breaking news
Munnabhai MBBS
-
రాజ్ కుమార్ హిరానీ బర్త్‌డే స్పెషల్.. 5 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..
Director Raj Kumar Hirani Birthday Special And His 5 Block Busters: బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్ కుమార్ హిరానీ తప్పకుండా ఉంటారు. 100 శాతం సక్సెస్ రేట్‌తో హిందీ సినిమా చిత్ర దర్శకుడిగా ఘనత పొందారు. ఈ విజయపథంలో ఆయన ఇప్పటివరకు కేవలం 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇవాళ (నవంబర్ 20)న రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన 5 బ్లాక్బస్టర్లపై ఓ లుక్కేద్దామా..! 1. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003) సంజయ్ దత్, అర్షద్ వార్సి, విద్యాబాలన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ తొలి చిత్రం. ఈ సినిమా ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే ట్యాగ్‌ని సంపాదించిపెట్టింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వసూళ్లలో ఒకటిగా నిలవడమే కాకుండా మున్నా, సర్క్యూట్ పాత్రలు బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అవి వారికి ఇంటి పేర్లుగా కూడా మారాయి. మహాత్మా గాంధీ ధర్మ బద్ధమైన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు హాస్యంతో తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ కూడా చేశారు. 2. లగేరహో మున్నాభాయ్ (2006) మున్నాభాయ్ ఎంబీబీఎస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే లగేరహో మున్నాభాయ్. మొదటి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కూడా ఉంటారు. సామాజిక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను కూడా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ పేరుతో తెరకెక్కించారు. 3. 3 ఇడియట్స్ (2009) బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10, అత్యంత పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటిగా పేరొచ్చిన చిత్రం 3 ఇడియట్స్. ఒకరకంగా ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థికైనా ఒక సిలబస్ లాంటిదీ సినిమా. నిజ జీవితంలో, చదువులో ముఖాముఖి పోటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటూనే మంచి సామాజిక సందేశాన్ని ఇస్తుంది. 4. పీకే (2014) ‘3 ఇడియట్స్’ ఘనవిజయం తర్వాత రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో కలిసి మళ్లీ ఒక కొత్త తరహా కథను తెరకెక్కించారు. ఒక గ్రహాంతర వాసి, మతం, దేవుడి పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి భూమిపై ఉన్న ప్రజలను భయపెట్టే విభిన్న కోణం నుంచి ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నటించారు. 5. సంజు (2018) సంజు చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి. మొదటిసారిగా తెరపై సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరానీ. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ కథనంలో విక్కీ కౌశల్, అనుష్క శర్మ కూడా నటించారు. ఈ చిత్రం అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు అపారమైన గుర్తింపు తీసుకొచ్చింది. -
ఎదురు చూస్తున్నా
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కెరీర్లో ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’(2003), ‘లగే రహో మున్నాభాయి’ (2006) చిత్రాలు ప్రత్యేకమైనవి. ఈ రెండు చిత్రాల్లో మంచి ఎమోషన్‌కు కాస్త కామిక్‌ను జోడించి హిట్స్ అందుకున్నారు సంజయ్‌దత్. ఈ రెండు సినిమాలకు రాజ్‌కుమార్ హిరాణీయే దర్శకుడు. మరి... ఈ మున్నా భాయ్ ఫ్రాంౖచైజీలో థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్నను సంజయ్‌దత్ ముందు ఉంచితే – ‘‘మరో సీక్వెల్ రావాలని నేను కూడా దేవుణ్ని కోరుకుంటున్నాను. కానీ ఈ విషయం గురించి స్పందించాల్సింది దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. నేనైతే ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్‌కి కథ రాస్తున్నానని గతంలో రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మరి.. కథ ఎందాకా వచ్చింది? అనే విషయంలో క్లారిటీ లేకే సంజయ్ ఈ విధంగా చెప్పి ఉంటారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’ చిత్రాన్ని ‘శంకర్దాదాఎమ్బీబీఎస్’ (2004)గా, ‘లగే రహో మున్నాభాయ్’ చిత్రాన్ని ‘శంకర్‌దాదా జిందాబాద్’ (2007)గా చిరంజీవి తెలుగులో రీమేక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
మున్నాభాయ్-3కి... స్క్రిప్ట్ దొరికింది!
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సంచలనం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రకథ తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో రీమేకై, ఘన విజయం సాధిం చింది. తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’గా చిరంజీవి చేసిన సందడి ఎవరూ మర్చిపోలేరు. సెకండ్ పార్ట్ ‘లగేరహో మున్నాభాయ్’ కూడా హిందీ నుంచి ఇతర భాష ల్లోకి వెళ్ళింది. మున్నాభాయ్ మూడోపార్ట్ తీస్తానని ఎప్పటి నుంచో ఊరిస్తున్న రాజ్‌కుమార్ హిరానీ ఇప్పుడు ఆ సినిమాకు స్క్రిప్ట్ ఐడియా కొలిక్కివచ్చిందని వెల్లడించారు. సంజయ్‌దత్ జీవితచరిత్ర ఆధారంగా తీయాలనుకుంటున్న సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే, మున్నాభాయ్- 3కి కూడా కసరత్తులు చేస్తున్నారాయన. ‘‘పార్ట్3కి మంచి ఐడియా తట్టింది. ఈ స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాం. ఇందులో సంజయ్‌దత్, అర్షద్వార్శీలే ప్రధాన పాత్రలు పోషిస్తారు. అయితే వాళ్లను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం లేదు. ఎందుకంటే స్టార్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే అంత స్వేచ్ఛగా ఆలోచనలు రావని నా అభిప్రాయం’’ అని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. సో... బీ రెడీ ఫర్ ‘మున్నాభాయ్-3’