breaking news
mla koram kanakayya
-
అడవిలో ఎమ్మెల్యే...
టేకులపల్లి : మండలంలోని కొప్పురాయి పంచాయతీ మొట్లగూడెం గ్రామాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన గిరిజనులకు అటవీ శాఖాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో జెడ్పీటీసీతో కలిసి శనివారం సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. రైతులు ఎవరూ భయపడొద్దని అందరికీ అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు, నాయకులు కణతాల వసంతరావు, ఇస్లావత్ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో అమాత్య..
టేకులపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో..అడవి బాటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుల్లెట్‌పై రయ్‌న దూసుకెళ్లి ఆశ్చర్యపర్చారు. మంగళవారం టేకులపల్లి మండల పరిధిలో బోడు వద్ద గల ముర్రేడ్ ఫీడర్ చానల్ పరిశీలించేందుకు ఇదిగో ఇలా బుల్లెట్‌పై బయల్దేరారు. అడవిలో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫీడర్ వద్దకు సరైన రోడ్డు లేదు. దీంతో మండుటెండలో చెట్లు, పుట్టల వెంట..బండలు ఎక్కిదిగుతూ కాలినడకన కొద్ది దూరం వెళ్లారు. ఆ తర్వాత బుల్లెట్‌పై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కూర్చొబెట్టుకొని స్వయంగా నడుపుకుంటూ బయల్దేరడంతో.. అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కంగారు పడ్డారు.