breaking news
mixed water drunk
-
విషపూరిత నీరు తాగి 30 గొర్రెల మృతి
కొత్తచెరువు : మండలంలోని నారాయణపురం క్రాస్ సమీపంలోని ఓ పొలం వద్ద విషపూరిత నీరు తాగి 30 గొర్రెలు మృతి చెందాయి. వివరాల మేరకు.. మండలంలోని అప్పలవాండ్లపల్లి తండాకు చెందిన కోనేనాయక్, గేగనాయక్ మంగళవారం 800 గొర్రెలను మేత కోసం తీసుకెళ్లారు. అనంతరం సమీపంలోని రైతు రామక్రిష్ణ పొలం వద్ద ఉన్న నీటి తొట్టెలో గొర్రెలు నీరుతాగాయి. అయితే పొలంలో ఉన్న టమాటా పంటకు తెగులు సోకడంతో నివారణ కోసం రైతు క్రిమిసంహారక మందును తొట్టెలో కలిపాడు. విషయం తెలియని కాపరులు గొర్రెలకు నీరు తాగించారు. కొద్ది సేపటికే గొర్రెలు నోట్లో నురుగు కక్కుతూ పడిపోయాయి. వారు వెంటనే స్థానిక పశువైద్యాధికారి నవీన్కుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెళ్లేటప్పటకి 30 గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలకు వెంటనే ఆయన చికిత్స అందించి కాపాడారు. దాదాపు రూ.1.50 లక్షల దాకా నష్టపోయామని బాధితులు వాపోయారు. -
కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెల మృతి
మారాల (బుక్కపట్నం) : కలుషిత నీళ్లు తాగి 17 గొర్రెలు మతి చెందాయి. మండలంలోని మారాల గ్రామానికి చెందిన కష్టప్ప, రాముడుకు చెందిన గొర్రెల మందకు శుక్రవారం శీకాయకుంట సమీపంలో ఓౖ రెతు బోరు బావి వద్ద నీళ్లు తాపారు. కొద్ది చేపటికి ఒక్కొక్కటిగా 17 గొర్రెలు మతి చెందాయి. రైతు టమోటా తోటకు క్రిమి సంహరక మందులు పిచికారి చేయటం వల్ల కాలువలో మందు నీళ్లు కలిశాయి. విషయం తెలియక ఆ నీళ్లు తాగటంతో 17 గొర్రెలు చనిపోయాయని కాపరులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని వీఆర్ఓ íß జ్జూర్రహిమాన్ పరిశీలించారు.