breaking news
mobile lost
-
సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం.. సాక్షి కథనానికి స్పందించిన సీపీ
-
మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..!
ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఏ పని జరగదు అన్నంతగా అలవాటైపోయింది. ఇది కేవలం ఫోన్ కాల్స్‌కి మాత్రమే కాకుండా అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఏం కావాలన్నా యూపీఐ యాప్స్ ద్వారా సింపుల్‌గా మనీ ట్రాన్సఫర్ చేస్తున్నారు. అలాంటి ఫోన్ పోతే ఒక్కసారిగా జరగాల్సిన పనులన్నీ ఆగిపోయినట్టనిపిస్తుంది. మనం ఈ కథనంలో కొన్ని యాప్స్ ద్వారా ఫోన్ ఎక్కడుందో సులభంగా కనిపెట్టే విషయాలు తెలుసుకుందాం. మీరు ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో ఫ్రీ వైఫై యాప్స్‌లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే.. ఈ సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి కేవలం ట్రాకింగ్ కోసం మాత్రమే కాకుండా చాలా అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ కనిపించకుండా పోయిన ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉండాలి. అలాంటి ఐదు యాప్స్ ఇక్కడ చూద్దాం.. జియోలాక్ బీ (Geoloc.be) జియోలాక్ బీ అనే యాప్ ద్వారా మీరు పోగొట్టుకున్న ఫోన్ లొకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన యాప్. ఎందుకంటే ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా, రియర్ టైమ్ వంటి విషయాలను పసిగట్టవచ్చు. ఇదీ చదవండి: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదమే! లోకలైజ్ మొబీ (Localize Mobi) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన లోకలైజ్ మొబీ కూడా లొకేషన్ ట్రాక్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్ సాయంతో ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. అయితే ఈ యాప్ వినియోగదారుల విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అందించే సమస్యే లేదు. ట్రూ కాలర్ (Truecaller) దాదాపు ట్రూ కాలర్ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఉండడు. ఎందుకంటే మనకు గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు దీని ద్వారానే సులభంగా అవతలి వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. పోయిన ఫోన్ వెతకడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కానరో.ఐఓ (Scannero.io) కనిపించకుండా పోయిన ఫోన్ వెతకడంలో ఈ యాప్ కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేస్తుంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. యోట్రాకర్ (yoTracker) ఇప్పటివరకు మనం చెప్పుకున్న యాప్‌లలో ఇది చాలా ఉత్తమమైనదని భావిస్తారు. జీపీఎస్‌ను సమర్థవంతంగా వాడుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఈ యాప్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగిలిన ప్రోగ్రామ్ అదే జరుగుతుంది. తద్వారా లొకేషన్ తెలుస్తుంది. -
సెల్‌ఫోన్ పోగొట్టిందని భార్యను..
శంషాబాద్ రూరల్: సెల్‌ఫోన్ పోగొట్టిందని కోపోద్రిక్తుడైన భర్త, భార్యను కొట్టండంతో ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్తను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్ఐ అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట్ మండలం బుడ్డితండాకు చెందిన దంపతులు బన్నీ(40), కిషన్ నెల కిందట మండల పరిధిలోని పెద్దషాపూర్ తండాకు వలస వచ్చారు. వీరికి కూతురు అనిత ఉంది. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 18న బన్నీ సెల్‌ఫోన్ పోగొట్టిందని ఆగ్రహానికి గురైన కిషన్ ఆమెతో గొడవపడి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన బన్నీని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య మృతికి కారణమైన కిషన్‌ను ఆదివారం అరెస్టు చేశారు.