breaking news
Mohamed Muizzu
-
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
హిందూ మహాసముద్రంలో కీలక స్థానంలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తాజా పర్యటన ఇప్పుడు ప్రాంతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఒకవైపు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకునేందుకు అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో చర్చలు, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సమావేశం, ఏకంగా 20 ఒప్పందాలపై సంతకాలు.. ఇవన్నీ ముయిజ్జు పర్యటనను సాధారణ దౌత్య పర్యటన పరిధి దాటించాయి. దీంతో భారత్‌కు మాల్దీవులు వెన్నుపోటు పొడుస్తోందా? లేక తన విదేశాంగ విధానంలో భాగంగా అన్ని దేశాలతో సంబంధాలను విస్తరిస్తోందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.అక్టోబర్ 20 నుంచి 22 వరకు ముయిజ్జు పాకిస్థాన్‌లో పర్యటించారు. 11 ఏళ్ల తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పర్యటన జరగడం మరో విశేషం. ఈ సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, పోలీసింగ్, పౌర విమానయానం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం తదితర రంగాల్లో 20 ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం సుమారు 1.3 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండేళ్లలో 20 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందాలు తమ మధ్య సహకారానికి కొత్త అధ్యాయమని ముయిజ్జు అభివర్ణించారు. అయితే, రక్షణ, సముద్ర భద్రత అంశాలు ఈ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యం తీసుకొచ్చాయి.మునీర్‌తో భేటీ.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన ముయిజ్జు.. ఆ దేశ శక్తిమంతమైన సైనిక నాయకుడు, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్తోనూ చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం, సంస్థాగత సంబంధాలు, సైనిక శిక్షణ అంశాలు వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్థాన్ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ముయిజ్జు ప్రశంసించారు. అయితే, హిందూ మహాసముద్రంలోని కీలక సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవులు భారత్‌కు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశం. అలాంటి దేశం పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సంబంధాలను విస్తరించడం సహజంగానే న్యూఢిల్లీని టెన్షన్ పెట్టే పరిణామం. అయితే, ఈ ఒప్పందాల ద్వారా మాల్దీవుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరం ఏర్పాటవుతోందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. ఒప్పందాలు ఆచరణలో ఏ రూపం దాలుస్తాయన్నదే కీలకం.‘ఇండియా అవుట్’ నుంచి పాక్ స్నేహం వరకు!ముయిజ్జు రాజకీయ ప్రస్థానంలో భారత్ అంశం మొదటి నుంచీ కీలకంగా ఉంది. 2023లో ‘ఇండియా అవుట్’ ప్రచారంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అనంతరం మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక సిబ్బందిని వెనక్కి పంపించి, వారి స్థానంలో పౌర సాంకేతిక సిబ్బందిని నియమించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే, ఆ తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు కూడా ముయిజ్జు ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు అదే ప్రభుత్వం పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకోవడం కొత్త చర్చకు కారణమైంది. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే పాకిస్థాన్‌తో వ్యూహాత్మక సంబంధాలను విస్తరించాలనుకోవడం ఆందోళన కలిగిస్తోంది.సార్క్ పునరుద్ధరణకు ముయిజ్జు పిలుపుఈ పర్యటనలో ముయిజ్జు మరో కీలక ప్రతిపాదన చేశారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్)ను తిరిగి క్రియాశీలం చేయాలని పిలుపునిచ్చారు. 2014లో ఖాట్మండులో జరిగిన సమావేశం తర్వాత ఈ కూటమి శిఖరాగ్ర సమావేశం జరగలేదు. 2016లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సమావేశం ఉరీ ఉగ్రదాడి అనంతరం భారత్ పాల్గొనకపోవడంతో రద్దయింది. సార్క్ దేశాల మధ్య సహకారం పెంచేందుకు, తదుపరి శిఖరాగ్ర సమావేశం త్వరగా నిర్వహించేందుకు మాల్దీవులు కృషి చేస్తాయని ముయిజ్జు తెలిపారు. అయితే, సార్క్ పునరుద్ధరణకు భారత్-పాకిస్థాన్ సంబంధాలు, ఉగ్రవాదంపై నెలకొన్న విభేదాలు కీలక అడ్డంకులుగా ఉన్నాయి.కశ్మీర్, సింధు జలాల అంశాలను లేవనెత్తిన పాక్ముయిజ్జుతో చర్చల సందర్భంగా షరీఫ్.. జమ్మూ కశ్మీర్, సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ వైఖరిని వివరించారు. నీటి సరఫరాలో జోక్యాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని షరీఫ్ హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అయితే, ఈ అంశాల్లో పాకిస్థాన్ వైఖరికి ముయిజ్జు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు.భారత్‌కు వెన్నుపోటు?మాల్దీవులు భారత్‌కు సమీప సముద్ర ప్రాంతంలో ఉన్నందున అక్కడి విదేశాంగ, రక్షణ సంబంధాల్లో వచ్చే మార్పులు న్యూఢిల్లీకి ప్రాధాన్యం కలిగిస్తాయి. మరోవైపు, చైనా కూడా మౌలిక సదుపాయాల పెట్టుబడుల ద్వారా మాల్దీవుల్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ముయిజ్జు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ వ్యూహాలకు కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. తాజా ఒప్పందాలు నిజంగా రక్షణ సహకారాన్ని ఎంతవరకు పెంచుతాయి? అవి భారత్-మాల్దీవుల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది రానున్న పరిణామాలే నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి! -
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్‌ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్‌కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్‌కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్‌కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్‌కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్‌వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్‌కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్‌కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్‌ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్‌కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్‌తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?


