breaking news
missing person
-
ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..
మా తల్లిదండ్రుల నలుగురు సంతానంలో నేను మూడవ వాడిని. వారు కొనుగోలు చేసిన ఆస్తులను మా నలుగురి పేరిట పెడుతూ వచ్చారు. మా అన్నయ్య ఒకరు దాదాపు 15 ఏళ్ల క్రితం, అతనికి 19 ఏళ్ళ వయసులో కనపడకుండా పోయారు. ఆయనకి మతిస్థిమితం లేదు. అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. మా అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తులు పలు జిల్లాలలో ఉన్నాయి. అందులో నుంచి వచ్చే ఆదాయాన్ని మా అమ్మగారు తీసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మా తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ మిగిలిన ముగ్గురికి ఇవ్వాలని మా అమ్మగారు అనుకుంటున్నారు. కానీ కనపడకుండా పోయిన మా అన్నయ్య ఆస్తులను మాత్రం తన జీవితకాలం మొత్తం ఇవ్వను అంటున్నారు. ఒకవేళ తన పెద్ద కొడుకు తిరిగి వస్తే అతనికే చెందేలా చేస్తాను అంటున్నారు. ఆ ఆస్తుల్లో మాకు భాగం వుండదా?– గౌతం, హైదరాబాద్ మీ అమ్మానాన్నల పేరుతో ఉండే ఆస్తులు వారు ఎవరికి కావాలంటే వారికి... ఏ ప్రాతిపదికన.. ఎంత ఇవ్వాలనేది వారి నిర్ణయం మాత్రమే! కనబడకుండా పోయిన మీ అన్నయ్య ఆస్తి కూడా మీ అమ్మానాన్నలు కలిసి సంపాదించారు అని చెప్తున్నారు కాబట్టి అందులో మీకు ఎటువంటి వాటా ఉండదు. ఏది ఏమైనా, కనపడకుండాపోయిన ఒక వ్యక్తి ఆస్తి తన ఫస్ట్ క్లాస్ లీగల్ హేర్ (అంటే, తన భార్య, సంతానం, తల్లి గారు)కు మాత్రమే ఉంటుంది. మీ కేసులో, కనపడకుండా పోయిన తన కొడుకు ఆస్తిపై కేవలం మీ తల్లి గారికి మాత్రమే హక్కు ఉంది. ఒక వ్యక్తి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కనపడకపోతే, భారతీయ సాక్ష్య అథినయం సెక్షన్ 111 (పూర్వం సెక్షన్ 108, ఇండియన్ ఎవిడెయాక్ట్) ప్రకారం చట్టం ఆ వ్యక్తిని ‘‘చట్టపరంగా మరణించిన వ్యక్తి’’గా పరిగణిస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులు ఎలాగైతే పంచుతారో అలాగే ఈ ఆస్తులను కూడా పంచవలసి ఉంటుంది. మీ తల్లిగారు బతికే ఉన్నారు కాబట్టి, తప్పిపోయిన అన్నయ్యకు పెళ్లి కాలేదు కాబట్టి, అలాగే ఆ ఆస్తి పూర్వీకుల నుంచి సంక్రమించినది కాదు కాబట్టి, ఆ ఆస్తి మీద పూర్తి హక్కు మీ అమ్మగారికి మాత్రమే ఉంటుంది. ముందుగా ఏదో ఒక ఆస్తి ఉన్న పరిధిలోని సివిల్ కోర్టును ఆశ్రయించి, కనబడకుండాపోయిన తన కొడుకును చట్టపరంగా మరణించిన (సివిల్ డెత్) వ్యక్తిగా పరిగణించాలి అని కోరుతూ, తన ఆస్తులు అన్నిటికీ కూడా తల్లిగారు మాత్రమే వారసురాలు అని కేసు నమోదు చేయాలి. సివిల్ కోర్టు నుంచి డిక్రీ పొందిన తర్వాత ఆ ఆస్తులను తన పేరుకు మార్చుకొని, తనకు కావలసిన సమయంలో లేదా ఒక వీలునామా ద్వారా ఆ ఆస్తులను ఎవరికి ఎలా పంచాలి అనే అంశంపై తన ఇష్టపూర్వక నిర్ణయం తీసుకోవచ్చు. (చదవండి: మూడు నెలల్లో పదికిలోలు తగ్గి..మెడిసిన్ వాడకుండానే డయాబెటీస్ క్యూర్!) -
అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా? ఎప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా?’ అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా.. భర్త ఏమయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో.. పిల్లలకు ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో విజయవాడ ఊరి్మళానగర్‌కు చెందిన పాయల నందిని ఆందోళన చెందుతోంది. వరద వచ్చినప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఊర్మిళానగర్‌లోని రెడ్డి కాలనీకి చెందిన పాయల శేఖర్, నందిని దంపతులకు పిల్లలు మధుప్రియ(4), చైత్రిక (2) ఉన్నారు. శేఖర్ తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం బుడమేరు వరద పెరుగుతుందని తెలియడంతో శేఖర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సమీపంలోని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.తన వద్ద పనిచేసే వారి సాయంతో ఇంట్లోని వస్తువులను బయటకు చేర్చాడు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో వెంటనే భవానీపురం పోలీస్ కాలనీలో తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చెల్లెలికి ఫోన్ చేసి.. ‘వరద ఎక్కువగా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. వరద తగ్గాక వస్తా’ అని చెప్పాడు. చెల్లెలి భర్తకు ఫోన్ చేసి.. తన కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని వాపోయాడు.ఆ తర్వాత శేఖర్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. అప్పటి నుంచి శేఖర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య నందిని, పిల్లలు రోదిస్తున్నారు. ‘వారం రోజులు గడిచిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి రోజూ వెళ్తున్నాం. ఎక్కడ గుర్తు తెలియని శవం ఉందని చెబితే అక్కడి వెళ్లి చూసి వస్తున్నాం. మా అన్న అసలు ఉన్నాడో.. లేడో అని ఆందోళనగా ఉంది’ అంటూ శేఖర్ చెల్లెలు భారతి కన్నీరుమున్నీరయ్యింది. -
ప్రపంచంలోనే మొదటిసారి.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్
ఇస్తాంబుల్: కొన్ని రోజలు క్రితం తన నీడ పోయిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేసే కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాటిక్ సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి.. తనను తానే వెతుక్కున్నాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. టర్కీకి చెందిన బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న శయ్యక గ్రామీణ ప్రాంతంలో ఓ పార్టీకి వెళ్లాడు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో మత్తులో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. బెహాన్ ఎంతకి తిరిగి రాకపోవడంతో.. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బెహాన్ తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి.. అతడి పేరును పెద్దగా పిలుస్తూ.. గాలింపు చర్యలు కొనసాగించారు. స్పృహ కోల్పోయిన బెహాన్‌కి అప్పుడే కొద్దిగా మెలకువ వచ్చింది. పూర్తిగా మత్తు వదలలేదు. ఈ క్రమంలో అతడు పోలీసులతో కలిసి బెహాన్ గురించి అంటే తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు. (చదవండి: వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’) మరోసారి పోలీసులు బెహాన్ పేరు పిలవడంతో అతడి మత్తు వదిలిపోయింది. ఓ నిమిషం షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు దగ్గరకు వెళ్లి.. ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు బెహాన్ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని తెలిపారు. వెంటనే బెహాన్.. వారు వెతుకుతుంది తన కోసమే అని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు. ఇక పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్న బెహాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనలు.. బహుశా ప్రపంచంలోనే తనను తాను వెతుక్కున్న మొదటి వ్యక్తి ఇతడే అయ్యుంటాడు అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువలో స్నానానికి దిగి గల్లంతైన మద్దిలేటి(35) అనే వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం 6 గంటలకు లభ్యమైంది. కొడుమూరు కర్నూలు బ్రాంచి కెనాల్ వద్ద మృతదేహన్ని కనుగొన్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి తన స్నేహితులతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో పార్టీ చేసుకున్నాడు. అనంతరం స్నానం చేద్దామని కాలువలోకి దిగగా..ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. స్నేహితులంతా కలిసి నిన్నటి నుంచి వెతకటం ప్రారంభించటంతో సోమవారం ఉదయం అతని శవం బయటపడింది.