breaking news
Medical College Auditorium
-
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి
అంతర్జాతీయ మహిళా వైద్య సదస్సులో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ అభిప్రాయపడ్డారు. ఎస్వీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఉమెన్ హెల్త్’పై నిర్వహిస్తున్న 3 రోజుల సదస్సు తొలిరోజు కార్యక్రమాన్ని ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యాధికారి అరవింద్ మాథ్యూ, సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. ఈవో మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక సమాజంలో మహిళల ఆరోగ్యం, అభివృద్ధికి వైద్య సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న స్విమ్స్, మెడికల్ కాలేజీల నుంచి మహిళల వ్యాధులపై పరిశోధనలు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఆందోళనకరంగా తయారైన సర్వైకల్ క్యాన్సర్, ఇతర రుగ్మతలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ, దళిత, గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు లేవన్న సాకుతో నిపుణులైన వైద్య సిబ్బంది, వైద్యాధికారులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులను వైద్యవిద్య వైపు చైతన్యం చేసి ఏఎన్ఎంలుగా, వైద్యాధికారులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. మహిళలకు సురక్షిత తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు మరింత మెరుగ్గా అందించాలన్నారు. అప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడి అందరూ అభివృద్ధి సాధిస్తారన్నారు. విశిష్ట అతిథులు డాక్టర్ అరవింద్, మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధితోనే బలమైన, ఉన్నతమైన దేశం తయారౌతుందన్నారు. స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ సదస్సులో ప్రసంగించారు. చివరగా వైద్యవిద్యార్థినులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను అలరించారు. వివిధ పోటీల్లో విజేతలైన వారికి టీటీడీ ఈవో సతీమణి జానకి గోపాల్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. సదస్సులో ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బద్దెల సుకుమార్, సదస్సు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ జయభాస్కర్, సెక్రటరీ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.