breaking news
MSR Indias defense
-
ఎంఎస్ఆర్ ఇండియా లాభం రూ. 2 కోట్లు
ఎంఎస్ఆర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2017–18) నాల్గవ త్రైమాసికంలో (క్యూ4) రూ.2.03 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. ఇక కంపెనీ టర్నోవర్ 24 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.1.11 కోట్లుగా, టర్నోవర్ రూ.113 కోట్లుగా ఉంది. దేశపవ్యాప్తంగా డా.కాపర్ ప్రొడక్ట్‌కు ఉన్న డిమాండ్ కారణంగా టర్నోవర్‌లో బలమైన వృద్ధి నమోదయ్యిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
డిఫెన్స్ లోకి ఎంఎస్ఆర్ ఇండియా
రూ.20 కోట్లతో తయారీ యూనిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఆర్ ఇండియా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ రంగానికి అవసరమైన ప్రత్యేక విడిభాగాల తయారీకై యూరప్ నుంచి అత్యాధునిక కోల్డ్ ఫోర్జింగ్ మెషీన్‌ను దిగుమతి చేసుకుంది. భారత్‌లో అరుదైన మెషీన్లలో ఇది ఒకటని కంపెనీ వెల్లడించింది. అన్ని రకాల ఫోర్జింగ్, ఎక్స్‌ట్రూషన్ పనులకు దీనిని వినియోగించొచ్చు. సొంతంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సైతం నెలకొల్పినట్టు ఎంఎస్ఆర్ ఇండియా తెలిపింది. ఇక జీడిమెట్లలో ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. మెషినరీకి రూ.8 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.12 కోట్లను కంపెనీ వెచ్చిస్తోంది. నెల రోజుల్లో ఉత్పాదన ప్రారంభం అవుతుంది. కొత్త యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్‌తోపాటు వాహన విడిభాగాలు, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్, కంజ్యూమర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ పరికరాల తయారీ రంగంపైనా సంస్థ దృష్టిసారిస్తుంది.