breaking news
minor child
-
మైనర్‌ను రేప్ చేస్తే మరణశిక్షే
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు–2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్ వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు. 2015 నుంచి 2017 నవంబర్ వరకూ రాష్ట్రంలో 225 రేప్ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నిజామాబాద్: అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మనవత్వం మరచిన మృగాల వంటి కొందరు మగవాళ్లు బాలికపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం ఏరుగట్ల గ్రామంలో ఇటువంటి దారుణమే జరిగింది. నలుగురు యువకులు ఓ మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.