breaking news
minister shinde
-
నిడో హత్య కేసు నిందితులకు జ్యుడీషయల్ కస్టడీ
న్యూఢిల్లీ: గ్రీన్‌పార్క్ ఎక్స్టెన్షన్లో ఉండే అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తనియా హత్య కేసు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు విధించిన రిమాండ్ ముగియడంతో నిందితులు ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్‌ను సీబీఐ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రీతమ్ సింగ్ ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 21 దాకా కస్టడీ విధించారు. మృతుడి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. లజ్‌పత్‌నగర్‌లో జనవరి 29న ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఈ యువకుడు మరణించినట్టు కేసు నమోదయింది. -
దర్యాప్తునకు సీబీఐ ఓకే
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తనియను జనవరి 29న లజజ్పత్నగర్లో కొం దరు వ్యాపారులు కొట్టిచంపినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించనుంది. ఢిల్లీ పోలీ సులే కేసు దర్యాప్తు పూర్తి చేశారు కాబట్టి తమ ప్రమే యం అవసరం లేదని సీబీఐ మొదట వాదించింది. అయితే సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించాక దర్యాప్తునకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే సీబీఐ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయనుంది. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు, బీఏ మొదటి ఏడాది చదివే నిడో తనియ జనవరి 29న లజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు. ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్క డుందో తెలుసుకోవడానికి అక్కడున్న ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. దుకాణంలో కూర్చున్న ఇద్ద రు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడో తనియంకు కోపం తెప్పించిం ది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టా డు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కల సి నిడోను చితకబాదారు. దెబ్బలు తిన్న నిడో పోలీ సులు, మిత్రులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మిత్రులు స్థాని కులతోనూ ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి రాజీ కుదిర్చారు, పోలీ సులు సూచన మేరకు తాము నిడోకు రూ. ఏడువేలు ఇచ్చామని రిజ్వాన్ చెప్పాడు. అయితే ఆ తరువాత పోలీసులు నిడోను దుకాణం వద్దకే తీసుకువచ్చి వదిలారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు నిడోను మరోమారు చితకబాదారని అతని మిత్రులు ఆరోపించారు. మరునాడు ఉదయం గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లోని గదిలో ఇతడి మృతదేహం కనిపించిందని కుటుంబసభ్యులు చెప్పారు. దెబ్బల ధాటికే నిడో మరణించారని ఆరోపించారు. ఈ ఘటనలో నింది తులు ఇద్దరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటిం చారు. నిడో ఘటనపై ఈశాన్య ప్రాంతవాసులు, ప్రజాప్రతినిధులు ప్రధాని మన్మోహన్సింగ్, హోం మంత్రి షిండే, బీజేపీ నేత హర్షవర్ధన్‌ను కూడా కల సి ఫిర్యాదు చేశారు. ఈశాన్య ప్రాంత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలసి నీడోపై జరిగిన దాడి పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఇతని మృతిపై హోంశాఖ ఢిల్లీ పోలీసుల నివేదిక కోరింది. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.