breaking news
melbon
-
ఆస్ట్రేలియాలో బోనాల జాతర
-
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో మెల్బోర్న్ సిటీ రాక్బ్యాంక్ ప్రాంతానికి చెందిన దుర్గా మాత దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు . ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పోతురాజుల నృత్యంతో సందడి నెలకొంది. బోనాల పాటలకు మనదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల భక్తులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్ని ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి,దీపక్ గద్దెలు గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం అంగరంగ వైభవంగా బోనాల జాతర జరపడంపై భక్తులు.. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. -
మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్: మెల్బాన్ కంపెనీ తాజాగా రెండు ఎల్ఈడీ టీవీలు, ఒక హోమ్ థియేటర్ సిస్టమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ32, ఈ40 శ్రేణిలో 32, 40 అంగుళాల హై డెఫినిషన్ ఎల్ఈడీ టీవీలతోపాటు ఎంబీ-5100 పేరుతో 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్‌ను కంపెనీ ఇక్కడ ఆవిష్కరించింది. వీటికి బీఐఎస్ ధ్రువీకరణ ఉందని, అందుబాటు ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.