breaking news
Mirpeta Police Station
-
సార్.. అన్నంలో పురుగులు ఎట్ల తినాలి?
హైదరాబాద్: ‘సార్.. మధ్యాహ్న భోజనంలో పురు గులు వస్తున్నాయి.. ఎట్ల తినాలి’ అంటూ నాలుగో తరగతికి చెందిన ఓ విద్యార్థిని తన తల్లితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య కథనం ప్రకారం.. మీర్‌పేట సిర్లాహిల్స్‌కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగు రావడంతో పడేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు అన్నం ఎందుకు పడేశావని అడగ్గా పురుగు వచ్చిందని చెప్పింది. అన్నం తినేది ఉంటేనే పాఠశాలకు రావాలని..లేకపోతే రావొద్దని ఉపాధ్యాయులు మందలించారు. దీంతో పూజిత బుధవారం మధ్యా హ్నం తల్లి రాణితో కలిసి మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ తిరుపతయ్య తనిఖీ చేయగా కూరగాయలు వారం రోజుల క్రితం తెచ్చినవి కావడంతో దాదాపు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను వివరణ కోరగా బాలిక రెండురోజుల నుంచి పాఠశాలకు గైర్హాజరైందని తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ అన్నంలో పురుగులు వచ్చాయని బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే మండల విద్యాధికారి కృష్ణయ్య వెంటనే పాఠశాలను తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం నాణ్యతగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని తెలిపారు. -
పోలీసు పద్మవ్యూహం
- నందనవనంలో అర్ధరాత్రి సోదాలు - పోలీసుల అదుపులో 110 మంది అనుమానితులు సరూర్‌నగర్ : నాలుగు వందల మంది పోలీసులు.. పది బృందాలుగా ఏర్పడి ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం, పరిసర కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఒక్కమారుగా పోలీసు బృందాలు బస్తీలోని ఇళ్ల మీదకి రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో పలువురు అనుమానితులను, కొత్త,పాతనేరస్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది అవుట్ పాయింట్లు, పది ఇన్నర్ పాయింట్లతో కూంబింగ్ నిర్వహించారు. జెఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కాలనీ, దేవినగర్, నందనవనంలోని 1044 బ్లాక్‌లను అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్‌లలో పిక్‌పాకెటింగ్ చేసే రమాదేవి, 16 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్ బంగారు శ్రీను, కరుడు గట్టిన హౌస్‌బ్రేకర్ కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్, హబీబ్‌లు చిక్కారు. వీరందరిపై పలు జిల్లాల్లో నాన్‌బెయిలబుల్ కేసులున్నాయి. 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల స్టాక్‌తో కూడిన, టాటా ఏస్ వాహనం పట్టుబడింది. 9 ఎల్పీజీ సిలిండర్లు, 48 ఆటోలు, 56 బైక్‌లతోపాటు 2 బెల్ట్ షాప్‌లపై దాడి చేసి బీర్లు, వైన్ బాటిళ్లు, గుట్కాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ పద్మవ్యూహం ముగిసిన తర్వాత డీసీపీలు విశ్వప్రసాద్, జానకీషర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కార్డన్ అండ్ సెర్చ్ ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించామని, అందులో నందనవనంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఇక నుంచి జోన్ల వారీగా ఈ సో దాలు చేస్తామన్నారు.. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఏసీపీలు, 60 మంది ఇన్స్పెక్టర్లు, 80 మంది ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్ టీమ్‌లు, జోనల్టాస్క్ఫోర్స్ బృందాలుగా పాల్గొన్నాయి.