breaking news
Mineral mining
-
కీలక ఖనిజాల పథకానికి ఆమోదం
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో అత్యావశ్యకంగా మారిన అరుదైన భూఅయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడటం మానేసి అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా భూఅయస్కాంతాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి రూ.7,280 కోట్లతో నూతన పథకాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్(ఆర్ఈపీఎంఎస్) అని పేరు పెట్టింది. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, రక్షణ పరికరాల్లోని కీలక భాగాలను ఈ భూఅయస్కాంత ఖనిజాలతోనే తయారుచేస్తారు. దీంతో వీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ తగ్గ సరఫరా సాధించడంతోపాటు స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆయన తర్వాత మీడియాకు వెల్లడించారు.ఔత్సాహిక కంపెనీల కోసం అంతర్జాతీయ బిడ్డింగ్ అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానిస్తారు. వీటి నుంచి చివరకు ఐదు సంస్థలను ఎంపికచేస్తారు. ఒక్కో కంపెనీకి 1,200 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తారు. ఏడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు తొలి రెండేళ్లలోపు పూర్తిస్థాయిలో తయారీయూనిట్ను స్థాపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్లలోపు భూఅయస్కాంతాల తయారీ, విక్రయం, ఎగుమతి మొదలెట్టాలి. రూ.7,280 కోట్ల పథకంలో రూ.6,450 కోట్లను విక్రయాల ప్రోత్సాహకాల కింద కేటాయించారు. 6,000 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్య సాధన కోసం మరో రూ. 750 కోట్లను మూలధన సబ్సిడీగా కేటాయించారు. భారత్‌లో ఏటా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగం, పారిశ్రామిక ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో భూఅయస్కాంతాల వినియోగం పెరుగుతోంది. దీంతో వీటి డిమాండ్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కావొచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది. అంతర్జాతీయంగా భూఅయాస్కాంత ఖనిజాల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛ లోహాల తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. భారత్‌కు ఏటా 5,000 మెట్రిక్ టన్నుల భూఅయస్కాంతాల అవసరం ఉంది. అయితే ఏడు కీలక భూఅయస్కాంతాలు, వాటి ఉపఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి అంటూ ఏప్రిల్ 4న చైనా కఠిన నిబంధనలు అమల్లోకి తేవడంతో భారత్‌సహా ప్రపంచదేశాలకు వీటి కొరత విపరీతంగా ఏర్పడింది. దీంతో భారత్ ఇలా భూఅయస్కాంతాల్లో ఆత్మనిర్భరత దిశగా అడుగులేస్తోంది.ఏమిటీ భూఅయస్కాంతాలు? తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవటం వంటి గుణాలతో కూడిన పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాల్లో భూఅయస్కాంతాలనే వాడతారు. అందుకే వీటికి అంతటి డిమాండ్. విద్యుత్, కాంతి సంబంధ, అయస్కాంత, ఉత్ప్రేరక అప్లికేషన్లలో వీటిన ఉపయోగిస్తారు. ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు. ముఖ్యంగా యురేనియం, థోరియం వంటి రేడియోధారి్మక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి. వీటిని వేరు చేసి, శుద్ధి చేయటం చాలా కష్టమైన పని. భారత్‌లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూఅయస్కాంత నిల్వలున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. పశి్చమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. కొత్తరకం ఎల్రక్టానిక్ వస్తువులు, మోటార్లు, ఎనర్జీ టెక్నాలజీ వస్తువులు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్రింటర్లు, సీడీ/డీవీడీ డ్రైవ్‌లు, సెన్సార్లు, రాకెట్లు, పవర్‌స్టీరింగ్, విండో లిఫ్ట్, సీట్ మోటార్లలోనూ వీటిని వాడతారు. -
‘దేవర తిప్ప’పై అక్రమార్కుల తిష్ట
సైదాపురం: విలువైన ఖనిజ నిక్షేపాలున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దేవరతిప్ప కొండపై అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు తిష్ట వేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉన్న ఈ కొండలో అపారమైన స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజం దొరుకుతుంది. దీంతో కూటమి నేతలు ఈ కొండను చెరబట్టారు. వారి అండతో ఓ చోటా వ్యాపారి విలువైన ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. పట్ట పగలే భారీ సంఖ్యలో కూలీలను పెట్టి యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఈ విషయం తెలిసినా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దేవరతిప్ప వద్ద 24 రకాల ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.దేశంలో భూగర్భ పరిశోధన చేసే విద్యార్థులు ఏటా ఈ కొండను సందర్శించి, ఇక్కడి ఖనిజాలపై పరిశోధనలు చేస్తుంటారు. గతంలో టీడీపీ హయాంలో ఈ కొండలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత గనులన్నీ మూతపడిపోవడంతో కొండ జోలికి రాలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. యంత్రాలతో త వి్వతే అనుమానాలు వస్తాయన్న కారణంతో ఇతర ప్రాంతాల నుంచి తెచి్చన కూలీలతో తవ్వుతున్నారు.తట్టకు రూ.150 వంతున కూలీలకు చెల్లిస్తున్నారు. 400 తట్టలు ఏరితే 10 టన్నులు వస్తోంది. స్థానికంగానే 10 టన్నుల ఖనిజానికి రూ. లక్ష ధర పలుకుతోంది. ఈవిషయం జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఫలితం లేకపోయిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. -
అటవీ’ విధ్వంసాన్ని అనుమతించబోం
సాక్షి, హైదరాబాద్: ఖనిజ తవ్వకాల పేరుతో అటవీ భూముల విధ్వంసం కొనసాగుతోం దని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ భూముల ధ్వంసంతో వన్యప్రాణుల మనుగుడ ప్రశ్నార్థకమవుతోందని, పర్యావరణ సమతుల్యత లోపించి అనర్థాలు ఏర్పడుతున్నాయని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అనుమతించబోమని స్పష్టం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం, జాకారం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వద్దంటున్నా ఖనిజ తవ్వ కాలకు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. దీంతో అక్కడ చారిత్రక కట్టడం పాండవుల గుట్టకు నష్టం కలుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చిన రెండు కొండలకూ, ఈ పాండవుల గుట్ట మధ్య రోడ్డు మార్గం ద్వారా ఎంత దూరం ఉందో తేల్చాలంది. దీనిపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ను ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌ల దర్మాసనం మంగళవారం ఉత్తర్వు లిచ్చింది. జాకారంలో 4.8 హెక్టార్ల విస్తీర్ణం లో లేటరైట్ తవ్వకాలకు గణపతి మినరల్స్‌కు అనుమతినివ్వడాన్ని సవాల్‌చేస్తూ మహ్మద్ యాకూబ్ పాషా హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
మళ్లీ కలకలం
బాక్సైట్ ఉద్యమం ఉధృతానికి మావోయిస్టుల యత్నం ముగ్గురు టీడీపీ నాయకుల కిడ్నాప్ నేడు చర్చలకు ప్రజాసంఘాలు వరుస సంఘటనలలో గిరిజనుల బెంబేలు బాక్సైట్ భగభగలతో మన్యం వేడెక్కుతోంది. ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జీకే వీధి మండలానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు మంగళవారం కొత్తగూడ వద్ద కిడ్నాప్ చేశారు. దీంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారపార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వీరిని విడిపించడానికి ప్రజాసంఘాలు బుధవారం మావోయిస్టులతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. విశాఖపట్నం: బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ గిరిజన ఉద్యోగ సంఘాలతో మావోయిస్టులు ఇటీవల సమావేశమవుతున్నారు. దళసభ్యులు రాత్రిళ్లు గ్రామాల్లో తిరుగుతూ ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు వెదజల్లుతున్నారు. బ్యా నర్లు కడుతున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కిడ్నాప్‌నకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీకే వీధి మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు ముక్తల మహేష్, జన్మభూమి కమిటీ మండల అధ్యక్షుడు మండలం బాలయ్యలను మంగళవారం కిడ్నాప్ చేశారు. వీరంతా అధికారపార్టీకి చెందినవారే కావడం విశేషం. లేఖల కలకలం..: మన్యంలో గాలికొండ ప్రాంతంలో కొంత, జల్లెల ప్రాంతంలో ఎక్కువగా బాక్సైట్ తవ్వకాలకు అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ మావోయిస్టు కమిటీలు లేఖలు విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీలో గ్రీన్‌హంట్ పేరుతో పోలీస్ కూంబింగ్‌ను నిలిపివేయాలని సీపీఐ(మావోయిస్టు) ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ విడుదల చేసిన లేఖలో డిమాండ్ చేసింది. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం విడుదల చేసిన లేఖలోనూ ప్రభుత్వంపైనా ,పోలీసులపైనా తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. బాక్సైట్ తవ్వకాలను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా ఈనెల 7నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రాణాలు తీస్తున్న బాక్సైట్:బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించిన గిరిజన నేతలను మావోయిస్టులు మట్టుబెట్టిన సంఘటనలు ఎన్నో.. మూడేళ్ల కిందట జీకేవీధి మండలం ఏబులం గ్రామానికి చెందిన మండల ఉపాధ్యక్షుడు (సీపీఐ)సోమలింగం బాక్సైట్ ప్రాంతంలో మట్టి నమూనా సేకరించడంతో దళసభ్యులు అతని ఇంటిపై దాడిచేసి గ్రామంలోనే అతడ్ని హతమార్చారు. రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం చౌడుపల్లికి చెందిన (కాంగ్రెస్ పార్టీ) జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సోమలింగంను అతని ఇంటిలోనే కాల్చి చంపారు.


