breaking news
minister prathipati pullarao
-
మాటలు చెప్పకండి సార్..
పత్తికొండ: మాటలు చెప్పకండి సార్.. చెప్పిన మాటల్లో నిజం ఉండాలంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ రైతు వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీయడంతో మంత్రి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..పత్తికొండ మండలంలోని కోతిరాళ్ల క్రాస్ రోడ్డులో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో రైతు కేశవయ్య మాట్లాడుతూ తాను ఉల్లి పంట సాగు చేశానని, ఎకరాకు రూ.80 వేల పెట్టుబడి అయిందన్నాడు. అయితే పక్కనే ఉన్నా హంద్రీ నీవా నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తున్నా. ఇంతా చేస్తే.. కిలో రూ.6లతో కొనుగోలు చేస్తామంటారు. ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో వాపోయాడు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ నీకు రుణమాఫీ అయిందా అన్నారు. కాలేదని రైతు చెప్పడంతో కొన్ని లోపాల వల్ల రాకపోయి ఉండొచ్చని సర్ది చెప్పారు. దీంతో రైతు మాటలు చెప్పకండి సార్, చెప్పిన మాటల్లో నిజం ఉండాలన్నాడు. ఆ మాటలకు ఖంగుతిన్న మంత్రి నువ్వుగా ఇక్కడికి వచ్చావా.. లేక సాక్షి విలేకరులు.. వైఎస్సార్ సీపీ నాయకులు చెబితే వచ్చావా అంటూ రైతును దబాయించాడు. దీంతో అదే స్థాయిలో రైతు కేశవయ్య నేను రైతును. మీరు అడుగుతుంటే నా బాధ చెబుతున్నా అన్నాడు. దీంతో రైతును సభ నుంచి దూరంగా పంపేశారు. -
మంత్రి పేరు లేకుండా ఫిర్యాదు ఇమ్మంటున్నారు
ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేరు వద్దని పోలీసుల ఒత్తిడి దుండగుల దాడిలో గాయపడిన ‘సాక్షి’ విలేకరి సురేంద్ర ఆవేదన చికిత్స పొందుతున్న బాధితుడు గుంటూరు (పట్నంబజారు): మంత్రి ప్రత్తిపాటి దంపతుల పేర్లు లేకుండా ఫిర్యాదు ఇమ్మని పోలీ సులు ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరి పేట ‘సాక్షి’ విలేకరి సురేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన సురేంద్ర శుక్రవారం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కర్రలతో తీవ్రంగా గాయపరచడంతో తీవ్ర మైన నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. బంధువుల సహాయంతో గుంటూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర మీడియాతో మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రి గోల్డ్ భూ ములు, రాజధానిలో కొనుగోలు చే సిన భూముల గురించి వార్తలు రాయడంతోనే తనపై ఆయన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. గతంలోనూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వార్తలు రాసిన నేపథ్యంలో మంత్రి భార్య ఆదేశాల మేరకే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వాపోయారు. తనపై దాడి జరిగిన అనంతరం యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే సంబంధిత స్టేషన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు.. ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేర్లు లేకుండా తిరిగి ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై రౌడీషీటు కూడా తెరిపించారని, మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారని వాపోయారు. సురేంద్రనాథ్‌పై దాడిని ఎంపీటీసీ సభ్యుడు వి.శ్రీనుబాబు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చింతారావు ఖండించారు. -
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి