breaking news
meda srinivas
-
గ్లాస్ గుర్తు నాది.. జనసేనతో బహిరంగ చర్చకు సిద్ధం
-
ముద్రగడపై చర్యలకు హైకోర్టులో పిటిషన్
రాజమండ్రి : కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తుని ఘటన కేసులో ముద్రగడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రను ఆపాలని ఆయన తన పిటిషన్లో కోరారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే.