breaking news
mohammad maazu
-
భారత్‌లో మాల్దీవుల అధ్యక్షుని పర్యటన త్వరలో
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన ఏ తేదీల్లో పర్యటించనున్నారన్నది వెల్లడించలేదు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మొయిజ్జు తొలిసారి భారత్ వచ్చారు. చైనా అనుకూలుడిగా పేరున్న మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ బలగాలు మాల్దీవులు విడిచివెళ్లిపోవాలని షరతు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, ఈ ఏడాది ఆరంభంలో మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినపుడు అప్పటి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మరింత దూరేం పెరిగింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవుల ఉద్యమం తీవ్రమైంది. మంత్రుల వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాల్సి వచ్చింది. -
సౌదీలో నల్గొండ వాసి ఆత్మహత్య
నల్గొండ జిల్లా: బతుకుదెరువు కోసం సౌదీకు వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన మహ్మద్ మాజూ(26) 9 నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ అల్హట్టా రాష్ట్రం అల్సుఖ్ఖీ గ్రామంలో మాజూ ఓ షేక్‌కు చెందిన ఖర్జూర తోటలో పనిచేస్తున్నాడు. ఆ తోటలో అతను అనూహ్యంగా చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పొట్టకూటి కోసం విదేశీలకు వెళ్లిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.