breaking news
melkote park
-
విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ ఆగడం
హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నారాయణగూడ మేల్కోటే పార్కు వద్ద చోటు చేసుకుంది. విద్యార్థినిని బలవంతంగా ఆటో ఎక్కించుకునేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో నంబరు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోకిరీల ఆగడాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. -
భవనానికి నీళ్లు కొడుతుంటే..
హైదరాబాద్సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.