breaking news
Mid-Cap Funds
-
స్మాల్, మిడ్ క్యాప్‌లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 ఇండెక్స్‌లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్‌లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్‌లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్‌ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్‌ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్‌ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్‌ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్‌లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్‌కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
పాతికేళ్ల ట్రాక్ రికార్డ్.. మంచి రాబడులు ఇస్తున్న ఈ ఫండ్ గురించి తెలుసా?
స్మాల్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని విభాగం ఒకటి ఉంది. అదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం. దీర్ఘకాలంలో ఈ విభాగం మంచి సంపద సృష్టిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి. లార్జ్‌క్యాప్ స్థిరత్వానికి, రిస్క్ తక్కువకు వీలు కల్పిస్తుంది. మిడ్‌క్యాప్ మోస్తరు రిస్క్‌తో, అధిక రాబడులకు మార్గం కల్పిస్తుంది. ఈ రెండు రకాల విభాగాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్. ఈ విభాగంలో సుదీర్ఘకాల చరిత్ర (25 ఏళ్లకు పైగా) ఉండి, మంచి రాబడులను అందిస్తున్న పథకంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల విధానం.. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో విభాగాల వారీ కేటాయింపుల్లో పరిమిత కాలం స్వేచ్ఛ ఉంటుంది. ఈ పథకం మేనేజర్ టాప్డౌన్, బోటమ్ అప్ విధానాలను స్టాక్ ఎంపికకు వినియోగించుకోవడాన్ని గమనించొచ్చు. ఈ విధానాల ద్వారా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల నుంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ కనిపించినా, ఫండ్ మేనేజర్ గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మాల్‌క్యాప్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు కనిపించినా సొంతం చేసుకునే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ఇన్వెస్టర్లకు అదనపు ఆల్ఫా అందించడమే దీని ఉద్దేశ్యం. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు ఉన్న సందర్భాల్లో 30 శాతం వరకు డెట్ సాధనాలకు సైతం కేటాయించగలదు. పోర్ట్‌ఫోలియో డిసెంబర్ 31 నాటికి చూసుకుంటే ఈ పథకం నిర్వహణలో రూ.10,268 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.74 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.87 శాతం, నగదు, నగదు సమానాల్లో 5.4 శాతం మేర కలిగి ఉంది. ప్రస్తుతం ఈక్విటీ కేటాయింపులను పరిశీలించగా, 70.42 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 26 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేవలం 2 శాతాన్నే కేటాయించింది. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నందున అప్రమత్త ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీతో లాభపడే రంగాలు, స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను గమనిస్తే తెలుస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ ర్యాలీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. రాబడులు ఈ పథకం 1998 నవంబర్ 30న ప్రారంభమైనంది. నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వార్షిక రాబడి 18.60 శాతంగా ఉంది. ఈ పథకం ఎక్స్పెన్స్ రేషియో 1.80 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ తన పెట్టుబడుల విలువపై ఏటా ఈ మేరకు చార్జీల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఇహబ్ దల్వాయ్ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 33 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో 25.63 శాతం, ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఈ పథకం ప్రారంభమైన నాడు ఏకమొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఇప్పుడు రూ.72.15 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పథకం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే రూ.4.03 కోట్లు సమకూరి ఉండేది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంక్ 6.84 మారుతి సుజుకీ 4.50 ఎన్టీపీసీ 3.79 భారతీ ఎయిర్టెల్ 3.22 ఇన్ఫోసిస్ 3.14 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.89 ఎస్బీఐ కార్డ్స్ 2.83 రిలయన్స్ 2.53 ఎన్‌హెచ్‌పీసీ 2.36 ముత్తూట్ ఫైనాన్స్ 2.35 -
ఫైనాన్షియల్ బేసిక్స్..
మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్లు ఓకేనా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని పలు విభాగాల్లో మిడ్–క్యాప్ ఫండ్స్ కూడా ఒక రకం. మార్కెట్లు బాగున్నప్పుడు ఈ ఫండ్స్ మంచి రాబడినే అందిస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు ఈ మిడ్–క్యాప్ ఫండ్స్వైపు ఆకర్షితులౌతున్నారు. అదేవిధంగా మార్కెట్లు బాగాలేనప్పుడు వీటి పనితీరు కూడా ఏమీ బాగుండదు. అంటే మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతారు కూడా. రిస్క్ ఉన్నప్పటికీ పోర్ట్‌ఫోలియోలో మిడ్–క్యాప్ ఫండ్స్‌కి అంతోఇంతో చోటివ్వాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మిడ్–క్యాప్ ఫండ్స్ గత పనితీరును పరిశీలిస్తే ఇవి సగటున మంచి రాబడులనే అందించాయి. 2015 మార్కెట్ పతనంలో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ఏకంగా 80 శాతం దాకా పడ్డాయి. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్పంగానే క్షీణించాయి. అందుకే మీరు మిడ్–క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. అధిక రిస్క్‌ను భరించాల్సి వస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మిడ్–క్యాప్ ఫండ్స్‌లోకి అడుగుపెట్టాలనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్లను ఎక్కువ కాలం అలాగే ఉండేలా చూసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో మిడ్–క్యాప్‌కు 25–30 శాతం వాటాను కేటాయిస్తే మంచిది. ఇంతే మొత్తంలో కేటాయింపులు చేయాలనీ ఏమీ లేదు. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అనే అంశానికి అనుగుణంగా మీ కేటాయింపులు ఉండేలా చేసుకోండి. ఎక్కువ రాబడి కోరుకునే వారు ఈ వాటాను ఇంకా పెంచుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమయ్యేటప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారు అవుతాయని మరచిపోకండి.


