breaking news
motorbikes
-
ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్‌లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం!
ఎలక్ట్రిక్ స్కూటర్లు (ఈ-స్కూటర్లు) నడపడం మోటార్‌సైకిళ్లు లేదా సైకిళ్లు నడపడం కంటే ప్రమాదకరమని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ-స్కూటర్ (చిన్న చక్రాలవి) ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలను ‘ది గార్డియన్’ నివేదించింది.చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌కు చెందిన హ్యాండ్, ట్రామా, ఆర్థోపెడిక్ సర్జన్ డేవిడ్ బోడాన్స్కీ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. 2020 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్, వేల్స్‌లోని 18 నగరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని జాతీయ ప్రధాన ట్రామా రిజిస్ట్రీ నుంచి పరిశోధకులు విశ్లేషించారు.తలకు గాయాల ముప్పు మూడు రెట్లుమోటార్సైకిల్ రైడర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ రైడర్లకు మెదడు గాయం లేదా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే అంతర్గత అవయవాలకు గాయాలయ్యే అవకాశం సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఎముకలు విరిగే ప్రమాదం మాత్రం సైక్లిస్టులు, మోటార్‌సైకిల్ రైడర్లతో పోలిస్తే తక్కువగా నమోదైంది.చిన్న చక్రాలే ప్రధాన కారణమా?ఈ-స్కూటర్ల డిజైన్ కూడా ప్రమాద తీవ్రతకు ఓ కారణమని బోడాన్స్కీ అభిప్రాయపడ్డారు. చిన్న పరిమాణంలో ఉండే చక్రాలు గుంతలు, రోడ్డు గుంతలు లేదా ఇతర అడ్డంకుల్లో సులభంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీంతో రైడర్లు అదుపు తప్పి హ్యాండిల్బార్లపై నుంచి ముందుకు ఎగిరి తలపై పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఈ-స్కూటర్ రైడర్లలో 6 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్ ధరించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తలకు సంబంధించిన గాయాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మహిళలు, యువతకూ అధిక ముప్పుఈ-స్కూటర్ ప్రమాదాల్లో లింగపరమైన తేడాలు కూడా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళలు సుమారు మూడో వంతు ఎక్కువగా ప్రమాదాలకు గురైనట్లు, అలాగే తీవ్రమైన గాయాలు నమోదయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ-స్కూటర్ల హ్యాండిల్బార్లు సాధారణంగా పురుషుల శరీరాకృతికి అనుగుణమైన ఎత్తులో ఉండటం కూడా మహిళలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఓ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మొత్తం ఈ-స్కూటర్ గాయాల్లో 16 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలంటున్న నిపుణులుయూకేలోని చాలా ప్రాంతాల్లో పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ లేన్లపై ప్రైవేట్ ఈ-స్కూటర్లను నడపడం చట్టబద్ధం కాదు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వారి నుంచి పోలీసులు వేలాది ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్ వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి భద్రతా శిక్షణ, హెల్మెట్ వినియోగం, మెరుగైన డిజైన్‌తో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ రైడర్లకు భద్రత కల్పించేలా ఈ-స్కూటర్ల రూపకల్పన, వినియోగ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా
తీరిక దొరికినప్పుడు ఏదో ఒక పుస్తకంలో మునిగిపోయి ఇల్లుదాటేది కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయన. ఈసారి చదివిన ఒక పుస్తకం ప్రభావం వల్ల ఇల్లే ప్రపంచం కాదని, ఇల్లు దాటితేగాని ప్రపంచం పరిచయం కాదనే విషయం అర్థమైంది. ‘ఎర్నెస్టో చే గువేరా మోటర్ సైకిల్ డైరీస్ పుస్తకం నన్ను మార్చేసింది. మిత్రుడితో కలిసి బైక్‌పై తొమ్మిది నెలల్లో వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు చే. కొండలు, కోనలు దాటుతూ ఒకే ప్రపంచంలో అనేక ప్రపంచాలు చూశారు ఇద్దరు. ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయాణం ఉపయోగపడుతుందనే వాస్తవం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను’ అంటున్న నయన ‘సీఆర్ఎఫ్’ తరపున మూడు రోజుల ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ యాత్రను విజయవంతంగా పూర్తిచేసింది. సీఆర్ఎఫ్ (కాలికట్ రైడర్స్ ఫ్యామిలీ)లో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన రైడర్స్ వేరే ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడి ‘సీఆర్ఎఫ్’ సభ్యులు ఆతిథ్యం ఇస్తుంటారు. ఒకరికొకరు పరిచయం అవుతుంటారు. ‘సీఆర్ఎఫ్’లో సభ్యులుగా గృహిణులు, విద్యార్థులు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉన్నారు. ‘సీఆర్ఎఫ్’ సభ్యురాలైన షామ్న మొదట్లో సరదాగా భర్త బైక్ తీసుకొని అక్కడక్కడే రైడ్ చేసేది ‘సీఆర్ఎఫ్’లో భాగం అయిన తరువాత ఆమె ప్రయాణ విస్తృతి పెరిగింది. ‘బైక్‌పై భర్త వెనక కూర్చొని వేరే ఊరికి పోవడం తప్ప, నేను సొంతంగా డ్రైవ్ చేస్తూ పరాయి ఊరు ఎప్పుడూ వెళ్లలేదు, దీనికి కారణం భయం. నాలోని భయాన్ని సీఆర్ఎఫ్ తొలగించి, ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది’ అంటుంది షామ్న. ‘మినీ కె టు కె’ గ్రూప్‌లోని పద్నాలుగు మందిలో షామ్న ఒకరు. ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ బైక్ రైడ్‌కు ‘మినీ కె టు కె’ అని పేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వారి భవిష్యత్ లక్ష్యం... కె టు కె. అంటే కన్యాకుమారి టు కశ్మీర్. ‘మినీ కె టు కె’ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పద్నాలుగు మంది బృందం భవిష్యత్ ‘కె టు కె’ లక్ష్యంపై దృష్టి పెట్టింది. ‘మినీ కె టు కె’లో జావా, బీఎండబ్యూ, కేటియం డూక్, రాయల్ ఎన్ఫీల్డ్, క్లాసిక్ అండ్ హిమాలయన్.. ఇలా సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో కంపెనీ బైక్‌లు వాడారు. రోడ్డుపై ఈ బైక్‌లు పరుగులు తీస్తుంటే...అదొక సుందరదృశ్యం. ‘జర్నీ ఈజ్ మై హోమ్’ అనే వాక్యాన్ని గుర్తు చేసే సందర్భం! చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! పాత వీడియో -
బ్యాంకాక్ లో ఉబెర్ బైక్ ట్యాక్సీలు
థాయ్ః యాప్ ద్వారా అద్దె కార్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నఉబెర్ సంస్థ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వినియోగదార్లకు ఇప్పటివరకూ కార్లను మాత్రమే సరఫరా చేస్తున్న సంస్థ తాజాగా మోటర్ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశ పెడుతోంది. బ్యాంకాక్ లో పైలట్ పథకాన్ని ప్రారంభించిన ఉబెర్.. త్వరలో ఆసియా మొత్తం తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. కారు యజమానులు ఎక్కువవడం, సిటీ ప్లానింగ్ సరిగా లేకపోవడంతో థాయ్ రాజధాని నగరం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. ఇది గమనించిన ఉబెర్ సంస్థ నగరంలో మోటర్ బైక్ ల వాడకానికి నాంది పలికింది. ట్రాఫిక్ జామ్ లను నివారించడంలో భాగంగా ప్రారంభించిన ఉబికిటస్ మోటార్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఆరెంజ్ జాకెట్లను ధరించి నగరంలో ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సింగపూర్ కు చెందిన గ్రాబ్ ట్యాక్సీ బైక్ ట్యాక్సీ సర్వీసులను ప్రవేశపెట్టి, ప్రయాణీకులను ఆకట్టుకుంటుండగా... ఉబెర్ పోటీగా తన మోటర్ బైక్ సర్వీసులను ప్రారంభించింది. గతేడాది బ్యాంకాక్ లో ట్యాక్సీలను పరిచయం చేసిన సంస్థ.. ఇంటినుంచి, లేదా ఆఫీసులనుంచి ప్రయాణీకులను తరలిస్తూ ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుని, ప్రస్తుతం మోటర్ బైక్ సర్వీసులను కూడ ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఉబెర్ సంస్థ... ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 బిలియన్ డాలర్లతో 68 దేశాల్లోతమ సేవలను ప్రారంభించినప్పటినుంచీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పలు ప్రాంతాల్లో డ్రైవర్ల కారణంగా ఎన్నో అడ్డంకులను చవిచూసింది. అయితే ఇతర ట్యాక్సీల మీటర్లు, రేట్లతో ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రయాణీకులను ఆకట్టుకోవడంతో పాటు బ్యాంకాక్ లో గ్రాబ్ టాక్సీలకు సవాలుగా నిలుస్తోంది. సాధారణ మోటర్ బైక్ ట్యాక్సీలకంటే భిన్నంగా అత్యంత చవుకగా ఇప్పుడు ఉబెర్ మోటర్ బైక్ ట్యాక్సీలను ముందుగా బ్యాంకాక్ లోని కొన్ని జిల్లాల్లో ప్రవేశ పెడుతోంది. ట్రాఫిక్ సమస్యతో బాధపడే థాయిల్యాండ్ పై అధికంగా దృష్టిని పెట్టిన ఉబెర్... ఇప్పుడు ఆసియాలోని అనేక ట్రాఫిక్ బాధిత ప్రాంతాలపై కూడ దృష్టి సారించనుంది.


