breaking news
MLC resigns
-
బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై.. కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బాబురామ్ చించనసూర్.. బీజేపీకి రాజీనామా చేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించనసూర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని(ఎమ్మెల్యే) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నిర్ణయానికి నో చెప్పడంతో పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీని బాబూరావ్.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితమే బీజేపీ నేత పుట్టన్న కాషాయ పార్టీని వీడారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కర్నాటకలో బస్వరాజు బొమ్మై సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బొమ్మై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, మరో మూడు నెలల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ జోరుగా ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా -
నైతిక విలువలకు పట్టం
♦ పదవులకు రాజీనామా చేస్తేనే వైఎస్సార్సీపీలోకి ప్రవేశం ♦ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ ♦ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి సాక్షి, అమరావతి: నైతిక విలువలు, నీతిమంతమైన రాజకీయాలకు అద్దంపట్టే అరుదైన సంఘటన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆవిష్కృతమైంది. డబ్బు సంచులు, పదవులు, కాంట్రాక్టులను ఎరవేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవులు సైతం కట్టబెడుతున్న తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు రోత పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఘటన రాష్ట్ర, దేశ ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది. తమ పార్టీలోకి ఇతర పార్టీల వారెవరైనా రావాలనుకుంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులన్నింటినీ వదులుకొని రావాల్సిందేనని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. ఈ మేరకు టీడీపీ గుర్తుపై తాను సాధించిన శాసనమండలి (కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానం) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఆ మేరకు శాసన మండలి చైర్మన్‌ను ఉద్దేశిస్తూ నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామా లేఖపై సంతకం చేసి, బహిరంగ సభ వేదికపై, ప్రజల సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయాలని కోరారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బులు, పదవులు ఆశచూపి చంద్రబాబు టీడీపీలో చేర్చుకొంటున్నారని, అలాంటి నీచ రాజకీయాలకు వైఎస్సార్సీపీ ఏనాడూ పాల్పడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు అక్కడి పదవులను వదులుకొంటేనే తమ పార్టీలోకి ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. అటు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన సంగతి తెలిసిందే.