breaking news
MLA venkatareddy
-
బంద్‌ను జయప్రదం చేయండి
మార్కాపురం (ప్రకాశం): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా మంగళవారం జరిగే బంద్‌లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం రాత్రి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంగళవారం జరిగే బంద్‌పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జంకె మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేశారని, ఆయన వల్లే ఇప్పటికీ హోదా ప్రజల్లో సజీవంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో ప్రత్యేక హోదాను మరచిపోయి ప్రత్యేక ప్యాకేజీ చాలని ప్రకటించి ఇప్పుడు మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ మాట్లాడటాన్ని ప్రజలు నమ్మరన్నారు. నేడు జరిగే బంద్‌లో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, హోటల్స్, సినిమాహాల్స్, విద్యా సంస్థలు, వస్త్రదుకాణాలు, కూరగాయల మార్కెట్, ఫ్యాన్సీ స్టోర్స్, అన్ని రకాల వాణిజ్య సంస్థల యజమానులు పాల్గొని బంద్‌కు సహకరించాలన్నారు. మార్కాపురం – పొదిలి– తర్లుపాడు– కొనకనమిట్లలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనాలన్నారు. ఆర్టీసీ బస్సులను కూడ తిరగనివ్వమన్నారు. తెల్లవారుజామున డిపోకు వెళ్లి బస్సులను నిలిపివేస్తామని, అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అందరూ సహకరించి ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను కేంద్రానికి, రాష్ట్రానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, నాయకులు పత్తి బక్కయ్య చౌదరి, పంబి వెంకటరెడ్డి, సీహెచ్ రమణారెడ్డి, ఏ.సుధీర్, కేవీ రెడ్డి, గుంటక పాపిరెడ్డి, భారతి సిమెంట్ డీలర్ వెంకటేశ్వరరెడ్డి, ఎం.వరప్రసాద్, రాజేష్, షేక్ మహబూబ్‌బాష, ఉస్మాన్, శంకర్‌రెడ్డి, సుభాని, ఎస్.రవికుమార్, పాల్గొన్నారు. -
తరగని ఆదరణ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ నేతలకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలను దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 14వ రోజు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు 5వ డివిజన్లోని మహేంద్రనగర్, గోపాల్‌నగర్ ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి బాలినేని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికిన ప్రజలను నగరంలోని ప్రధానంగా తాగునీటి సమస్యలు, మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం, తద్వారా దోమల బెడద తదితర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాచతీ అక్కచెరువుతండాలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి దేశాయిపేటలో ఇంటింటి పర్యటన చేశారు. మార్టూరు మండలం చీమిర్రిబండలో పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, కంభం మండలం లింగాపురంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు.