అటవీ’ విధ్వంసాన్ని అనుమతించబోం | high court on minaral mining | Sakshi
Sakshi News home page

అటవీ’ విధ్వంసాన్ని అనుమతించబోం

Jan 31 2018 2:05 AM | Updated on Aug 31 2018 8:40 PM

high court on minaral mining - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖనిజ తవ్వకాల పేరుతో అటవీ భూముల విధ్వంసం కొనసాగుతోం దని  హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అటవీ భూముల ధ్వంసంతో వన్యప్రాణుల మనుగుడ ప్రశ్నార్థకమవుతోందని, పర్యావరణ సమతుల్యత లోపించి అనర్థాలు ఏర్పడుతున్నాయని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అనుమతించబోమని స్పష్టం చేసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం, జాకారం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు వద్దంటున్నా ఖనిజ తవ్వ కాలకు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది.

దీంతో అక్కడ చారిత్రక కట్టడం పాండవుల గుట్టకు నష్టం కలుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చిన రెండు కొండలకూ, ఈ పాండవుల గుట్ట మధ్య రోడ్డు మార్గం ద్వారా ఎంత దూరం ఉందో తేల్చాలంది. దీనిపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ కన్సర్వేటర్‌ను ఆదేశించింది.

విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌ల దర్మాసనం మంగళవారం ఉత్తర్వు లిచ్చింది. జాకారంలో 4.8 హెక్టార్ల విస్తీర్ణం లో లేటరైట్‌ తవ్వకాలకు గణపతి మినరల్స్‌కు అనుమతినివ్వడాన్ని సవాల్‌చేస్తూ మహ్మద్‌ యాకూబ్‌ పాషా హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement