-
రష్యా దుస్థితి చూసి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..
ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో యుద్ధం వద్దు చర్చలే ముద్దు అని పిలుపునిచ్చిన రష్యా ఖాతారు చేయలేదు. ఊహించని విధంగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి సై అంటూ.. బాంబులతో దద్ధరిల్లే చేసింది రష్యా. దీంతో ఒక్కసారిగా దేశాలన్ని విస్తుపోయాయి. అక్కడికి ప్రపంచ నాయకులంతా ముందుకు వచ్చి రష్యాకు హితవు పలికిన ససేమిరా అంది. పైగా తమను తాము రక్షించుకునేందుకు చేస్తున్న ప్రత్యేక సైనిక యుద్ధంగా సమర్థించుకుంది. చివరికి రష్యానే ఊహించని రేంజ్లో ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ ఇచ్చిన ఝలక్కి గడగడలాడింది. దీంతో రష్యా ఎదుర్కొన్న ఈ అసాధారణ పరిస్థితి గురించి ప్రపంచ నాయకులు ఏమన్నారంటే.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ రష్యాపై తిరుబాటు జెండా ఎగరేసింది. ఈ వాగ్నర్ గ్రూప్ అనేది కిరాయి సైన్యం. ఈ సంస్థకి చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ సైనికులే. అయితే తమ సైనికులకు తగిన గుర్తింపు లేదని పైగా తమ సైనికులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందంటూ రష్యా మిలటరీపై ఆరోపణలు చేస్తూ ప్రిగోజిన్ రష్యాపై దాడి చేసేందుకు సన్నద్ధమయ్యారు. అంతేగాదు మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతని పేరే ఎత్తకుండకునే దేశద్రోహి, ఇలాంటి వాళ్లకు ఎప్పటికైనా శిక్షపడుతుందంటూ మీడియా ముందు పెడబొబ్బలు పెట్టారు పుతిన్. ప్రిగోజిన్‌పై తీవ్రవాదం వంటి నేరాలు మోపేందుకు రెడీ అయ్యారు కూడా. ఇలా ప్రకటించారో లేదో వాగ్నర్ సైన్యం రష్యాలో కల్లోలం సృష్టించింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపు వస్తున్నట్లు ప్రకటించాడు ప్రిగోజిన్. దెబ్బకి రష్యా వెనక్కి తగ్గి.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో మంతనాలు జరిపించి పరిస్థితిని చక్కబెట్టుకుంది. పైగా ప్రిగోజిన్‌పై మోపిన నేరాన్ని ఎత్తివేయడమే గాక తిరుబాటులో పాల్గొన్న సైనికులపై కూడా ఎలాంటి విచారణ ఉండదని, యథావిధిగా విధులకు హాజరవ్వచ్చని రష్యా ప్రకటించడం విశేషం. పుతినే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌ని పెంచి పోషించినట్లు సమాచారం. దీని అండ చూసుకునే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాడు. చివరికి అదే శూలంలా మారి గుండెల్లో గుచ్చుకుంది. ఈ ఘటన అతని దీర్ఘకాల నాయకత్వానికి పెను సవాలుగా మారడమేగాక సందిగ్ధంలో పడేసింది. ఇక రష్యా పని అయిపోయిందనకునేలా మచ్చెమటలు పట్టించింది వాగ్నర్ సైనిక సంస్థ. రష్యా తాను ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం కరెక్ట్ అని సమర్థించుకుంటే..తానే పెంచి పోషించి.. రంగంలోకి దింపిన కిరాయి సైన్యమే ఎదురు తిరిగి ద్రోహం చేసేందుకు రెడీ అయ్యింది. తన వరకు వస్తేగానీ బాధ అంటే ఏంటో తెలియదంటే ఇదే కాబోలు. ఈ ఘటనతో రష్యా బలం, బలహీనతో ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమైపోయాయి. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్న కూటమి దేశాలకు కూడా ఈపాటికే అక్కడి పరిస్థితి అర్థమైపోయింది. ఈ పరిణామాలపై దేశాధి నేతల స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కూడా రష్యా పరిస్థితిని గమనిస్తున్నారని, మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడమ్ హాడ్జ్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ కూడా రష్యా బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది, దాడి చేసేందుకు ఈ కిరాయి సైన్యంపై ఆధారపడితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవన్నారు. అంతేగాదు నాటో ప్రతినిధి ఓనా లుంగెస్కు కూటమి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలపడం విశేషం. ఇక బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సైతం పరిస్థితిని పర్యవేక్షించడమే గాక ఈ సమయంలో అన్ని దేశాలు సంయమనంతో వ్యవహరిస్తున్నాయన్నారు. కాగా, ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ సైతం రష్యా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే జీ7 దేశాల భాగస్వామ్యాలతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది రష్యా అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ మద్దతు విషయంలో మార్పు ఉండదని దృఢంగా తెలిపారు. Closely monitoring the situation in Russia as it unfolds. In touch with European leaders and @G7 partners. This is clearly an internal Russian issue. Our support for Ukraine and @ZelenskyyUa is unwavering. — Charles Michel (@CharlesMichel) June 24, 2023 (చదవండి: తిరుగుబాటు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న స్థానికులు.. ) -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
కైరో: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకున్న సైన్యం..దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ పరిపాల నాబాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్‌ను రద్దు చేయడంతోపాటు ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా బుర్హాన్ చేసిన ప్రకటన టీవీ చానెళ్లలో ప్రసారమైంది. రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. సైనిక తిరుగుబాటు వార్తలతో ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని ఖార్తూమ్ వీధుల్లోకి చేరుకున్నారు.టైర్లకు నిప్పుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌ను పదవి నుంచి తొలగించాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేందుకు మిలటరీ అధికారులు, పౌర నేతలతో ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏర్పాటుతోపాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించారు. ప్రజా ప్రభుత్వా నికి నవంబర్‌లో అధికారం అప్పగించాల్సి ఉంది. -
9000 మంది పోలీసుల తొలగింపు
అంకారా (టర్కీ): ఏకంగా తొమ్మిది వేల మంది పోలీసులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. గతేడాది జూన్‌లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదుర్ఘటనకు ప్రధానకారకుడు వ్యాపార వేత్త గులెన్ అని టర్కీ ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో గులెన్‌పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా గులెన్‌తో సంబంధాలు ఉన్న 9000 మంది పోలీసులను గుర్తించి వారిని విధులనుంచి తొలగించింది. బుధవారం వెయ్యి మందిపైగా గులెన్ సానుభూతి పరులని గుర్తించి అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జింహువా అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. జులై 16 సైనిక తిరుగుబాటుకు గులెన్ ప్రధానకారకుడు. కొన్ని దశాబ్దాలుగా పలు దేశాల్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్నాడు. గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను ఇప్పటికే పలు సార్లు కోరింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఉపశమనం
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement