breaking news
mobiles stolen
-
అతను–ఆమె ఓ సైలెంట్ కిల్లర్..
రాత్రి 10 గంటలు. ఇల్లు నిశ్శబ్దం. ఆమె పక్కన అతను ఉన్నాడు. కానీ లేడు. ఫోన్ వెలుగు అతని ముఖం మీద పడుతుంది. వేళ్లు స్క్రోల్ చేస్తున్నాయి. రీల్స్... యూట్యూబ్.. ఫేస్బుక్... మాటలు లేవు. కళ్లలోకి చూడటం లేదు. స్పర్శ లేదు. వాళ్లకు విడాకులు జరగలేదు. వాళ్లు విడిపోలేదు. కాని కలిసి మాత్రం లేరు. అతని ఫోన్ వాళ్లను విడగొట్టింది. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ‘ఫబ్బింగ్’. ఫోన్లో పడి భార్యను నిర్లక్ష్యం ( Snubbing ) చేయడమే ఫబ్బింగ్. నేడు కనిపిస్తున్న అనేక దుష్ఫలితాలకు ఈ స్థితి కూడా ఒక కారణం.రాత్రి పదిగంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ మంచం మీద ఆమె పక్కనే అతను ఉన్నాడు.. కానీ లేడు! చేతిలోని స్మార్ట్‌ఫోన్ వెలుతురు అతని ముఖం మీద పడుతోంది. వేళ్లు యాంత్రికంగా స్క్రోల్ చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రీల్స్ శబ్దాలు వస్తున్నాయి కానీ, ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు. కళ్లలోకి చూసుకునే తీరిక లేదు. కనీసం చిన్న స్పర్శ కూడా లేదు. వాళ్లకు విడాకులు కాలేదు, వాళ్లు విడిపోలేదు.. కానీ కలిసి మాత్రం లేరు! అతని చేతిలోని ఆ ఐదు అంగుళాల ఫోన్ స్క్రీన్, వాళ్ల మధ్య హిమాలయాలంత దూరాన్ని పెంచేసింది. ఆధునిక సమాజం ఈ నిశ్శబ్ద విషాదానికి పెట్టిన కొత్త పేరే.. ‘ఫబ్బింగ్’. ఫోన్‌ను, స్నబింగ్ ను కలిపి తయారు చేసిన పదం. దీని అర్థం ఫోను ద్వారా చేసే మానసిక హింస.ఒకప్పుడు ఆఫీస్ నుండి వచ్చే భర్త కోసం భార్య గేట్ దగ్గర ఎదురుచూసేది. ఇప్పుడు అతను వచ్చినా గేట్ తెరుచుకున్న చప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే అతను భౌతికంగా ఇంట్లోకి వచ్చినా, అప్పటికే డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీటింగ్‌లు, మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లు, యూట్యూబ్, రీల్స్‌తో కాలం కరిగిపోతోంది. భార్య ఏదైనా మాట్లాడబోతే ‘ఒక నిమిషం’ అనే సమాధానం వస్తుంది. కానీ ఆ ఒక్క నిమిషం ఎప్పటికీ రాదు. అతను శరీరంతో ఇంట్లోనే ఉంటాడు, కానీ మనసుతో వేరే ప్రపంచంలో ఉంటాడు. ఇది శారీరక దూరం కాదు, అంతకుమించిన మానసిక మరణం. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పుడు ప్రతి మూడవ ఇంట్లో జరుగుతున్న నిరంతర కృత్యం.కనిపించని గోడమొదట ‘ఆఫీస్ వర్క్ ఉంది’ అని మొదలవుతుంది. తర్వాత ‘ఫ్రెండ్స్ గ్రూప్‌లో చాటింగ్’ అంటారు. చివరకు ఆమె ఏదైనా చెప్పాలంటే అతణ్ణి గట్టిగా తట్టి పిలవాల్సిన పరిస్థితి. అతను చెవులకున్న హెడ్‌ఫోన్స్ తీసి ‘ఏంటి?’ అని విసుక్కుంటాడు. ప్రేమగా మాట్లాడుకోవడానికి, కలిసి నవ్వడానికి, ఆఖరికి మనస్ఫూర్తిగా గొడవ పడటానికి కూడా అక్కడ సమయం లేదు. ఆమెకు అర్థం కావడం లేదు.. గొడవ పడాలా? లేక ఏడవాలా? ఎందుకంటే ఎదుటివాడు ఏ తప్పూ చేయలేదు, కేవలం ‘బిజీ’గా ఉన్నాడు. కానీ ఆ బిజీ అనే ముసుగు వెనుక ఆమె మనసు మెల్ల మెల్లగా చచ్చిపోతోంది.పేరు లేని ఒంటరితనంభర్త తన పక్కనే ఉన్నా తనకు అందుబాటులో లేకపోవడం భార్యకు ఎంత బాధ? సినిమాకు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పిల్లాడి ఫీజు కట్టాలన్నా ఆమె ఒంటరిగానే పోరాడాలి. ఇంట్లో ఇద్దరూ ఉంటారు, కానీ సంసార భారాన్ని ఆమె ఒక్కతే మోస్తుంది. స్నేహితులు ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి, భర్త బంగారం’ అంటుంటే ఆమె గుండెల్లో ఏడుస్తూ పైకి నవ్వుతుంది. ఎందుకంటే ‘నా భర్త ఫోన్ తో లవ్‌లో ఉన్నాడు’ అని సమాజానికి ఎలా చెప్పుకుంటుంది? ఈ ఒంటరితనానికి చట్టబద్ధమైన పేరు లేదు, విడాకుల సర్టిఫికేట్ లేదు.. అందుకే ఇది ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది.పరిష్కారం ఎక్కడ?ఈ డిజిటల్ చెరసాల నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలు అవసరం → భర్తతో గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి ‘నువ్వు చెడ్డవాడివి కాదు, కానీ నీ పక్కన ఉంటూనే నేను ఒంటరిగా నలిగిపోతున్నాను’ అని అర్థమయ్యేలా చెప్పాలి → ఇంట్లో ‘డిజిటల్ డిన్నర్’ రూల్ పెట్టాలి. రాత్రి భోజన సమయంలో రోజుకు కనీసం 30 నిమిషాలు ఫోన్ లను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోవాలి → ‘బెడ్రూమ్ నో ఫోన్ జోన్’. పడుకునే గదిలోకి ఫోన్ ను రానివ్వకూడదు → ఆమె కూడా అతని ఫోన్ అలవాటుతో విసిగిపోయి తను కూడా ఫోన్ కు బానిస అవ్వకూడదు. తనకంటూ ఒక ప్రపంచాన్ని, హాబీలను, స్నేహితులను పెంచుకోవాలి. సాంకేతికత శత్రువు కాదు, దాన్ని మనం బంధాలను విడగొట్టడానికి వాడుతున్నామా లేదా కలపడానికి వాడుతున్నామా అనేదే ముఖ్యం. ఫోన్ స్క్రీన్ వల్ల వస్తున్న దూరాన్ని ఇప్పుడే గుర్తించి తగ్గించుకోకపోతే, ఒకరోజు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటూనే.. మానసిక విడాకులు తీసుకున్న ‘డైవోర్సీలు’గా మిగిలిపోతారు. హెచ్చరిస్తున్న ఈ డిజిటల్ కాలాన్ని ఇప్పుడైనా గమనిద్దాం.. బంధాలను కాపాడుకుందాం. -
ఆలీబాబా అరడజను దొంగలు.. ప్లాన్ ఒకరు అమలు చేసేది మరొకరు
సాక్షి,కర్నూలు: నగరంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బబ్లూ బ్యాచ్, వడ్డె ప్రసాద్ బ్యాచ్ పేరుతో ఎనిమిది మంది కొంతకాలంగా నగరంలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన కొత్తూరు శేఖర్‌రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని కర్నూలులో రిపేరికి ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆటో ఎక్కాడు. అదే దారిలో కొంచెం ముందుకు వెళ్లిన తరువాత సర్వీసు రోడ్డులో నుంచి చీకట్లోకి తీసుకెళ్లి రూ.5 వేలు నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. అలాగే తుగ్గలికి చెందిన జయచంద్ర రిలయన్స్ మార్ట్‌లో పనిచేస్తాడు. కేసీ కెనాల్ వద్ద అతని వద్ద నుంచి రూ.6 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి శ్రీధర్‌పై కూడా ఈ తరహాలోనే దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ తరహా మూడు కేసులు నమోదు కావడంతో మూడో పట్టణ ఎస్ఐ రామకృష్ణ, క్రైంపార్టీ సిబ్బంది ప్రసాద్‌సింగ్, చంద్రబాబునాయుడుతో కలిసి నిఘా వేసి పవన్ అలియాస్ బబ్లూ, వడ్డె ప్రసాద్(శ్రీరామ్‌నగర్)లతో పాటు కావేటి ఈశ్వరయ్య (లక్ష్మీనగర్), దాస్(జంపాల శివనగర్), అఖిల్ (ఎన్టీఆర్ బిల్డింగ్స్), మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సెల్ఫోన్లను అమ్మ హాస్పిటల్‌కు సమీపంలోని సాయి మొబైల్స్‌లో సెల్‌ఫోన్ మెకానిక్ గౌడుకు విక్రయించినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 10 సెల్ఫోన్లతో పాటు ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. చదవండి: భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే.. -
ఆటో మొబైల్ దొంగల ముఠా అరెస్ట్: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆటో మొబైల్, మొబైల్ దొంగతనాలు చేస్తున్న 11 మంది గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు అమీర్‌ఖాన్‌తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలో ఓ మైనర్ కూడా ఉన్నాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. దొంగిలించిన వస్తువులను ఈ ముఠా నుంచి తీసుకుంటున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై సుమారు 33 కేసులు ఉన్నాన్నాయని ఆయన వెల్లడించారు. 27 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు, 1 ఆటోను పోలీసుల స్వాధీనం చేసుకున్నారని సీపీ వెల్లడించారు. ఈ ముఠాలో ఏ1 దొంగ అమీర్‌ఖాన్ మెకానిక్‌గా పని చేశాడు. దీంతో తాళం లేకుండా బైక్‌లు ఎలా దొంగలించాలో బాగా నేర్చుకున్నాడని సీపీ అంజనీకుమార్ వివరించారు. అలాగే గ్యాంగ్‌కి మొత్తానికి నేర్పించి బైక్ దొంగతనాలకి పాలపడుతున్నారని ఆయన తెలిపారు. సైఫాబాద్‌లో నమోదైన కేసును విచారణ చేస్తుండగా.. ఈ గ్యాంగ్ వ్యవహారం అంతా బయటపడిందని సీపీ వెల్లడించారు. గత నాలుగు నెలలుగా వీళ్లు చోరీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఎక్కడ ఈ గ్యాంగ్ పట్టుబడలేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మీటింగ్ గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దక్షిణ, పశ్చిమ జోన్ ప్రజలతో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ నిర్వహించామని అయన చెప్పారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ప్రజలకు ఉందని.. కాబట్టి విజన్ 2020లో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకారం అందించాలని సీసీ అంజనీకుమారు కోరారు. ప్రజల్లో వారి రక్షణ కోసం స్వతహాగా కొత్త విధానం ఏర్పడాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు. -
అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ
థానే: అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. ఆ సంస్థలో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే కొందరు ఉద్యోగులు వారం కిందట కొన్ని విలువైన మొబైల్స్ ను చోరీ చేశారు. థానేలోని కురుంద్ లో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలు వెల్లడించారు. మే 22న కొందరు ఉద్యోగులు 17 మొబైల్ హ్యాండ్ సెట్లను దొంగిలించారు. అయితే వాటి విలువ రూ.10 లక్షలకు పైమాటేనని అమెజాన్ సంస్థ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టోరేజ్ హౌస్ లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ జైప్రకాష్ బోసాలే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే మే 29న మరో కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.8 వేలు విలువ చేసే మొబైల్ ను స్టోరేజ్ హౌస్ నుంచి చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఆ ఉద్యోగి పేరు ఆకాశ్ సపాత్ అని, ఐపీసీ సెక్షన్లు 381, 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు బోసాలే పేర్కొన్నారు.


