breaking news
Mental Hai Kya Movie
-
సమాజంలో అలాంటివారిని చూశా!
బాలీవుడ్లో నటుడు హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాల నుంచి సినిమాల రిలీజ్‌ల వరకు వీరి మధ్య పరస్పర ఆరోపణలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కంగనా, హృతిక్ పరోక్షంగా మాటల బాణాలు విసురుకున్నారు. హృతిక్ ‘సూపర్ 30’, కంగనా ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు (జూలై 26) విడుదలవుతుండమే ఇందుకు కారణం. ముందుగా ‘సూపర్ 30’ సినిమాను హృతిక్ రిలీజ్ రెడీ చేశారని, కంగనా తన సినిమా విడుదల వాయిదా వేయాలని హృతిక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కంగనా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదట. ఇంతలోనే..‘కంగనా చేతిలో నీ పనైపోవడం ఖాయం’ అని హృతిక్‌ను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి అన్నారు. దీనిపై అనవసరంగా మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎందుకు అనుకున్నారేమో కానీ హృతిక్ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ‘‘సూపర్ 30’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మీడియా సర్కస్‌లో నా సినిమా వివాదం నలగకుండా ఉండటంతో పాటుగా, నా మానసిక ప్రశాంతత కోసం ‘సూపర్ 30’ సినిమా విడుదలను వాయిదా వేయమని మా సినిమా నిర్మాతలను కోరాను. సరైన తేదీలో వీలైనంత తొందరగా విడుదలకు ప్లాన్ చేయమని చెప్పాను. ఒకరు ఒకర్ని పరోక్షంగా బాధపెడుతుంటే బాధపడుతున్న వారిని చూసి ఆనందపడేవారిని కొందర్ని ఈ సమాజంలో చూశాను. సమాజం పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన కలగాలి. దీని కోసం ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలకాలి’’ అని హృతిక్ అన్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించారు. ‘‘హృతిక్ రోషన్ ఆ విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ, మా ‘మెంటల్ హై క్యా’ సోలోగా రిలీజ్‌కు రెడీ అవడం హ్యాపీగా ఉంది. ఈ పురుషాధిక్య ఇండస్ట్రీలో సోలో రిలీజ్‌కు కృషి చేసిన మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్. ఆమె పవర్‌ను మెచ్చుకోవాలి’’ అన్నారు. గతంలోనూ ఇలాగే...! నిజానికి గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ‘సూపర్ 30’ సినిమాను తొలుత వాయిదా వేశారు హృతిక్ రోషన్. ఆ తర్వాత సడన్‌గా రిపబ్లిక్ డే వీకెండ్లో కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. అప్పట్లో కూడా కంగనా వర్సెస్ హృతిక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణావల్ల ‘సూపర్ 30’ సినిమాను జూలై 26కి పోస్ట్‌పోన్ చేశారు టీమ్. దీంతో కంగనా ‘మణికర్ణిక: ది క్వీన్ఆఫ్ ఝాన్సీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా కంగనా నటించిన ‘మెంటల్ హై క్యా’ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. -
తెలుగు దర్శకుడితో షారూఖ్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. షారూఖ్ ఓ సాలిడ్ హిట్ సాధించి చాలా కాలం అయ్యింది. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన జీరో కూడా బోల్తా పడటంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే అంగీకరించిన రాకేష్ శర్మ బయోపిక్ సారే జహాసే అచ్చాను కూడా పక్కనపెట్టేశాడు. ఈ పరిస్థితిల్లో షారూఖ్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ తెలుగులో అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలను రూపొందించాడు. సక్సెస్ సాధించలేకపోయినా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రకాష్ బాలీవుడ్లో కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో మెంటల్ హై క్యా సినిమాను రూపొందిస్తున్నాడు. మానసిక వికలాంగుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో నటించనున్నాడట. కథకు కీలకం కావటంతో పాటు పవర్ఫుల్ రోల్ కావటంతో షారూఖ్ కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మెంటల్ హై క్యా టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. టైటిల్ మానసిక విగలాంగులను అవమానించినట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి అసలే సక్సెస్ లేని పరిస్థితుల్లో ఇలాంటి వివాదాస్పద చిత్రంలో షారూఖ్ నటిస్తాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.