, పార్వతీశం ముఖ్య తారలుగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ (గోపీ) నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ఈ నెల 16న విడుదలైంది. శుక్రవారం చిత్రబృందాన్ని దాసరి అభినందించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంఫర్ట్బుల్ బడ్జెట్లో చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. షెడ్యూల్ ప్రకారం అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడం అరుదుగా జరుగుతుంది. గోపీ ఇలాగే మంచి సినిమాలను తీయాలి. నోట్ల రద్దు లేకపోతే ఇంకా బాగా కలెక్ట్ చేసేది’’ అన్నారు. ‘‘దాసరిగారు నా తొలి చిత్రాన్ని మెచ్చుకోవడం అంటే అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు దర్శకుడు. ‘‘దాసరిగారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు తీస్తా’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. -
చివరకు రాజ్ తరుణ్‌తో హేబా పెళ్లి..!
అలా ఎలా మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హేబా పటేల్. రాజ్ తరుణ్ సరసన నటించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ జోడి అనిపించుకున్న రాజ్ తరుణ్ హేబాలు తరువాత ఈడో రకం ఆడో రకం సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా మరో సినిమాలో కలిసి నటించారు రాజ్ తరుణ్ హేబా పటేల్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో గెస్ట్ రోల్లో అలరించనున్నాడు రాజ్ తరుణ్. అశ్విన్, పార్వతీషం, నోయల్‌లు హేబా బాయ్ ఫ్రెండ్స్‌గా నటిస్తుండగా, క్లైమాక్స్‌లో హేబాను పెళ్లిచేసుకునే వరుడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఈ జోడికి హ్యాట్రిక్ సక్సెస్ అందుతుందేమో చూడాలి.