breaking news
naayani narsimha reddy
-
'ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం'
రామచంద్రాపురం: మెదక్ జిల్లా లోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకోసం ఇండస్ట్రియల్ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. ఈఎస్ఐ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. -
'సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపిస్తాం'
ఆదిలాబాద్(బెజ్జూరు): మూతపడిన సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన మంగళవారం బెజ్జూరులో కొత్త పోలీస్స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... త్వరలో యాజమాన్యంతో మాట్లాడి సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లును త్వరలో తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.