breaking news
meeting with officers
-
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంజూరు చేసే ప్రోత్సాహకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అందించే ప్రోత్సాహకాలపై సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులు, అందించిన రాయితీలపై ఆరా తీశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను పరిశీలనకు ఉంచాలని ఆదేశించారు. అవకతవకలు జరిగినట్టు రుజువైతే శాఖాపర చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం వచ్చిన 21 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మురళీమోహన్, ఏసుదాసు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ మోహనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీదేవి, పొల్యూషన్ కంట్రోల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు ! జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో జిల్లాలో సంపూర్ణ ఆరోగ్యం, ప్లాస్టిక్ వినియోగం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ఆరా తీశారు. కొల్లేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్లు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొన్నారు. -
నగరంలో 10 రైతుబజార్లు
ఉద్యానవన పంటలసాగు పెంచండి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): ప్రజల సౌకర్యం కోసం నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో ప్రాథమిక రంగంలో రెండంకెల అభివృద్ధి సాధించడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్పొరేషన్ అధికారులతో చర్చించి నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండంకెల అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుతం సాగు చేస్తున్న భూముల్లో అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో పశువుల సంఖ్య, దాణ అవసరం, మరణిస్తున్న పశువులు తదితర విషయాలతో నివేదికలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కోళ్ల పరిశ్రమలకు సంబంధించి శాస్త్రీయంగా నివేదికలు సిద్ధం చేసి అందజేయాలన్నారు. భూగర్భజల శాఖ మ్యాపింగ్ చేసిన ప్రాంతాలల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగు, కూరగాయల సాగు, సెరికల్చర్, చెరుకు పంటల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. మత్స్య శాఖ జేడీ సీతారామరాజు మాట్లాడుతూ కాళంగినదికి తగినంత వాటర్ డిశ్చార్జ్ లేకపోవడం వల్ల పులికాట్ సరస్సుకు వేసవికాలంలో ఫీడింగ్ లేదన్నారు. తమిళనాడు వైపు పులికాట్ సరస్సు మౌత్ ఉండడం వల్ల సముద్రపు నీరు అటువైపు వస్తుందన్నారు. సముద్ర ముఖద్వారం ఇటువైపు ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార రైతులు అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆలస్యం చేస్తే పరిశ్రమలు ఎలా స్థాపిస్తాం
ఏలూరు : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారిచే పరిశ్రమలు పెట్టించాలని ఎంతో కృషి చేస్తోందని కానీ పర్యావరణంకు సంబంధించి అనుమతులు ఆలస్యం చేయడం వల్ల త్వరితగతిన పరిశ్రమలు నెలకొల్పలేకున్నామని కలెక్టర్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక మండలి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అనుమతుల కోసం ధరఖాస్తుదారులు ఎదురు చూస్తుంటే వారి ధరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సిన శాఖాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనీ, ఇలా ఉంటే పరిశ్రమల కోసం ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. పరిశ్రమల అనుమతుల కోసం సంబంధితాధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గత వారం నుండి ఈ వారం వరకూ ఎన్ని ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న శాఖల వారీగా అధికారులతో కలెక్టర్ మాట్లాడి తక్షణమే ఆయా ధరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ భాస్కర్ ఆయా శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఉపసంచాలకులు ఆదిశేషు, ఏసుదాసు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహనరావు, సోషల్వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, డిటిసి కోటయ్య, ఇపిడిసిఎల్ ఎడి రవికుమార్ పాల్గొన్నారు. పరిపాలనామోదం వచ్చినా పూర్తికావా ః నాబార్డు నిధుల ద్వారా ఆర్ఐడిఎఫ్ఐ పనులు 2013–14 సంవత్సరాల్లో అంగన్వాడీ భవనాలకు పరిపాలనామోదం వచ్చినా ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి కాలేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పంచాయతీ రాజ్ ఎస్ఇ మాణిక్యాన్ని ప్రశ్నించారు. నాబార్డు నిధులు వినియోగంపై కలెక్టరేట్లో ఆర్ఐడిఎఫ్ పనుల ప్రగతిపై కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ భవనాలు కొన్ని పునాది స్థాయిలో, కొన్ని రూఫ్ స్థాయిలో ఎందుకు నిలిచిపోయాయని నిలదీశారు. దీనిపై స్పందించిన పంచాయతీరాజ్ ఎస్ఇ ఇచ్చిన నిధులు సరిపోలేదని చెప్పగా ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరునాటికి అంగన్వాడీ భవనాలన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అదే విధంగా పశుసంవర్ధకశాఖ ద్వారా కేటాయించిన నిధులతో గోపాలమిత్ర భవనాలను కూడా పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బి ఎస్ఇ నిర్మల, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వర్, వైఎస్ఆర్ యూనివర్శిటీ అసిస్టెంట్ ఇంజనీరు నగేష్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్లో పొందుపరచరా.. ? జిల్లాలో ఖరీఫ్ పంట కాలంలో 2వేల 700 కోట్ల రూపాయలు పంట రుణాలు అందిచినట్లు బ్యాంకర్లు చెబుతున్నారే తప్ప రైతు వారీ రుణాలు పంపిణీ వివరాలు ఎందుకు ఆన్లైన్లో పొందు పరచడం లేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ లీడ్ బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల అభివద్ధి కార్యక్రమాలపై వ్యవసాయ, అనుబంధ అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఏ బ్యాంకు నుండి ఎంత మంది రైతులకు రుణాలు అందించారో వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందు పరచడానికి బ్యాంకర్లకు కష్టం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో రైతులకు అందించిన రుణాల వివరాలను రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులు కమిటీ నుండి పొందటమేమిటనీ, జిల్లాలో ఏ రైతుకు ఏమేరకు పంట రుణాలు ఇచ్చారో వాటి వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని లీడ్‌బ్యాంకు మేనేజరును ఆదేశించారు. జిల్లాలో అవసరం మేరకు చేప పిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మత్స్యశాఖాధికారులు చర్యలు తీసుకోవాలనీ, కొత్త రకం చేపల సీడ్ పెంపపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పశువులకు అవసరమైన పోషకాలతో కూడిన గడ్డిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రయివేటు ఎరువుల డీలర్లు కూడా ఈ పోస్ యంత్రాల ద్వారానే ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లాలోని రైతులందరికీ భూసార పరీక్ష కార్డులను రెండు రోజుల్లోగా అందించాలని కలెక్టరు భాస్కర్ వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఒ సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.