భారతి సిమెంట్ ‘మొబైల్ కన్స్ట్రక్షన్’ సేవలు
హైదరాబాద్: మెరుగైన నిర్మాణ ప్రక్రియల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రవేశపెట్టిన మొబైల్ వ్యాన్ల సంఖ్యను భారతి సిమెంట్ 10 నుంచి 25కి పెంచింది. కొత్తగా మరో 15 మొబైల్ కన్స్ట్రక్షన్ అడ్వైజర్ వాహనాలను సంస్థ డెరైక్టర్ (మార్కెటింగ్) ఎం. రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. నిర్మాణానికి ఉత్తమమైన ఇసుక, కంకర, ఇటుకలు మొదలైన వాటి ఎంపిక గురించి ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా తమ సివిల్ ఇంజనీర్లు.. వినియోగదారుల ఇంటి వద్దే తగిన సూచనలు అందిస్తారని ఆయన వివరించారు. అలాగే, తాపీ మేస్త్రీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిలో పాల్గొన్నవారికి లక్ష రూపాయల ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నామని రవీందర్ రెడ్డి తెలిపారు.