breaking news
monitoring device
-
కరోనా రోగుల పర్యవేక్షణకు కొత్త పరికరం
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులను పర్యవేక్షించడం డాక్టర్లకూ కత్తిమీద సామే. పీపీ ఈ కిట్లు, మాస్కులు, తరచూ శానిటైజేషన్ తప్పనిసరి! మరి ఇవేవీ లేకుండా.. ఆ మాటకొస్తే సమీపంలోకి వెళ్లకుండానే రోగి తాలూకూ వివరాలన్నీ పొందగలిగితే? వైద్యుల పని సులువవుతుంది. ఈ అద్భుతాన్ని మద్రాస్ ఐఐటీ సాధించింది. కరోనా రోగుల చికిత్సకు కీలకమైన గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకొనే వేగం, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను దూరం నుంచే చూసేందుకు ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. హెల్త్‌కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ (హెచ్‌టీఐసీ)తోపాటు హేలిక్సన్ అనే స్టార్టప్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వినూత్న పరికరాన్ని ఇప్పటికే సుమారు 2 వేల మంది రోగులకు ఉపయోగించారు. మరో 5 వేల మంది పర్యవేక్షణకు పరికరాలు సిద్ధమవుతున్నాయి. పరికరం స్థాయి, అందులోని కొలమానాలను బట్టి దీని ధర రూ. 2,500 నుంచి రూ.10 వేల మధ్య ఉంది. ఒకసారి ఈ పరికరాన్ని రోగి వేలికి తొడిగితే చాలు.. వివరాలన్నీ మొబైల్ ఫోన్‌కు లేదా సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్‌కు చేరతాయి. రోగి శరీర ఉష్ణోగ్రతలను చంకల నుంచి సేకరిస్తే.. ఆక్సిజన్ మోతాదులు, ఇతర వివరాలను వేలి నుంచే తీసుకోవచ్చు. ఏడాదిపాటు పనిచేసే ఈ పరికరాన్ని మళ్లీమళ్లీ వాడుకోవచ్చు కూడా. కరోనా తదనంతరం కూడా... కరోనా తదనంతర పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని వాడుకోవచ్చని హెచ్‌టీఐసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ మోహన్ శంకర్ శివప్రకాశం తెలిపారు. శరీర వివరాలను తెలిపే పరికరాలు మార్కెట్లో ఇప్పటికే కొన్ని వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ కచ్చితమైన వివరాలు ఇవ్వవని, అందుకే వైద్యులు ఆసుపత్రుల్లో వాటిని వాడేందుకు ఇష్టపడరని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన పరికరం ఆసుపత్రుల్లో ఉపయోగించే మానిటరింగ్ వ్యవస్థలతో సమానమైన ఫలితాలిస్తుందని చెప్పారు. ఏడాదిపాటు చెన్నై, చుట్టుపక్కల ఉన్న అనేక ఆసుపత్రుల్లో తాము ఈ పరికరంపై పరీక్షలు జరిపామని, కచ్చితమైన ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సులు రోగుల సమీపానికి వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు... తద్వారా ఖర్చులు తగ్గించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు. ఆక్సిజన్ మోతాదును గుర్తించే పరికరాన్ని జోడించడం ద్వారా ఈ పరికరం ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందిపై పనిభారం గణనీయంగా తగిస్తుందని, అదే సమయంలో ఇళ్లలో ఉన్నవారి వివరాలను కూడా గమనిస్తూ తగిన సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని హేలిక్సన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌శంకర్‌రాజా తెలిపారు. వందల మంది రోగుల వివరాలను ఒకేచోట నుంచి పర్యవేక్షించే స్థాయికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేయవచ్చని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో విషమ పరిస్థితి ఎదుర్కొంటున్న రోగులను వెంటనే గుర్తించవచ్చని తెలిపారు. -
బుడుగుల అడుగులకుమడుగులొత్తే గ్యాడ్జెట్స్!
పసిపిల్లలు ఏడుస్తారు.. ఎందుకో అర్థం కాదు. ఎక్కడికో పాకుతూ పోతారు.. ఎక్కడున్నారో ఎంతకూ దొరకరు. శరీరం వేడిగా అనిపిస్తుంది.. ఆరోగ్యం ఎలా ఉందో తెలియదు. ఇంకా అనేక సందేహాలు, సమస్యలు.. కానీ పిల్లలపై పర్యవేక్షణ కోసం అనేక గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటితో ఎక్కడున్నా పిల్లలను చక్కగా పర్యవేక్షించొచ్చు... చిన్నారి రోజుకు ఎన్ని గంటలునిద్రపోయింది? చివరిగా ఎప్పుడు ఆహారం తీసుకుంది? అన్నదీ తెలుసుకోవచ్చు. లైవ్ మానిటర్ మోడ్‌లో ఉంటే... పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారు? గదిలో ఉష్ణోగ్రత ఎలా ఉందో గుర్తించవచ్చు. టైమ్‌లైన్ మోడ్‌లో పెడితే.. 24 గంటల సమాచారమూ అందుతుంది. చిన్నారుల పర్యవేక్షణకు ఆడియో, వీడియో మానిటరింగ్ డివైస్‌లతోపాటు జీపీఎస్ ట్రాకింగ్, లొకేటర్ ఫైండింగ్ సౌకర్యాలున్న పరికరాలు మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, పర్యవేక్షించడానికి అనేక మొబైల్ అప్లికేషన్లు కూడా వచ్చాయి. వీటితో మనం ఎక్కడ ఉన్నా.. పిల్లలను పర్యవేక్షించేందుకు వీలవుతుంది. పిల్లల పర్యవేక్షణకు ఉపయోగపడే అలాంటి కొన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.. శ్వాసలో మార్పును పసిగడుతుంది! బుజ్జాయిల గుండె కొట్టుకునే వేగంతోపాటు శరీర ఉష్ణోగ్రత, శ్వాస, నిద్రపోతున్న తీరు, కదలికలను పర్యవేక్షించేందుకు ఉపయోగపడే బేబీ మానిటర్ కజీఝౌ ఓజీఝౌౌట. కిమోనో (జపాన్ భాషలో ప్రత్యేక సంప్రదాయ వస్త్రం)లో అమర్చిన తాబేలు ఆకారంలోని సెన్సర్ చిన్నారుల కదలికలను గుర్తించి ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ ఆప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం పంపుతుంది. కిమోనోపై పట్టీల్లో ఉండే అదనపు సెన్సర్లు చిన్నారుల శ్వాస, ఉష్ణోగ్రతల్లో తేడాలను పసిగట్టి సమాచారం అందిస్తాయి. చిన్నారి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోయింది? చివరిగా ఎప్పుడు ఆహారం తీసుకుంది? అన్నదీ తెలుసుకోవచ్చు. లైవ్ మానిటర్ మోడ్‌లో ఉంటే.. పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారు? గదిలో ఉష్ణోగ్రత ఎలా ఉందో గుర్తించవచ్చు. టైమ్‌లైన్ మోడ్‌లో పెడితే.. 24 గంటల సమాచారమూ అందుతుంది. లిజన్ మోడ్‌తో పిల్లలు చేసే శబ్దాలను, పరిసరాల్లోని శబ్దాలనూ వినొచ్చు. పిల్లలు నిద్రపోయే స్థితికి చేరుకుంటే కూడా ఇది తెలియజేస్తుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 12 నెలల్లోపు చిన్నారులందరికీ సరిపోయేలా మూడు సైజుల్లో దొరుకుతుంది. ఒక కిట్ ధర రూ. 12 వేలు. కిట్‌లో మూడు మైమో కిమోనోస్, ఒక బేస్ స్టేషన్, ఒక టర్టిల్ ఉంటాయి. ఈ ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల కానుంది. కావాలంటే.. http://mimobaby.com/లో ప్రయత్నించొచ్చు. డైపర్ మార్చాలని చెబుతుంది చిన్నారులు ఆనందంగా ఆడుకుంటున్నప్పుడు వారినలా వదిలేసి పనులు చేసుకుంటుంటాం. ఆ సమయంలో వారు పక్క తడిపినా.. ఎంతోసేపటికి గానీ గుర్తించలేం. అలాగే బయటికి వెళ్లినప్పుడు కూడా చిన్నారులు ‘తడిపిన’ సంగతి వెంటనే తెలియకపోతే కొంచెం ఇబ్బందే. అయితే Huggies TweetPee ఉంటే ఆ బెంగ అక్కర్లేదు. పిల్లలు ఇలా తడిపేయగానే అలా మెస్సేజ్ వచ్చేస్తుంది. వెంటనే డైపర్ మార్చేయొచ్చు. ఇందులో ఉండే ట్విట్టర్ బర్డ్ ఆకారంలోని సెన్సర్ తేమ తగలగానే గుర్తిస్తుంది. వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు మెస్సేజ్ పంపుతుంది. అప్పటిదాకా ఎన్ని డైపర్లు మార్చారో కూడా ఇది చెబుతుంది. ఇది త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏడుపును అనువదిస్తుంది! పసివాళ్లు ఏడుస్తుంటే ఒక పక్క బాధగా ఉంటుంది. మరోపక్క వారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక, ఏం చేయాలో తెలీక చిరాకూ వచ్చేస్తుంటుంది. అయితే పిల్లల ఏడుపును అనువదించి చెప్పే Cry Translator ఉంటే చిన్నారుల ఏడుపును ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక చిన్న పరికరాన్ని పిల్లల దగ్గర ఉంచేస్తే చాలు.. దానిలోని మైక్రోఫోన్ ఏడుపును గ్రహిస్తుంది. ఓ బటన్‌ను నొక్కితే చాలు.. జస్ట్ మూడు సెకన్లలోనే పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో Cry Translator App ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు తెలియజేస్తుంది. ఈ పరికరం ద్వారా శబ్దాలు, లాలిపాటలు కూడా వినిపించి చిన్నారిని ఏడుపు మానిపించొచ్చు. పిల్లలకు ఆకలేస్తోందా? నిద్ర వస్తోందా? చికాకుగా లేదా బోర్‌గా ఫీలవుతున్నారా? వంటివీ తెలియజేస్తుంది. ధర రూ.5 వేలు. http://www.crytranslator.com/ లో ప్రయత్నించొచ్చు. క్రై ట్రాన్స్‌లేటర్ ఆప్‌ను మాత్రం రూ.3,00 చెల్లించి ఐట్యూన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఏడుపును చాలావరకూ కచ్చితత్వంతో విశ్లేషించే 'W-hy Cry Baby Cry Analyzer' అనే మరో డివైస్‌ను కూడా http://www. mumznbabyz.com/ లో కొనుక్కోవచ్చు. ధర రూ.2,500. డే అండ్ నైట్ వీడియో మానిటర్ పిల్లలను 24 గంటలూ ఆడియో, వీడియో ద్వారా పర్యవేక్షించేందుకు ఉపయోగపడే డివైస్‌లు అనేకం ఉన్నాయి. వాటిలో Infant Optics DXR-5 2.4 GHz Digital Video Baby Monitor ఒకటి. 2.4 టీఎఫ్టీ స్క్రీన్, సమర్థమైన మైక్రోఫోన్ ఉన్న డే అండ్ నైట్ బేబీ వీడియో మానిటర్ ఇది. ఇళ్లలో 150 అడుగుల వరకూ, బహిరంగ ప్రదేశాల్లో 800 అడుగుల వరకూ పనిచేస్తుంది. ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ సిస్టమ్(ఎఫ్హెచ్ఎస్ఎస్) సాయంతో ఫ్రీక్వెన్సీని మార్చుకోగలదు. ఆటోమేటిక్‌గా నైట్ విజన్లోకి మారగలదు. ఆటోమేటిక్ పవర్సేవింగ్ మోడ్, వాయిస్ యాక్టివేషన్ చేసుకోగలదు. సెకనుకు 30 ఫ్రేములతో వీడియో తీస్తుంది. మూడు నిమిషాల వరకూ ఎలాంటి శబ్దాలూ రాకపోతే మానిటర్ యూనిట్ దానంతట అదే షట్‌డౌన్ అయిపోతుంది. మళ్లీ చిన్నపాటి అలికిడి అయినా వెంటనే యాక్టివేట్ అవుతుంది. ధర రూ.6,100. కావాలంటే http://www.amazon.com/ లోకి వెళ్లండి. దూరం వె ళ్లిపోతే హెచ్చరిస్తుంది! ఏదో పనిలో పడి బిజీగా ఉన్నప్పుడు పిల్లలు నెమ్మదిగా బయటికి పోతే..? ఏదైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు కొంత దూరం దాటి ముందుకు పోతే వెంటనే హెచ్చరించేందుకు ఉపయోగపడే చైల్డ్ ట్రాకింగ్ డివైస్‌లు కూడా అనేకం ఉన్నాయి. Guardian-Angel Tracker డివైస్ అలాంటిదే. పిల్లలకే కాకుండా.. పెంపుడు జంతువులు, సెల్ఫోన్లు, కారు తాళాలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఈ డివైస్‌కు అనుసంధానించుకోవచ్చు. సెల్ఫోన్ల వంటివి దొంగతనం చేసినా కూడా గుర్తించొచ్చన్నమాట. 2.4 గిగాహెర్జ్ ఆర్ఎఫ్ టెక్నాలజీతో ఇండోర్‌లో, ఔట్‌డోర్‌లో కూడా పనిచేస్తుంది. ప్యాకేజీలో రెండు ట్యాగ్స్ ఉంటాయి. బేస్ స్టేషన్‌తో ఒకేసారి నాలుగు వస్తువులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఎంత దూరం వెళితే అలారం లేదా వైబ్రేషన్‌తో హెచ్చరించాలన్నది ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అత్యధికంగా 1,600 అడుగుల పరిధి వరకూ పనిచేస్తుంది. ధర రూ.3,700. కావాలంటే http://www. amazon.com/ లింకులో ప్రయత్నించొచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు?! ఇప్పటి వరకూ నోకియాస్మార్ట్ఫోన్లు అంటే అవి కేవలం విండోస్ ఓఎస్‌తో పనిచేసేవే. ఒకవైపు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు అదిరేటి ఫీచర్లతో యూజర్ల మదిని దోచుకొంటుంటే.. నోకియా మాత్రం విండోస్ ఓఎస్‌తో మాత్రమే ఫోన్లను తయారు చేస్తూ తన అభిమానులను నిరాశ పరుస్తూ వస్తోంది. నోకియా నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వస్తే బాగుండు అని అనేక మంది కోరుకొంటున్నారు. మరి ఇలాంటి వారికి ఒక శుభవార్త. నోకియా త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లను విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. వీటి గురించి నోకియా అధికారికంగా ధ్రువీకరణ లేదు కానీ పుకార్లైతే పుంజుకొన్నాయి. ‘నార్మాండీ’ పేరుతో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ విడుదల చేస్తోందని అంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వెర్షన్‌పై వస్తుందని అంటున్నారు. మరి ఇది కార్యరూపం దాలిస్తే నోకియా, ఆండ్రాయిడ్ల ఫ్యాన్స్‌కు అంతకన్నా స్వీట్ న్యూస్ లేదు! అపరిచితుల నుంచి కూడా జీమెయిల్ వస్తుంది! గూగుల్ తన వినియోగదారులకు కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఇక నుంచి అపరిచితులకు కూడా మెయిల్స్ పంపవచ్చు, వారి నుంచి మీకు మెయిల్స్ రావొచ్చు! మామూలుగా మీ జీమెయిల్ ఐడీ తెలిసిన వారే మీకు మెయిల్స్ పంపగలరు. కానీ ఇకపై సోషల్నెట్వర్కింగ్ సైట్లలో మీకు ఫ్రెండ్స్‌గా ఉన్నవారు కూడా మెయిల్ అడ్రస్‌తో పనిలేకుండా మెయిల్ పంపడానికి అవకాశం ఉంటుందట. అంటే సోషల్నెట్వర్కింగ్ సైట్లలో కొన్నిసార్లు అపరిచితులతో కూడా స్నేహాలు చేస్తుండవచ్చు. జీమెయిల్ తీసుకొచ్చిన ఈ కొత్తఫీచర్ ద్వారా అలాంటి అపరిచితులు కూడా మీ జీ మెయిల్లోకి చొరబడటానికి వీలుంటుంది. ఈ ఫీచర్ వల్ల కమ్యూనికేషన్ మరింత సులభతరం అవుతుందని గూగుల్ అంటున్నప్పటికీ, దీనివల్ల జీమెయిల్లో కూడా ప్రైవసీ కోల్పోయే అవకాశాలు ఎక్కువవుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా గూగుల్ ప్లస్ లో మీకు ఫ్రెండ్స్‌గా యాడ్అయిన వారు జీమెయిల్‌కు మెయిల్స్ పంపడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉండే లాభాలు, నష్టాల గురించి ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! ఇల్లు మరింత ‘స్మార్ట్’ అవుతుంది! ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు జస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఆప్‌ను తెరిచి సెట్టింగ్స్ ఓకే చేస్తే చాలు.. ఇంటికెళ్లే సరికి అన్నం, కూరలు రెడీ! బియ్యం, కూరగాయలు, ఇతర పదార్థాలను ముందుగా సిద్ధం చేసి ఉంచితే సరిపోతుంది. ఫిలిప్స్ కంపెనీ రూపొందిస్తున్న ‘హోమ్కుకర్ నెక్ట్స్’తో ఇది సాధ్యం కానుంది. దీని ప్రాథమిక నమూనాను గత ఏడాదే బెర్లిన్ ‘ఐఎఫ్ఏ షో’లో ిఫిలిప్స్ ప్రదర్శించింది. అలాగే ఇంట్లో గాలిని శుభ్రం చేసే ిఫిలిప్స్ ఎయిర్-కాన్, బేబీ మానిటర్, కాఫీ మెషీన్, ఇంట్లో మనం ఉన్నప్పుడు, లేనప్పుడు ఉష్ణోగ్రతను నియంత్రించే ‘నెస్ట్’ థర్మోస్టాట్ వంటి పరికరాలూ ఆప్స్ సాయంతో ఇల్లును టెక్మయంగా మార్చనున్నాయి. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లే కాకుండా.. లాకిట్రాన్ వంటి ఆటోమేటిక్ డోర్‌లాక్‌లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు, బైకులు, కార్ల వంటి వాహనాలు కూడా 2014లో మరింతగా నెట్వర్క్మయం అయిపోనున్నాయి.