breaking news
mother and doughter
-
పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో కలిసి
సాక్షి, పటాన్చెరు టౌన్: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని మంజీర పంప్ హౌస్‌లో చంద్రకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11 తేదీ ఉదయం చంద్రకుమార్ భార్య ఊర్మిళ, రెండున్నర సంవత్సరాల కూతురు జాహ్నవితో కలసి హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్న పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం చంద్రకుమార్ భార్యకు ఫోన్‌చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ మెస్సేజ్ రావడంతో అత్తగారింటికి ఫోన్‌చేయగా ఇంకా రాలేదని చెప్పారు. భార్య, కూతురు కోసం తెలిసిన వారిని, బంధువులను విచారించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంద్రకుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆహారంలో తీసుకున్న చికెన్ గ్రేవీ, శీతల పానీయం విషతుల్యమై కుమార్తెతో సహా తల్లి కుమార్తె విగతజీవులయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలోని తంగప్ప నగర్‌కు చెందిన కర్పగం(30) తన ఇంటి సమీపంలోని ఓ హోటల్లో చికెన్ గ్రేవిని బుధవారం కొన్నారు. మధ్యా హ్నం భోజనంలో ఆ చికెన్ గ్రేవీని కుమార్తె దర్శిని(4)తో పాటు కర్పగం తీసుకున్నారు. అజీర్ణం సమస్య తలెత్తడంతో మరో దుకాణంలో ఓ శీతలపానీయం బాటిల్ తీసుకొచ్చి తల్లి, కుమార్తె తాగారు. కొంతసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరి మరణానికి చికెన్ గ్రేవీ లేదా శీతల పానీయం కారణం కావొచ్చని మృతుల బంధువులు ఫిర్యా దు చేయడంతో కోవిల్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. -
తండ్రిని కొట్టి తల్లీకూతుళ్లపై అత్యాచారం..
* వారిద్దరితోపాటు కుటుంబ యజమానిపైనా హత్యాయత్నం * కోమాలోకి బాలిక తల్లిదండ్రులు కామాంధుడి ఘాతుకం * పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ సంఘటన ద్వారకాతిరుమల : అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వారిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవ దహనం చేసేందుకు యత్నించాడు.ఇది చూసిన ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయింది. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ హనుమాన్లగూడెంలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్లగూడెంలోని ఒక పొలంలో శక్కాబత్తుల రాంబాబు భార్య సుమలత, ఇద్దరు కుమార్తెలతో కలసి నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వచ్చిన దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి బాలకృష్ణ రైతు రాంబాబుతో స్నేహంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తోటలోని సొరకాయలను కోసి భీమడోలు మార్కెట్లో విక్రయించేందుకు మోపెడ్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం బాలకృష్ణను వారి బంధువుల ఇంటి వద్దకు చేర్చిన రాంబాబు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. రాత్రి రాంబాబు ఇంటికి వచ్చిన బాలకృష్ణ.. ఇంటి వెనుక గొర్రెలకు మేత వేస్తున్న రాంబాబుపై వెనుక నుంచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవకు బయటకు వచ్చిన అతని భార్యను ఒక రాయితో కొట్టాడు. రాంబాబు దాడితో భార్యాభర్తలిరువురూ స్పృహ కోల్పోగా సుమలతపై అత్యాచారం చేశాడు. అప్పటికి నిద్రలేచిన 13 ఏళ్ల వయస్సుగల రాంబాబు కుమార్తెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టివేసి గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో పడవేశాడు. అనంతరం ఇంటిలోకి ప్రవేశించి గ్యాస్‌ను వదిలి నిప్పంటించి ఇంటిని సైతం దగ్ధం చేశాడు. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదంతా చూసిన 11 ఏళ్ల ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లో ఉన్న గడ్డివాములో దాక్కొంది. గురువారం మంటలను ఆర్పే సమయంలో ఆమెను గుర్తించిన బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. స్పృహ కోల్పోయిన రాంబాబు దంపతులను స్థానికులు 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. 30 శాతం కాలిన గాయాలతో బాలిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలిని పరిశీలించింది. డీఎస్పీ సరిత మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించామని, తాగుడుకు బానిసై ఉన్మాదిగా మారిన ఇతనిపై తల్లితండ్రులు సైతం గతంలో దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఆమె వెంట దెందులూరు ఎస్సై సుభాష్ తదితరులున్నారు.