breaking news
Mega Scam
-
వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ విజయవంతం
తాడేపల్లి: దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని, అక్రమాలకు కారణమైన మంత్రి లోకేష్ తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని "గురు పరిరక్షణ దీక్ష"లో వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపహాస్యం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 నియామకాలు ఒక భారీ కుంభకోణంగా మారాయని, ఇది మెగా డీఎస్సీ కాదు పక్కా 'దగా డీఎస్సీ' అని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి, టెట్ అర్హత కూడా లేని వారికి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు అండగా నిలుస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ‘గురు పరిరక్షణ దీక్ష’ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరిగిన ఈ మెగా కుంభకోణాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక దీక్షకు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. నిరసన ప్రారంభానికి ముందుగా సమాజానికి మార్గదర్శనం చేసిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీల భుజాలపై నల్ల కండువాలు వేసి దీక్షను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడం, కర్నూలుకు చెందిన ప్రభాకర్‌తో పాటు క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని వారికి పోస్టులు కట్టబెట్టడమే ఈ దగా డీఎస్సీకి నిదర్శనమని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, యువగళం పాదయాత్రలో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ పోస్టులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కనీస అర్హత లేని నకిలీ ఉపాధ్యాయులను బడుల్లోకి పంపిస్తే భావితరాల విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పే ధైర్యం లేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే, ఈ డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నియామకాలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అలాగే ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మోసపోయిన 3.30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపబోమని నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.ఉదయం దీక్షను ప్రారంభించిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దారుణాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేని వారు టీచర్లుగా నియమితులైనట్లు సాక్షాత్తూ ఈ ప్రభుత్వమే తేల్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై నాలుగైదు జిల్లాల్లో విద్యాశాఖ రహస్యంగా విచారణ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా గమనిస్తుంటే అసలు మెగా డీఎస్సీ ఎంత లోపభూయిష్టంగా సాగిందో సామాన్యులకు సైతం ఇట్టే తెలిసిపోతోందని విమర్శించారు. నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి నియామకాల వరకు అడుగడుగునా అవినీతి జరిగిందని ఇప్పటికే తేలిపోయిందని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో, తప్పుడు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేశారో, ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారీ స్కామ్‌పై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నదే వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్ అని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. అనర్హులు గురువులుగా వస్తే భావి పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ నిశితంగా ఆలోచించాలని కోరారు. కష్టపడి చదివి ప్రతిభతో టీచర్ పోస్టులు సాధించిన వారిని తీసేయమని తాము కోరడం లేదని, నకిలీలను మాత్రమే ఏరివేయాలని స్పష్టం చేశారు.ఆ తర్వాత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, పవిత్రమైన గురువులను స్మరించుకోవడమే కాదు, వారిని గౌరవించుకోవడం కూడా మనందరి విధి అని ఉద్ఘాటించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన డీఎస్సీ నియామకాలు చూస్తే విద్యావ్యవస్థలోకి నకిలీలను తీసుకొచ్చారని అర్థమవుతోందన్నారు. భావితరాలకు సైతం ఈ ప్రభుత్వం పక్కా పన్నాగంతో వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి డీఎస్సీ ద్వారా శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కేవలం కోట్లకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవితను నేడు ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ప్రభుత్వంలో కనీస ఉలుకూ పలుకూ లేకపోవడం దారుణమన్నారు. పాఠశాలలంటే కేవలం భవనాలు కాదని, భావితరాలకు విలువలు నేర్పే ఉత్తమ గురువులని కన్నబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఉన్నతమైన గురువుల నియామకంలో కూడా దొంగలు పడ్డారని ఉద్యమం చేయాల్సిరావడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఉపాధ్యాయులతో సమాజం దారితప్పి భావితరాలకే తీవ్ర ప్రమాదం వాటిల్లే ముప్పు ఉందని హెచ్చరించారు. ఎంత వద్దని మొత్తుకున్నా లోకేష్ కావాలనే విద్యాశాఖను ఎంచుకున్నాడని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేవలం అడ్డదారిలో డబ్బులు దండుకోవడం కోసమే లోకేష్ ఈ విద్యావ్యవస్థను ఎంచుకుని మంత్రి అయ్యాడా అని అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే బాధ్యత టీచర్లదే కాబట్టి, వారిని అక్రమాలకు వాడుకోవచ్చనే దురుద్దేశంతోనే అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా మంత్రిగా నారా లోకేష్ వేసిన ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉందన్నారు. లోకేష్‌కి మంత్రి పదవి అంటే కేవలం మెహర్బానీ కోసమేనని, బాధ్యతగా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఏ శాఖపై రానన్ని ఆరోపణలు, అవకతవకలు విద్యాశాఖపై వస్తున్నా లోకేష్ కనీస వివరణ ఇచ్చుకునే ధైర్యం చేయలేదన్నారు. డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా ఛానెళ్ల సోషల్ మీడియా అకౌంట్లను ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా బ్లాక్ చేయిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేసిన నిరంతర పోరాట ఫలితమే ఈరోజున అన్ని మీడియా ఛానెల్స్ డీఎస్సీ అక్రమాలను బయటకు తీసుకొస్తున్నాయన్నారు. మొన్నటి వరకు కేవలం స్పోర్ట్స్ కోటాలోనే అక్రమాలు జరిగాయని అంతా అనుకున్నారని, కానీ ఇప్పుడు అన్నింటా అవినీతి జరిగినట్టు రుజువైందని తెలిపారు. ఒక్క నకిలీ టీచర్ ఉద్యోగం పట్టుకున్నా రాజీనామా చేస్తానన్న లోకేష్, ఇప్పుడు పదుల సంఖ్యలో బయటపడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో డీఎస్సీ అక్రమాలు బయటపడిన తర్వాత ఇక ప్రభుత్వంతో చర్చలు అనవసరమని పేర్ని నాని తేల్చిచెప్పారు. తండ్రీకొడుకులకు సైకో బుద్ధులు ఉన్నాయి కాబట్టే టీచర్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని, తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ - 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ తీవ్రమైన అవకతవకలు జరిగాయని, బహుశా భారతదేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ చూసి ఉండమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో పాటు ఉపాధ్యాయుల జీవితాలను కూడా బలిపీఠం ఎక్కిస్తున్న దుస్థితిని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రరాష్ట్రంలో చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచి, ప్రభుత్వాల ద్వారా ప్రయోజనాలు పొందిన పెద్దలను పార్టీ శ్రేణులు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా సన్మానించుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్లు లీక్ కావడం, ఉద్యోగాల కోసం జీవోలు మార్చడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించినట్లుగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఈ డీఎస్సీ అక్రమాలపై తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్ కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 16 వేల పోస్టుల భర్తీలో 16 వేల ఆరోపణలు వస్తున్నాయని, టెట్ లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో కొలువులు ఇచ్చేశారని ఆయా నేతలు దుయ్యబట్టారు. డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగి, ప్రభుత్వం సీబీఐ విచారణ వేసే వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు.మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత, జోగి రమేశ్, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దూలం నాగేశ్వరరావు, దేవినేని అవినాశ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నాబత్తుని శివకుమార్, జక్కంపూడి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బాలసాని కిరణ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, అంబటి మురళీ కృష్ణ, విజయవాడ మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ నూర్‌బాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్యక్షుడు భగవాన్, లీగల్ సెల్ నాయకురాలు మాధవి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలకు పార్టీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. -
అసలు పాపం వారిదే..నీరవ్‌ను వదిలిపెట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. దావోస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార వేత్తలతో దిగిన ఫోటోలో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ఉండటంపై విమర్శలకు దిగిన కాంగ్రెస్‌కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ అవాస్తవాలు చెబుతోందన్నారు. గీతాంజలి ఆభరణాల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నవిషయాన్నిగుర్తు చేసిన ఆమె రాహుల్‌పై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ స్కాంలో అసలు పాపం అంతా కాంగ్రెస్‌దేనని, దాన్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీపై ఎదురు దాడిచేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి భార్యకు భార్య అనితా సింగ్‌కు నీరవ్ మోదీకి చెందిన కంపెనీలో షేర్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. నీరవ్ మోదీ కంపెనీలలో ఒకటైన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనితా సింఘ్వి ,(కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి భార్య) , కుమారుడు అవిష్కార్ సింఘ్వి డైరెక్టర్లుగా ఉన్న అద్వైతా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్ హోల్డింగ్స్ స్థలాన్ని 2002 నుంచి అద్దెకు ఇచ్చారని, రెండు కంపెనీల మధ్య రుణ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఇందులో ప్రమోటర్లుగా కాంగ్రెస్‌వారే లబ్ధి దారులుగా ఉన్నారని ఆరోపించారు. వారసత్వ, వారసత్వ ఆస్తులు అన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవని ఆమె ఆరోపించారు. అలాగే మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ దేశం విడిచిపారిపోయినా, పట్టుకుని తీరతామన్నారు.ఆయన్ను అరెస్టు చేసేందుకవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీరవ్ మోదీ సహా అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. కుంభకోణాలకు పాల్పడిన క్షమించే ప్రసక్తే లేదనీ, శిక్షించి తీరుతామన్నారు. -
మెగా స్కాం: ఢమాలన్న గీతాంజలి
సాక్షి, ముంబై: పీఎన్బీ మోగా స్కాం రేపిన ప్రకంపనలు జ్యుయలరీ షేర్లకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. వేలకోట్ల స్కాంలో కీలకు నిందితుడైన మెహుల్ చెక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ శుక్రవారం కూడా ఢమాల్ అంది. వరుసగా మూడో సెషన్లో అమ్మకాల వెల్లువ సాగడంతో 52వారాల కనిష్టాన్ని తాకింది. గీతాంజలి జెమ్స్ 20శాతం కుదేలైంది. ఇతర ఆభరణాల షేర్లలో తంగమైయిల్ జ్యువెలరీ 5 శాతం , త్రిభువన్ దాస్ భీంజీ జవేరి (టీబీజెడ్) 3శాతం, రాజేష్ ఎక్స్పోర్ట్ 1 శాతం నష్టపోయింది. పీసీ జ్యువెలర్స్ మాత్రం పాజిటివ్‌గా ట్రేడ్‌అయింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో జరిగిన 177 కోట్ల డాలర్ల(సుమారు రూ. 11,400 కోట్లు) కుంభకోణంలో గీతాంజలి జెమ్స్‌మై కూడా కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో మరోసారి భారీ అమ్మకాలకు తెరతీశారు. గీతాంజలి, గిన్ని, నక్షత్ర, నీరవ్‌మోదీ లాంటి అతిపెద్ద జ్యువెలర్స్‌నుపరిశీలిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. వివిధ బ్యాంకులతో వారి లావాదేవీలను సీబీఐ, ఈడీ పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు ముంబై బ్రాంచీలో కుంభకోణం పీఎన్బీ షేరు సైతం వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. 2శాతం పతనమైంది. అటు ఈ భారీ స్కాం వెలుగు చూడటంలో మార్కెట్ రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ ప్రారంభించింది. సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే చోక్సీ తో సహా నీరవ్ మోదీకి మోడీకి అన్ని సంస్థల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, తదితర అంశాల విశ్లేషణ మొదలు పెట్టింది. సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని రెగ్యులేటరీ అధికారి తెలిపారు. -
మరో 8మంది అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో తాజాగా మరో ఎనిమిదిమంది అధికారులపై వేటు పడింది. అనుమానిత లావాదేవీలు జరిపారన్న ఆరపణలతో ఒక జనరల్ మెనేజర్ సహా ఎనిమిదిమందిని సస్పండ్ చేసినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ మెగా స్కాంలో మొత్తం సస్పెండ్ అయిన పీఎన్బీ అధికారులు సంఖ్య 18కి చేరింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి ఇతర బ్యాంకుల పూర్తి బకాయిలను చెల్లించాల్సిన నేపథ్యంలో అంతర్గత వనరుల ద్వారా నిధులు సమకూరుస్తామని కూడా ఆ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సంబంధిత 36 అకౌంట్ ఖాతాలపై దర్యాప్తు చేయనుందని తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఎల్వోయూ ( బ్యాంకింగ్ పరిభాషలో ఎల్వోయూ అనేది ఇతర బ్యాంకుల శాఖలకు ఒక బ్యాంక్ జారీచేసే ఒక హామీ. ఈ ఎల్ఓయూ ద్వారా విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను అందిస్తాయి) కింద క్రెడిట్ అయిన నిధులను పూర్తిగా చెల్లిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పీఎన్బీకి రూ. 5,473 కోట్లను ప్రకటించినట్టు చెప్పారు. -
మెగా స్కాం: నీరవ్‌మోదీ ఎపుడో చెక్కేశాడు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి సంబంధించి ఆసక్తికరవిషయం వెలుగు చూసింది. నీరవ్ మోసపూరిత లావాదేవీలపై ఎఫ్ఐఆర్ దాఖలు కాకముందే దేశాన్ని విడిచి వెళ్లిపోయాడని విదేశాంగ శాఖ ప్రకటించింది. సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అంటే జనవరి 1 నే నీరవ్‌మోదీ స్విట్జర్లాండ్‌కు చెక్కేశాడు. అతని సోదరుడు నిశాల్మోదీ(బెల్జియన్ సిటిజన్) భార్య అమి మోదీ (అమెరికన్ సిటిజన్) కూడా ఆ రోజే విదేశీ విమానం ఎక్కేశారు. అయితే ప్రధాన వాటాదారుడు , గీతాంజలి జ్యెవెలరీ ప్రమోటర్ మెహుల్ చోస్కీ జనవరి 6న దేశం విడిచాడని అధికారులు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరి 29న సీబీఐ కి ఫిర్యాదు చేయగా.. రూ. 280 కోట్ల అవినీతి కేసులో జనవరి 30న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్థిక శాఖ స్పందన మరోవైపు తాజా పరిణామాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ సీరియస్‌గా స్పందించింది. పీఎన్బీలో మెగా స్కాం వెలుగు చూడటం గవర్నెన్స్ లోపాలను వెల్లడించిందని శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్,ఎస్బీఐలోని పాలనా లోపాలను ప్రస్తావించారు. అలాగే సంబంధిత ఖాతాలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. ఈడీ, ఆర్బీఐ సీరియస్ అలాగే నీరవ్ మోదీ, ఆయన భార్య, మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఈడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ ప్రయత్నాల్లో విదేశాంగ శాఖ ఉంది. అటు మార్చి 2018నాటికి మొత్తం రూ.11వేల కోట్లను చెల్లించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎన్‌బీను ఆదేశించింది. దీంతో గురువారం నాటి మీడియా సమావేశంలో నిందితులను శిక్షస్తాం, వాటాదారుల సొమ్ముకు ఢోకాలేదంటూ డ్యామెజ్ కంట్రోల్ చేసుకున్నప్పటికీ తాజా పరిణామాలతో బ్యాంకు మరింత చిక్కుల్లో పడింది. రూ.5100 కోట్ల ఆస్తులు సీజ్ నీరవ్ మోదీకి చెందిన రూ. 5100 కోట్ల డైమండ్, బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్టుఈడీ ప్రకటించింది. అలాగే 3.9 కోట్ల బ్యాంక్ బాలెన్స్తోపాటు ఇతర డిపాజిట్లనుకూడా సీజ్ చేసినట్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచ్ కు సంబంధించిన రూ.11,400 కోట్ల భారీ స్కామ్ లో నీరవ్ మోదీ, ఆయన భార్య,సోదరుడు, మరో భాగస్వామి ప్రధాన వాటాదారుడు మెహుల్ చోస్కీ నిందితులు. పీఎన్బీ ఇచ్చిన హామీలతో వీళ్ళు ఆరు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, సూరత్ నగరాల్లో నీరవ్ కుటుంబానికి చెందిన 17 కార్యాలయాలమీద ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాగా 2017 లో తమ బ్యాంకును రూ. 280 కోట్ల మేర బురిడీ కొట్టించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ ఇదివరకే దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు 6 నెలల గడువు కావాలని నీరవ్ కోరినట్టు సమాచారం. అటు ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ 18మంది అధికారులను పీఎన్బీ సస్పెండ్ చేసింది. ఈ అవినీతి గురించి ఈడీకి రిపోర్ట్ చేసిన మొదటి బ్యాంకు పీఎన్బీ. Stock worth Rs 5100 Cr including Gold & Diamond jewellery, Precious stones etc recovered during searches was seized under PMLA. Certain records have also been resumed for further investigation. Bank balance worth Rs 3.9 crore in accounts & fixed deposits has also been freezed. — ANI (@ANI) February 15, 2018 ED writes to the Ministry of External Affairs seeking revocation of passports of #NiravModi, his wife #AmiModi & and #MehulChoksi. #PNBScam — ANI (@ANI) February 15, 2018 -
'పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?'
ముంబయి: పెద్ద నోట్లు రద్దు అనేది ఒక వ్యక్తి ఆలోచన ఆధారంగా చేసిన చర్య అని, ఇదొక భారీ కుంభకోణంగా మారవొచ్చని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 'పెద్ద మొత్తంలో నల్లడబ్బును ఉపయోగించే వారు(మాల్యా, లలిత్ మోడీ) ఎలాంటి పన్ను కట్టకుండానే ప్రధాని మోదీ సాయంతో విదేశాలకు పారిపోయారని ఆయన ఆరోపించారు. బుధవారం ఇక్కడ కోర్టులో హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి బాంద్రా వద్ద మీడియా ప్రతినిధులతో రాహుల్ మాట్లాడారు. తాను ఆర్థిక నిపుణులతో పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని చర్చించానని, ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించలేదని, కేవలం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆధారంగా దీనిని అమలుచేశారని చెప్పారు. ఎంతో సున్నితంగా దీనిని అమలు చేయాల్సిందని అన్నారు. 'నల్లడబ్బు కుబేరులు ఎవరినైనా మీరు బ్యాంకుల ముందు క్యూలో చూశారా? అక్కడ నిల్చున్నవారంతా రైతులు, ప్రభుత్వ సేవకులు, సాధారణ పౌరులు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకోవడంపట్ల స్పందన కోరగా తన పద్ధతి వేరు, మోదీ పద్ధతి వేరని, తాను మోదీ తల్లిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. 'రెండు రోజుల కిందట ప్రధాని తన ప్రసంగంలో నవ్వారు. మరో రోజు ఏడుస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. నేను సోషల్ మీడియాలో బీజేపీ నాయకుల చేతుల్లో పెద్ద మొత్తంలో డబ్బును చూస్తున్నాను. వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.


