breaking news
miracle boy
-
మెడికల్ మిరాకిల్..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు!
వాషింగ్టన్: ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. రెండు ముఖాలతో జన్మించిన ఈ బాలుడు సైతం ఎంతో కాలం జీవించలేడని వైద్యులు చెప్పేశారు. కానీ, ఈ బాలుడు తనకు ఎదురైవుతున్న సమస్యలన్నింటినీ దాటుకుని ఇప్పుడు 18వ పడిలోకి అడుగుపెట్టాడు. వైద్యుల మాట తప్పు అని నిరూపిస్తూ మెడికల్ మిరాకిల్ అనిపించుకుంటున్నాడు. ఆ బాలుడే అమెరికాకు చెందిన ట్రెస్ జాన్సన్. అమెరికాలోని మిస్సోరీకి చెందిన ట్రెస్ జాన్సన్.. రెండు ముఖాలతో జన్మించాడు. ఎస్హెచ్ఎచ్ అనే జన్యు లోపం కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై రెండు ముక్కులు, మూడు కళ్లు, నోటిలోనూ చిలిక.. దాదాపుగా రెండు ముఖాలు ఉన్నాయి. తొలుత చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయితే.. అధునాత చికిత్సలతో బాలుడు వేగంగా కోలుకున్నాడు. గంజాయి ఆయిల్ తీసుకోవటం ద్వారా ముక్కు కారే సమస్య దాదాపుగా నియంత్రణలోకి వచ్చిందని జాన్సన్ తల్లితండ్రులు తెలిపారు. అదే ఆయిల్‌ను గత ఏడేళ్లుగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. వింత జబ్బులతో బాధపడుతున్న తన కుమారుడికి ఔషధాల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రసవం తర్వాత తొలిసారి తన బిడ్డను చూసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జాన్సన్ తల్లి బ్రాండీ. ప్రస్తుతం తన కుమారుడు 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by TresMa (@diprosopusdiaries) ఇదీ చదవండి: విమాన సిబ్బందికి ‘లోదుస్తులు’ కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ నవ్వులపాలు, ఆగ్రహజ్వాలలు -
కింగ్.. కాంగ్..
చూడగానే.. జబ్బుపడి లేచినట్లు కనిపిస్తున్నాడు కదూ ఈ పిల్లాడు. మనకిలా కనిపిస్తున్నాడు కానీ.. వీడు దైవాంశ సంభూతుడట.. వీడు జబ్బు పడటం ఏంటి.. వేరే వాళ్ల జబ్బుల్ని సైతం ఇట్టే మాయం చేయగలడని లోకలోళ్లు చెబుతున్నారు. కంబోడియాలోని నార్ అనే గ్రామంలో ఉండే కాంగ్ కెంగ్(2) అద్భుత బాలుడిగా పేరొందాడు. వీడి దర్శనం కోసం లావోస్, వియత్నాం నుంచి కూడా జనం వేల సంఖ్యలో వస్తారు. కొన్ని నెలల క్రితం ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చిన తమ సమీప బంధువు ఒకరికి వీడు నయం చేశాడట. అది ఆ నోటా ఈ నోటా పాకి.. ఇలా సెలబ్రిటీ అయిపోయాడు. కాంగ్ పడుకున్నప్పుడు మైక్‌లో.. ‘అద్భుత బాలుడు పడుకున్నాడు. ఎవరూ సౌండ్ చేయకండి.. లేదంటే ఆయనకు ఆగ్రహమొస్తుంది’ వంటి అనౌన్స్మెంట్లు ఇక్కడ కామన్. వీడు ప్రత్యేకమైన మూలికలతో చూర్ణం చేసి.. అమృతాంజనం బాటిళ్ల వంటివాటిలో నింపుతాడు. తర్వాత దానిపై వీడు చేయి పెడితే.. ఆ చూర్ణానికి అద్భుత శక్తులు వచ్చేసి.. దాన్ని తీసుకున్నవారి జబ్బులను నయం చేసేస్తాయట. గత నెల్లో ఓ 20 వేల మంది కాంగ్ దర్శనానికి వస్తే.. వారిలో దాదాపు వేయి మందికి స్వస్థత చేకూరిందట. తాము అందరికీ ఉచితంగా మందులిస్తున్నామని.. తమకేమీ అక్కర్లేదని, వచ్చినోళ్లు స్థానిక బౌద్ధాలయాలకు రూ.50 చొప్పున విరాళమివ్వాలని కాంగ్ తండ్రి చెబుతున్నారు. మందులైతే ఉచితమేగానీ.. కాంగ్‌ను వ్యక్తిగతంగా కలవాలంటే మాత్రం రూ.100-150 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.