వింబుల్డన్ రాణి ఎవరో? | Wimbledon women's singles final today | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ రాణి ఎవరో?

Jul 11 2015 6:52 PM | Updated on Sep 3 2017 5:15 AM

వింబుల్డన్ రాణి ఎవరో?

వింబుల్డన్ రాణి ఎవరో?

సెరెనా విలియమ్స్ (అమెరికా), ముగురుజా (స్పెయిన్) శనివారం వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.

వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ నేడు
 
లండన్: ఒకవైపు అపార అనుభవమున్న అగ్రశ్రేణి తార... మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న యువతార... ఈ నేపథ్యంలో సెరెనా విలియమ్స్ (అమెరికా), ముగురుజా (స్పెయిన్) శనివారం వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీకి సిద్ధమయ్యారు. భారత కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం  ఫైనల్ సమరం ప్రారంభమైంది.
 

ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెరెనాను టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నప్పటికీ, సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ముగురుజాను తక్కువ అంచనా వేయలేం. ముఖాముఖి రికార్డులో సెరెనా 2-1తో ఆధిక్యంలో ఉంది.  ఒకవేళ సెరెనా గెలిస్తే ఓపెన్ శకంలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా నిలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement