-
సంచలనాలతో షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్‌లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జెబర్ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్‌తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్‌లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్‌కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు. మెద్వెదెవ్ కష్టపడి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
ముగురుజా నిష్క్రమించె...
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణుల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) ఇంటిముఖం పట్టగా... ఈ ఐదుగురి సరసన మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) చేరడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా 7–5, 2–6, 1–6తో ప్రపంచ 47వ ర్యాంకర్ అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఉత్వానక్ తన కెరీర్లో తొలిసారి టాప్–10లోపు క్రీడాకారిణిపై గెలిచింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–5, 7–6 (7/2)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆమె సోదరి వీనస్ 2–6, 7–6 (7/5), 6–8తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఎవగెనియా రొడినా (రష్యా) 7–5, 5–7, 6–4తో పదో సీడ్ మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగం మూడో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–3, 7–5, 6–2తో స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అన్‌సీడెడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 5–7, 6–4, 6–4, 6–2తో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా)పై గెలుపొందాడు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట పరాజయం పాలైంది. ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్)–సాలిస్బరీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 6–7 (4/7)తో తొలి రెండు సెట్లను కోల్పోయి... మూడో సెట్లో 1–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. -
ముగురుజా మురిసె...
-
ముగురుజా మురిసె...
♦ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం ♦ ఫైనల్లో వీనస్‌పై విజయం ♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం అనుభవంపై పట్టుదల గెలిచింది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఐదుసార్లు చాంపియన్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల ముగురుజా కళ్లు చెదిరే ఆటతీరును ప్రదర్శించింది. ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడంతోపాటు ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించాలని ఆశించిన వీనస్‌కు నిరాశే మిగిలింది. లండన్: తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలైనా... వింబుల్డన్ గ్రాస్‌కోర్టులపై అద్భుత రికార్డు కలిగినా... అవేమీ పట్టించుకోకుండా స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా ఒక వ్యూహం ప్రకారం ఆడింది. వీనస్‌ను ఎక్కువ భాగం బేస్‌లైన్‌కే పరిమితం చేస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ... అనవసర తప్పిదాలు చేసేలా ఆడుతూ ముగురుజా అనుకున్న ఫలితాన్ని సాధించింది. రెండేళ్ల క్రితం వింబుల్డన్ సెంటర్ కోర్టులో సెరెనా విలియమ్స్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి... ఈసారి అదే వేదికపై సెరెనా అక్క వీనస్‌పై ముగురుజా ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్ ముగురుజా 7–5, 6–0తో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్ ఆడిన వీనస్ నాలుగోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తాజా విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లను ఓడించిన ఏకైక క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి ముగురుజా చాంపియన్‌గా నిలిచింది. కొంచిటా మార్టినెజ్ (1994లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా ఘనత వహించింది. ఈ టోర్నీలో ముగురుజాకు కొంచిటా కోచ్‌గా ఉండటం మరో విశేషం. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో తొలి సెట్ ఆసక్తికరంగా సాగింది. స్కోరు 5–4 వద్ద ఉన్నపుడు ముగురుజా సర్వీస్‌లో వీనస్‌కు రెండు సెట్ పాయింట్లు లభించాయి. అయితే ముగురుజా కచ్చితమైన సర్వీస్‌లు చేసి ఈ గేమ్‌ను కాపాడుకుంది. దాంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో ముగురుజా పూర్తి ఆధిపత్యం చలాయించింది. మూడుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తం లో ముగురుజా 14 విన్నర్స్ కొట్టి, 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు వీనస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. సిలిచ్ @ ఫెడరర్ నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్‌తో సహా బావిలో పడి రైతు మృతి
ఎన్నికల్లో కమ్యూనిస్టులే ప్రధాన భూమిక
పర్యావరణ రక్షణకు న్యాయవ్యవస్థ కృషి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
రేపే నీట్
జీవాలను కాపాడుకుందాం..
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement