breaking news
nanapatekar
-
SSMB29: రూ.20 కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
షూటింగ్ సమయంలో నన్ను వేధించారు!
ముంబై : అక్షయ్‌కుమార్ అప్‌కమింగ్ మూవీ హౌజ్‌ఫుల్-4 లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించడంతో అతడు సినిమా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. తనుశ్రీ ఆరోపణలతో ‘మీటూ’ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో.. సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా వేధింపుల ఆరోపణలు రాగా అతడు కూడా దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తాజాగా... హౌజ్‌ఫుల్-4 సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు ఆరోపించారు. హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ సెట్లో ఉన్న సమయంలోనే తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. సదరు జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి(సినిమాతో సంబంధం లేని వ్యక్తి), డాన్స్‌మాస్టర్‌కు గొడవ జరిగింది వాస్తవమేనని.. అయితే ఆ సమయంలో అక్షయ్, రితేశ్ అక్కడ లేరని తెలిపాడు. వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవను సినిమా యూనిట్‌కు ఆపాదించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. గొడవ జరిగిన సమయంలో తన అసిస్టెంట్ అక్కడే ఉన్నారని.. జూనియర్ ఆర్టిస్టు చెబుతున్నట్లుగా ఆమెను ఎవరూ లైంగిక వేధించలేదని తనతో చెప్పారని పేర్కొన్నాడు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంటే.. సంబంధంలేని విషయాల్లో కూడా ఇలా తమను ఇరికించడం సరికాదన్నారు. -
నిర్మాత శ్రేయస్సే ముఖ్యం
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. -
తనుశ్రీ దత్తా వివాదం : అజ్ఞాతంలోకి నటుడు
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన లైంగిక ఆరోపణలకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరు మద్దతు ఇస్తున్నారు. ట్వింకిల్ ఖన్న, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా. అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్‌లు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం హౌజ్‌ఫుల్ 4 లో నటిస్తున్న నానా పటేకర్ షూటింగ్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ హౌజ్‌ఫుల్ 4 సినిమా సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులంతా గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన యూనిట్ సభ్యులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్ మిస్సయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడికి పోయారో తెలియదు, నానా పటేకర్ షూటింగ్ రానట్టు తెలిసింది. కనీసం చిత్ర యూనిట్‌కు కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు చెప్పలేదు. దీంతో పటేకర్ సీన్లను తర్వాత షూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని రిపోర్టులు తెలిపాయి. హౌజ్‌ఫుల్ 4 సినిమా షూటింగ్ సందర్భంగా జైసల్మేర్ బయలుదేరు వెళ్లు సమయంలో, నానా పటేకర్, కృతి సనూన్, పూజే హెగ్డేలతో కలిసి ఉన్న ఓ పిక్చర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత నానా పటేకర్ మిస్సయ్యారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలన్నీ నిరాధారనమైనవని, సెట్లో 50 నుంచి 100 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి లైంగిక ఆరోపణల గురించి ఆమె మాట్లాడుతుంది అంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. కాగా, సాజిద్ ఖాన్ కామెడి సినిమా హౌజ్‌ఫుల్ 4లో నానా పటేకర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
క్రేజ్ వస్తుందని భయపడుతుందట..!
కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిని ఢిల్లీ భామ తాప్సీ, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. సౌత్‌లో చేసిన కాంచన 2 సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ, బేబి సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తరువాత తాప్సీ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా త్వరలో క్రేజీ ఆఫర్స్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి పింక్, నానాపటేకర్‌తో కలిసి తడ్కా సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. ఒకేసారి ఇద్దరు లెజెండరీ యాక్టర్స్‌తో కలిసి నటిస్తుండటంతో ఆ సినిమాల రిలీజ్ తరువాత తనకు భారీ క్రేజ్ వస్తుందని భావిస్తోంది ఈ బ్యూటి. ఈవిషయాన్ని స్వయంగా చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో మీడియాతో పంచుకున్న తాప్సీ. నాకు భారీ క్రేజ్ వస్తుందేమో అని భయంగా ఉందంటూ కామెంట్ చేసింది. సౌత్ లోనూ ఘాజీ లాంటి ఆసక్తికర సినిమాల్లో నటిస్తూ తన ఫాం కొనసాగించే పనిలో ఉంది ఈ బ్యూటి. -
యాక్టర్... నానాపటేకర్ డైరెక్టర్... ప్రకాశ్ రాజ్
ప్రసిద్ధ నటుడు ప్రకాశ్‌రాజ్ దర్శకునిగా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడు నానాపటేకర్ హీరోగా ‘తడ్కా’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇంతకు ముందు ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో ‘ఉలవచారు బిర్యానీ’ (తమిళంలో ‘ఉన్ సమయిల్ అరయిల్’) చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ‘తడ్కా’ చిత్రీకరణ మే, జూన్‌ల్లో జరగనుంది. శ్రీయ, తాప్సీ నాయికలుగా నటించనున్నారు. ‘నానూ నన్న కనసు’(కన్నడ), ‘ధోని’ (తెలుగు, తమిళ) చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్ ప్రస్తుతం తెలుగు, కన్నడాల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమా డెరైక్ట్ చేస్తున్నారు.