breaking news
Mohammed Abubakar
-
నావికాదళంలో అత్యున్నత అధికారిగా హైదరాబాద్ కుర్రాడు!
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజేసీఈటీ) నుంచి మహ్మద్ అబూబకర్ 2022 సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయ్యారు. కళాశాలలో ఉన్న సమయంలో చదువుతోపాటు క్రీడల్లోనూ ఆయన తనదైన ప్రతిభను చూపారు. ఆటలన్నా, పోటీలన్నా ముందుండేవాడు. అదే తత్వం అతని లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం.. అబూబకర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. మే 31న పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు. అబూబాకర్ కళాశాల సమయంలోనూ క్రీడల్లో ముందుండేవాడు. అంతేకాకుండా రాష్ట్రం తరుపున సైతం పోటీల్లో పాల్గొన్నారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించిన అబుబాకర్ నైనిటాల్లో జరిగిన 7–ఎ–సైడ్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో, ఇండో–నేపాల్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఎంజేసీఈటీ, తెలంగాణ రాష్ట్రం తరుపున రెండింటికీ ప్రాతినిధ్యం వహించాడు. లక్ష్యం కోసం ముందుకు..అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కఠోరశ్రమ ఎంతో అవసరం. ఒకవైపు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం వల్లనే తనకు ఈ అవకాశం లభించిందని అంటున్నారు అబుబాకర్. తన ఈ ప్రయాణంలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. భారత సాయుధ దళాలకు అవసరమైన అధికారిగా నిలపడంలో, మార్గదర్శకత్వం చూపడంలో అవసరమైన శిక్షణ అందించడంలో సహాయపడిన ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ యూసుఫుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అమీర్ జావీద్ తదితరుల సేవలను ఆయన గుర్తుచేశారు. తనతోపాటు ఇటీవలి కాలంలో తమ కళాశాల నుండి దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర పరిపాలనతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారన్నారు. నావికాదళంలో పనిచేయడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. యువత సైతం తమ ఆలోచనలను సుసాధ్యం చేసుకోవడానికి అవసరమైన లక్ష్యాలను ఏర్పచుకోవాలన్నారు. (చదవండి: పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు) -
సెల్ఫీ కోసం ఎయిర్‌హోస్టెస్ చేయిపట్టిలాగి..
ముంబయి: ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి గుజారత్ కు చెందిన ప్రయాణికుడు చిక్కుల్లో పడ్డాడు. ఎయిర్ హోస్టెస్ కు ఇష్టం లేకుండా బలవంతంగా స్వీయచిత్రాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు విమానం టాయిలెట్లో పొగతాగడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అబుబాకర్(29) అనే వ్యక్తి డామమ్ నుంచి ముంబయికి విమానంలో బయలుదేరాడు. విమానం డామమ్ నుంచి బయలుదేరగానే తన అసభ్య ప్రవర్తన ప్రారంభించాడు. ఎయిర్ హోస్టెస్ విమానంలో నడుస్తుండగా ఆమె వెనుకాలే చప్పుడు చేయకుండా వెళ్లాడు. తన వెనుకాలే ఏదో వస్తుందని అనుమానం వచ్చి వెనుకకు తిరగి చూడగా వెంటనే అతడు’ చలో యార్ ఒక సెల్ఫీ తీసుకుందాం’ అని చేయిపట్టి లాగాడు. ఆమె అందుకు నిరాకరించినా వినకుండా బలవంతపెట్టాడు. అంతటితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెళ్లి తన సీట్లో కూర్చోగా వెనుకాలే నిల్చుని ఇబ్బంది పెట్టాడు. తన భుజాలపై చేయివేసి సెల్ఫీకోసం బలవంతపెట్టాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో విమాన సిబ్బంది నలుగురు అక్కడికి వచ్చారు. అది గమనించిన బాకర్ విమాన టాయిలెట్ లోకి వెళ్లి తాపీగా సిగరెట్ తాగి వచ్చాడు. దీంతో ఫ్లైట్ సిబ్బంది అతడి వద్ద నుంచి సిగరెట్ ప్యాక్, లైటర్ లాగేసుకున్నారు. అతడి ఫోన్ కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి రాగానే అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి సౌదీ అరేబియాలోని డామమ్ లో ఓ రెస్టారెంటులో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనిఖీలు చేసినా అతడి వద్దకు సిగరెట్, లైటర్ ఎలా వచ్చిందనే అంశంపైనా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. ఈ విమానం జెట్ ఎయిర్ వేస్ సంస్థది.