breaking news
Multilateral Competent Authority Agreement
-
పన్ను సమాచార మార్పిడికి భారత్ ఓకే
బీజింగ్: ఇతర దేశాలతో పన్ను సంబంధిత అంశాల సమాచార మార్పిడి కోసం భారత్.. ‘మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్’పై సంతకం చేసింది. చైనా, ఇజ్రాయెల్, కెనడా, ఐలాండ్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేసినవాటిలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతోన్న పదవ ఫోరమ్ ఆన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) సదస్సులో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాలు వాటి వాటి పన్ను నివేదికలను పరస్పరం ఒకదానితో మరొకటి మార్చుకోవచ్చని ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఓఈసీడీ) తెలిపింది. ఆయా దేశాలు పన్ను వ్యవస్థ మెరుగుదలకు పర స్పరం సహకరించుకోవచ్చని పేర్కొంది. -
ఆర్థిక సమాచార మార్పిడిపై మరో ఒప్పందం
ఐదు దేశాలతో జత కట్టిన భారత్ న్యూఢిల్లీ: ఆర్థిక వివరాలను స్వేచ్ఛగా మార్పిడి చేసుకునేందుకు భారత్ సహా ఆరు దేశాలు తాజాగా ఓ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో పన్ను ఎగవేతలు, నల్లధనం పోరులో మరో ముందడుగు పడినట్లయింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, ఇండోనేసియా, న్యూజిలాండ్‌లు ఈ మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్(ఎంసీఏఏ)ను పారిస్‌లో కుదుర్చుకున్నాయి. దీంతో భారత్‌తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న దేశాల సంఖ్య 60కి చేరింది. మరోవైపు విదేశాల్లో నల్లధనం కలిగి ఉన్న వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఐటీ శాఖకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే జరిగే పొరపాట్ల వల్ల దేశానికి నష్టం జరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. ఆ పొరపాట్లను సాకుగా చూపి.. భవిష్యత్తులో నల్లధనం వివరాలను అందించడానికి విదేశాలు నిరాకరించవచ్చని పేర్కొంది.