breaking news
multi storey building
-
NewYork: అపార్ట్మెంట్లో మంటలు.. భారత జర్నలిస్టు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం హార్లెమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఎగిసిపడ్డ మంటల్లో భారత్‌కు చెందిన యువకుడు ఫజిల్ ఖాన్(27) మృతి చెందాడు. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరే మంటలకు కారణమని అధికారులు తెలిపారు. మంటల్లో గాయాలపాలైన ఫజల్ఖాన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొలంబియా జర్నలిజం స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫజల్‌ఖాన్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఫజల్‌ఖాన్ తల్లిదండ్రులను సంప్రదించామని, అతడి మృతదేహాన్ని భారత్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. మంటలు తొలుత పై అంతస్తుల్లో ప్రారంభమయ్యాయని, దీంతో అపార్ట్మెంట్లో పై అంతస్తుల్లో ఉన్నవారు కిటికీల్లో నుంచి దూకారని అఖిల్ జోన్స్ అనే స్థానికుడు తెలిపాడు. తాను, తన తండ్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్నాడు. ఫోన్, తాళాలు తప్ప తాము తమ వెంట ఏమీ తెచ్చుకోలేదని చెప్పాడు. అగ్ని ప్రమాదం కారణంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి.. పుతిన్ ప్రత్యర్థి హత్య.. వెలుగులోకి సంచలన విషయం -
ఏడంతస్తుల భవనంలో పేలుడు..14 మంది మృతి..100 మందికి గాయాలు
ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గలిస్తాన్ ప్రాంతంలో అత్యంత రద్దిగా ఉండే సిద్దిఖీ బజార్లో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఏడు అంతస్తులున్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పలు ఆఫీస్‌లు, స్టోర్లు ఉన్నాయి. పేలుడు అనంతరం 11 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో శానిటైజేషన్ మెటీరియల్స్ విక్రయించే ఓ స్టోర్‌లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం -
ఎత్తైన బిల్డింగ్.. ఎగిసిపడుతున్న జ్వాలలు
భారీ అగ్నిప్రమాదంతో సుందర నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ఎత్తైన భవంతిలో.. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో దట్టమైన పొగలు కమ్ముకుని భీతావహ వాతావరణం నెలకొంది. ఇటలీ మిలన్లో ఇరవై అంతస్థుల భవంతిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తైన ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. మిలన్లో సుందరమైన భవనంగా పేరున్న ఈ బిల్డింగ్.. ప్రమాదం ప్రభావంతో మసిబట్టి పోయింది. -
చిక్కుల్లో ‘ఆ ముగ్గురు’
చెన్నై, సాక్షి ప్రతినిధి :చెన్నైలో బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలడంతో పెద్ద సంఖ్యలో పేదలు మృతి చెందారు. ఈ ఘటనతో బిల్డర్, భవన యజమానులు, బ్యాంకర్ల భవిష్యత్తుతో చీక ట్లు అలుముకునే ప్రమాదం ఏర్పడింది.కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న 11 అంతస్తుల అపార్టుమెంటులో 44 నివాస గృహాలు ఉన్నట్లు తేలింది. వారంతా బ్యాంకుల ద్వారా రుణం పొంది ముందుగా కొంత మొత్తం చెల్లించినట్టు సమాచారం. బిల్డర్, యజమానితోపాటు ఆరుగురు కటకటాలపాలైన నేపథ్యంలో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి డిపాజిట్ల మొత్తం ఇప్పట్లో వాపస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్లు కొనుగోలు చేసేవారు మొత్తం సొమ్ములో బిల్డరుకు 20 శాతం శాతం చెల్లించి అగ్రిమెంటు చేసుకున్న తర్వాత మిగిలిన 80 శాతం మొత్తాన్ని బ్యాం కర్లు మంజూరు చేస్తారు. అది కూడా బిల్డరుకు 10 దశల్లో చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పునాదులు వేసినప్పటి నుంచి విడతల వారీగా చెల్లించాలన్న నిబంధనను పాటించకుండా కమీషన్‌కు కక్కుర్తిపడి 80 శాతం ఒకేసారి చెల్లించే అవకాశాలు ఉన్నాయని ఒక సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు. ఇక్కడ కూడా బ్యాంకర్లు ఉదారంగా మొత్తం 80 శాతం మంజూరు చేసి ఉంటే చిక్కుల్లో పడడం ఖాయమని, బ్యాంకు అధికారులు సైతం బాధితుల జాబితాలోకి చేరిపోతారని వెల్లడించారు. దేవుడి పేరు పెట్టుకున్న ఒక బ్యాంక్, మరో బీమా సంస్థ మొత్తం ఐదు సంస్థ లు ఈ బిల్డర్‌కు రుణం మంజూరు చేశాయన్నారు. అలాగే నిర్మాణం ప్రారంభమైన రోజు నుంచి 18 నెలల తర్వాత ఇంటి యజమానులు తమ పేరున మంజూరైన రుణంపై వాయిదాలు చెల్లించాల్సి ఉం టుంది. కూలిన భవనంలో ఇళ్లు కొనుగోలు చేసిన వారు వాయిదాలు చెల్లించే పరిస్థితి లేదు. కూలిన ప్రమాదంతో తమకు సంబంధం లేదని బ్యాంకులు ఒత్తిడి చేసే అవకాశం ఉందని ఇంటి యజమానుల్లో ఆందోళన నెలకొంది. అపార్టుమెంటు కూలడానికి బిల్డరే బాధ్యత వహించి ఇంటిని బుక్ చేసుకున్న వారికి మొత్తం సొమ్మును చెల్లించాలి. అందరూ జైళ్లలో చిక్కుకుని ఉండగా వాయిదాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపితే దిక్కేమిటని భయపడతున్నారు. గత్యంతరం లేక కోర్టును ఆశ్రయించినా ఫలితం వెంటనే దక్కదని ఆందోళన చెందుతున్నా రు. సహజంగా ఒక భారీ నిర్మాణం చేపట్టే సమయం లో బేల్దారి కూలీలకు బీమా చేస్తారని, ఈ బిల్డరు కూడా బీమా చేసి ఉంటే కార్మికులకు బీమా సొమ్ము అందుతుంది. అవకతవకల నిర్మాణం చేపట్టిన బిల్డ రు ఇలాంటి పద్ధతులు పాటించి ఉంటాడా అని అనుమానిస్తున్నారు. అలాగే రుణం మంజూరు చేసిన బ్యాంకర్లు సైతం ఇంటి యజమానుల పేరున బీమా చేయిస్తారు. బీమా విధానాలను సక్రమంగా పాటిం చి ఉంటే ఇంటి యజమానులు, బిల్డర్లు, బ్యాంకు అధికారులు అందరూ ఆర్థిక భారం నుంచి బయట పడతారు. లేకుంటే వారి భవిష్యత్తు ఆందోళనకరమే.సీఎండీఏలో గుబులు భవన శిథిలాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ చేపట్టిన పీడబ్ల్యూడీ అధికారులు నిర్మాణ లోపం వల్లే బహుళ అంతస్తుల భవనం కూలిపోయిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. నాశిరకం సిమెంటు, ఇనుము వాడడం, పునాదులు పటిష్టంగా లేకపోవడం ప్రమాదానికి కారణాలుగా తేల్చినట్లు తెలిసింది. ఈ నివేదిక వల్ల తమకెలాంటి ముప్పు వస్తుందోనని చెన్నై మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారుల్లో గుబులు పట్టుకుంది. అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామేగాని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉంటే తమ తప్పిదం కాదని అధికారులు సమర్థించుకుంటున్నారు. పోరూరు నీటి గుంటలో నిర్మాణం జరగడం, మెత్తని ప్రాంతం కాబట్టే అపార్టుమెంటు కిందకు కూరుపోయిందని తేలడం వల్ల ఇలాంటి చోట ఎలా అనుమతించారని సీఎండీఏ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పీడబ్ల్యూడీ అధికారులు సమర్పించిన నివేదిక తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని సీఎండీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు.