breaking news
Mobile threat
-
ఫోన్లు చోరీ చేశారంటూ దాష్టీకం
తోటపల్లిగూడూరు: ఫోన్లు చోరీ చేశారనే అనుమానంతో గిరిజన బాలికలను వాహనంలో తరలించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. నెల్లూరు బీవీనగర్‌కు చెందిన విద్యార్థులు సికిందర్బాబు, రామినేని హర్షచౌదరి, గట్టుపల్లి ప్రసాద్, కంచర్ల నవీన్, తాతిరెడ్డి రవీంద్ర గురువారం మధ్యాహ్నం వ్యాన్‌లో కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. సముద్ర స్నానాల అనంతరం సాయంత్రం వ్యాన్‌లో ఉంచిన నగదు, సెల్ఫోన్లు మాయమైనట్లు సదరు విద్యార్థులు గుర్తించారు. అదే సమయంలో ఆ వ్యాన్ సమీపంలో ఐదేళ్లలోపు ముగ్గురు గిరిజన బాలికలు ఆడుకుంటూ వారికి కనిపించారు. నగదు, సెల్‌ఫొన్లను బాలికలే దొంగతనం చేసి ఉంటారనే అనుమానంతో వారిని దబాయించారు. తాము చోరీ చేయలేదని గిరిజన బాలికలు ఎంత చెప్పినా వినకుండా ముగ్గురు చిన్నారులను భయపెట్టేందుకు తమ వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. అనంతరం సదరు విద్యార్థులు కోపంతో బాలికలను వ్యాన్‌లో నెల్లూరు తీసుకెళ్లే యత్నం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తోటపల్లిగూడూరు పోలీసులు కోడూరు – నరుకూరు మార్గంలోని చింతోపు సమీపంలో వ్యాన్‌ను అడ్డగించి విద్యార్థులతో పాటు గిరిజన బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికల తల్లి కత్తి కామేశ్వరి ఫిర్యాదు మేరకు విద్యార్థులపై కేసు నమోదు చేశామని ఏఎస్సై కృష్ణయ్య తెలిపారు. -
మొబైల్ ముప్పు
సెల్‌ఫోన్.. ఈ రోజుల్లో ఉపయోగించని వారంటూ ఉండరు. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సెల్‌ఫోన్ వాడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆండ్రాయిడ్ రంగప్రవేశంతో ఫోన్ల వాడకం మరింత పెరిగింది. గంటల కొద్ది చాటింగ్, షేరింగ్, వాయిస్ చాట్ ఇలాంటివన్ని నిత్యకృత్యమైపోయాయి. ఇక గేమ్స్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫోన్లలో ఏ ఆటైనా ఆడేందుకు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతున్నారు. మరోవైపు 2జీ, 3జీ వంటి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ తతంగమంతా ఒకవైపు నుంచి చూస్తే సరదాగాను.. ఓ ప్రత్యేక హోదాగాను కనిపిస్తుంది. కానీ ఫోన్ ఎంత వినియోగిస్తే అంతగా ఆరోగ్యానికి చిల్లు పడుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వినియోగం శృతిమించితే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మొబైల్లో దాగి ఉండే బ్యాక్టీరియాతో పలు చర్మవ్యాధులు పొంచి ఉన్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోనట్లయితే అవి సోకే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. - న్యూఢిల్లీ న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌తో ఎంతమేలు జరుగుతుందో.. అంతకు మించిన కీడు ఉందని వైద్యనిపుణులు అంటున్నారు. మనిషి అనునిత్యం వెంట పెట్టుకుని తిరిగే మొబైల్‌ఫోన్ బ్యాక్టీరియాకు అడ్డా అని, ఫలితంగా మనకు తెలియకుండానే చర్మవ్యాధులు, కేన్సర్, మతిమరుపు, మెదడు, చెవికి సంబంధించిన వ్యాధులు సోకే ఆస్కారం ఉందని అంటున్నారు. స్టైప్టోకొకి, స్టాఫిలొకొకి, ఈకోలి అనే బ్యాక్టీరియా, కాంటాక్ట్ డెర్మటిస్ అనే స్కిన్ అలర్జీ వ్యాపించే అవకాశాలున్నాయి. రకరకాల చర్మవ్యాధులు.. టచ్‌స్క్రీన్, కీప్యాడ్లపై ఎన్నో రకాల సూక్ష్మ జీవులుంటాయి. అవన్నీ చేతివేళ్లపైకి, బుగ్గలపైకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ రకాల చర్మవ్యాధులు తలెత్తుతాయి. బుగ్గలు, చెవుల వద్ద బొబ్బలు రావడానికి ఈ మొబైల్ ఫోన్లే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సెల్ఫోన్లు చెవి వద్ద పెట్టుకుని గంటల తరబడి మాట్లాడేవారికి వినికిడి మందగించడం, చెవినొప్పి, మెదడుకు సంబంధించిన వ్యాధులు వ్యాపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్ ద్వారా శరీర కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా చర్మంలోని ప్రొటీన్ల నిర్మాణ క్రమం సైతం మారిపోయే అవకాశం ఉంటుంది. అతి వినియోగంతో కాంటాక్ట్ ఎలర్జీ.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కాంటాక్ట్ ఎలర్జీ వస్తుంది. దీనివల్ల చెవుల చుట్టూ ఎర్రబడి చిన్నచిన్న కురుపులు ఏర్పడతాయి. చెవి దగ్గర సెల్ పెట్టుకుని ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల ఈ ఎలర్జీ వస్తుంది. సెల్‌ఫోన్ వీలయినంత తక్కువగా వాడితేనే ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉంటాయి. మొబైల్‌ను ముఖ్యంగా చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు గేమ్స్ ఆడడానికి టచ్ ఫోన్లు ఇవ్వకూడదు. ఇస్తే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కేన్సర్ కారకం.. మొబైల్ ద్వారా రేడియేషన్‌కు గురైతే కొన్ని రకాల చర్మ కేన్సర్ రావడానికి అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడి వయసుకు మించి ఉన్నట్లు కనిపిస్తుంటారు. సెల్ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వేన్సీ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ ఎంతో ప్రమాదకరం. ఎస్ఎంఎస్లతో ఇన్ఫోమేనియా... నగరంలో 75 శాతం మంది సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో యువతే అధికం. వీరంతా అవసరానికి మించి ఫోన్ వినియోగిస్తూ రోజంతా అదే పనిగా ఎస్ఎంఎస్లు పంపిస్తూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల ఇన్ఫోమేనియా అనే వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఈ-మెయిల్స్ అదే పనిగా చూడడం అలవాటుగా మారింది. సెల్‌ఫోన్ ద్వారా కాంటాక్ట్ డెర్మటిటీస్ అనే స్కిన్ ఎలర్జీ సోకుతుంది. గంటల తరబడి మొబైల్‌ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ రకమైన సమస్యలు ఎదురవుతాయి. మొబైల్ ఫోన్లో ఉండే నికెల్ కోటింగ్ వల్ల కొన్నిరకాల బ్యాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉంది. చర్మంపై తెల్ల మచ్చల లాంటి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సెల్‌ఫోన్‌ను తక్కువగా వినియోగిస్తూ, సురక్షిత విధానాలు పాటిస్తే మంచిది. ప్రతిరోజూ చేతులు, ముఖాన్ని శుభ్రపర్చుకోవాలి. గంటల తరబడి సెల్ఫోన్లో మాట్లాడకూడదు. విటమిన్ ‘ఈ’తో కూడిన మాయిశ్చరైజర్ యాంటీ యాక్సిడెంట్లతో కూడిన ఎమోలియెంట్స్ని ఉపయోగించాలి. అవి చర్మానికి తేమను అందించడంతో పాటు చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తాయి. చర్మం ఉత్తేజపడేలా నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడాలి. మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను, ‘కీ’ ప్యాడ్‌ను తరచూ శుభ్రపరుస్తుండాలి. వాటిపై సూక్ష్మజీవులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఫోన్‌ను చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడడం కంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వంటివి వాడడం మేలు. టిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం మరిచిపోకూడదు. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్ వాడకంలో లేనప్పుడు శరీరానికి అంటిపెట్టుకోకుండా దూరంగా పెట్టుకోవాలి.