breaking news
Nagrota army camp
-
సైలెన్సర్ గన్‌తో సెంట్రీని చంపి..
నగ్రోటా ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోటాలో ఉన్న ఆర్మీ యూనిట్‌పై దాడి కోసం ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు తేలింది. సైలెన్సర్ గన్‌తో సెంట్రీని కాల్చి చంపి ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. గతనెల 29న నగ్రోటాలోని ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ రోజు తెల్లవారుజామున 5.30కు ముగ్గురు ముష్కరులు ఒక్కసారిగా ఆర్మీ యూనిట్‌పై కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది వారిని మట్టుబెట్టింది. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు. దీని ప్రకారం, తొలుత ఆర్మీ క్యాంప్ ప్రాంగణాన్ని సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫెంట్ గ్రాస్ ద్వారా ప్రవేశమార్గం వద్దకు వచ్చారు. అక్కడున్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి లోపలికి ప్రవేశించారు. సెంట్రీని చంపినట్లు ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో కొంత భయానక వాతావ రణం ఏర్పడింది. సైనిక కుటుంబాలున్న భవంతిలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తుం డటాన్ని సైనికులు గుర్తించారు. సైనికుల కుటుంబాలను బందీలు చేసుకునే అవకాశముందని గుర్తించిన బలగాలు ముందుగా పారాకమాండోల సాయంతో పిల్లల్ని, మహిళల్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఉగ్రవాదులపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే డ్రోన్ల సాయం తీసుకొని క్యాంప్‌లోని పలుచోట్ల నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించి తుదముట్టించారు. -
ముష్కరుల దురాగతం; తిప్పికొట్టిన ఆర్మీ
-
ముష్కరుల దురాగతం; తిప్పికొట్టిన ఆర్మీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ప్రాంతంలో తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు అమరులయ్యారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో ఆర్మీ యూనిట్ లోకి ప్రవేశించిన ముగ్గురు తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హోరాహోరీ పోరాటం తర్వాత తీవ్రవాదులను సైనిక దళాలు హతమార్చాయి. బందీలుగా పట్టుకున్న 12 మంది జవాన్లు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులను భద్రతా దళాలు కాపాడాయి. నగ్రోటా ప్రాంతంలో సైనిక దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఎన్ కౌంటర్ వివరాలను ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్.. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ కు వివరించారు. జాతీయ భద్రతా సలహారు అజిత్ దోవల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చమ్లియాల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ముగ్గురు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.