breaking news
match ODI series
-
హైదరాబాద్ లో క్రికెట్ సందడి
-
ఆస్ట్రేలియా వైట్‌వాష్
5-0తో సిరీస్ నెగ్గిన దక్షిణాఫ్రికా వార్నర్ పోరాటం వృథా కేప్‌టౌన్: ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభవం. తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐదు వన్డేల సిరీస్‌ను ఈ జట్టు 0-5తో క్లీన్ స్వీప్ అరుు్యంది. సొంత గడ్డపై సమష్టి ఆటతీరుతో దుమ్ము రేపిన దక్షిణాఫ్రికా.. ఆసీస్‌ను అన్ని మ్యాచ్‌ల్లోనూ చావుదెబ్బ తీసింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో 31 పరుగుల తేడాతో ప్రొటీస్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌సలో ఆసీస్‌కన్నా దక్షిణాఫ్రికా కేవలం రెండు పారుుంట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 327 పరుగులు సాధించింది. రోసౌ (118 బంతుల్లో 122; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు డుమిని (75 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. 52 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో ఈ జంట నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించింది. ట్రెమెన్, మెన్నీలకు మూడేసి వికెట్లు దక్కారుు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 48.2 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. అరుుతే సహచరులంతా విఫలమైనా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (136 బంతుల్లో 173; 24 ఫోర్లు) మాత్రం అసమాన ఆటతీరును ప్రదర్శించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తను 88 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. అరుుతే దాదాపు చివరిదాకా క్రీజులో నిలిచిన వార్నర్... 48వ ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగాడు. అబాట్, రబడా, తాహిర్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు. -
కుర్రాళ్లకు అవకాశం
ముంబై: దాదాపు రెండు వారాల క్రితం భారత గడ్డపై సాగిన వెస్టిండీస్ డ్రామా అనంతరం ఇప్పుడు మరో సారి అందరూ క్రికెట్‌పై దృష్టి పెట్టే సమయం వచ్చింది. బీసీసీఐతో ‘స్నేహ పూర్వక’ సంబంధాల కారణంగా అడగ్గానే ఆటకు శ్రీలంక సిద్ధమైపోవడంతో అభిమానులకు మళ్లీ భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది. ఈ ఐదు వన్డేల సిరీస్‌కు ముందు శ్రీలంక, భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. గురువారం బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్... ఇరు జట్లలోని యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఆకట్టుకుంటారా? మనోజ్ తివారి నాయకత్వంలో భారత ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతున్న ఆటగాళ్లలో ఇప్పుడు అందరి దృష్టి సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మపైనే ఉంది. భుజం, చేతి వేలికి గాయంతో విండీస్‌తో వన్డేలు ఆడలేకపోయిన రోహిత్ ఫిట్నెస్ను పరీక్షించేందుకు సెలక్టర్లు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చారు. అతను ఫిట్‌గా ఉంటే లంకతో సిరీస్‌లో చివరి రెండు వన్డేలకు ఎంపిక చేయవచ్చు. అప్పుడే ప్రపంచకప్, అంతకు ముందు ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్ కోసం ఓపెనర్‌గా రోహిత్ స్థానానికి మార్గం సుగమం అవుతుంది. సీనియర్ జట్టులో చాలా వరకు స్థానాలు భర్తీ అయిపోయినా...ఒకటి, రెండు స్థానాల కోసం గట్టి పోటీ ఉంది. కాబట్టి యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కేదార్ జాదవ్, ఉన్ముక్త్ చంద్, స్టువర్ట్ బిన్నీ, పర్వేజ్ రసూల్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, ధావల్ కులకర్ణి, కరణ్ శర్మలతో ఈ జాబితా పెద్దదిగానే కనిపిస్తోంది. గాయం కారణంగా పేసర్ బుమ్రా మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అక్కడా కుర్రాళ్లే... మరో వైపు అనాసక్తిగా భారత్‌లో అడుగు పెట్టి, తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించిన శ్రీలంక జట్టు వార్మప్ మ్యాచ్‌కు ముందు అంతా ఓకే అనే సందేశాన్నిచ్చింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు జయవర్ధనే, సంగక్కరలకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి లంక టీమ్‌లోని కుర్రాళ్లు కూడా అవకాశాన్ని వినియోగించుకుని సెలక్టర్ల దృష్టిలో పడాలనే తపనతో ఉన్నారు. -
నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే
భారత్, శ్రీలంక సిరీస్ షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో జరిగే వన్డే కేటాయించిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు ఈ నెల 30న ముంబైలో ఇండియా ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. షెడ్యూల్ వివరాలు తొలి వన్డే నవంబర్ 2 కటక్ రెండో వన్డే నవంబర్ 6 అహ్మదాబాద్ మూడో వన్డే నవంబర్ 9 హైదరాబాద్ నాలుగో వన్డే నవంబర్ 13 కోల్‌కతా ఐదో వన్డే నవంబర్ 16 రాంచీ -
కోలుకోకుంటే కష్టం
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోతే... ఆ తర్వాత అద్భుతాలు చేస్తే తప్ప సిరీస్ గెలువలేం. పైగా విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేకు వరుణుడి నుంచి ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) న్యూఢిల్లీలో జరిగే రెండో వన్డే భారత్‌కు జీవన్మరణ సమస్యలాంటిది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ గెలవడం చాలా కష్టం. తొలి వన్డేలో బ్యాట్స్‌మెన్ తీరు భారత శిబిరంలో ఆందోళన పెంచినా... సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌తోనే పూర్తిగా పుంజుకోగల సత్తా ధోనిసేన సొంతం. న్యూఢిల్లీ: తొలి వన్డేలో వచ్చిన ఫలితం సగటు భారత అభిమానికి మింగుడుపడలేదు. సాధారణ జట్టుగా భావించిన వెస్టిండీస్ ఏకంగా 124 పరుగులతో భారత్‌ను చిత్తు చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎవరూ ఊహించని విధంగా ఓ సాధారణ బ్యాటింగ్ పిచ్‌పై వెస్టిండీస్ పేసర్లను భారత బ్యాట్స్‌మెన్ అడ్డుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో నేడు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే రెండో వన్డే (డేనైట్)లో భారత బ్యాట్స్‌మెన్ ఏ మేరకు పుంజుకుంటారనే అంశంపై ఫలితం ఆధారపడి ఉంటుంది. మార్పులు చేస్తారా? సాధారణంగా ఒక మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా వెంటనే మార్పులు చేయడానికి ధోని ఇష్టపడడు. కాబట్టి రెండో వన్డేలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఓపెనర్లుగా ధావన్, రహానే... మిడిలార్డర్లో కోహ్లి, రాయుడు, రైనా, ధోని బరిలోకి దిగుతారు. ఆల్‌రౌండర్ జడేజాతో పాటు రెండో స్పిన్నర్ ఎవరనేది ఆసక్తికరం. తొలి వన్డేలో విఫలమైన అమిత్ మిశ్రా వైపే కెప్టెన్ మొగ్గు చూపుతాడా? లేక కొత్త కుర్రాడు కుల్దీప్ ‘చైనామన్’ బౌలింగ్‌కు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. పేస్ విభాగంలో భువనేశ్వర్, షమీ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. మోహిత్ స్థానంలో వచ్చిన ఇషాంత్ లేదా ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులోకి వస్తారు. సాధారణంగా కోట్లా వికెట్ చాలా స్లోగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుంది. కాబట్టి ఇద్దరు పేసర్లు చాలనుకుంటే... ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి. అప్పుడు జడేజాతో పాటు మిశ్రా, కుల్దీప్ కూడా జట్టులో ఉంటారు. పెరిగిన విశ్వాసం అటు వెస్టిండీస్ శిబిరంలో తొలి వన్డే తర్వాత ఉత్సాహం పెరిగి ఉంటుంది. కెప్టెన్ డ్వేన్ బ్రేవో ఓపెనర్‌గా తనని తాను ప్రమోట్ చేసుకోవడం వల్ల... మిడిలార్డర్‌లోకి అదనంగా ఆల్‌రౌండర్‌ని తేగలిగాడు. ఈ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. శామ్యూల్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... రామ్‌దిన్ తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఆడుతుండటంతో ఒక్కసారిగా వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. అయితే ఎంత ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉన్నా... ఒక్కసారే అందరూ కలిసికట్టుగా విఫలమవడం కరీబియన్ల ఆనవాయితీ. ముందు రోజు అద్భుతంగా కనిపించిన జట్టే ఒక్కరోజులో చిన్న జట్టులా మారిపోతుందనే పేరూ ఉంది. ఈ ముద్రని తొలగించుకుని భారత్‌పై సిరీస్ గెలిస్తే ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లొచ్చనేది వెస్టిండీస్ జట్టు ఆలోచన. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, కోహ్లి, రాయుడు, రైనా, జడేజా, భువనేశ్వర్, షమీ, మిశ్రా, కుల్దీప్/ఉమేశ్ యాదవ్. వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), స్మిత్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, రామ్‌దిన్, పొలార్డ్, రస్సెల్, స్యామీ, బెన్, రామ్‌పాల్, టేలర్. పిచ్ స్పోర్టింగ్ వికెట్ సిద్ధం చేశామని కోట్లా పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు. ప్రతిసారీ ఇదే మాట చెబుతున్నా... సాధారణంగా ఈ గ్రౌండ్లో తక్కువ స్కోర్ల మ్యాచ్‌లు జరుగుతుంటాయి. చివరిసారిగా 2013లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇక్కడ వన్డే జరిగింది. భారత్ కేవలం 167 పరుగులకు ఆలౌటై కూడా... 10 పరుగులతో గెలిచింది. వాతావరణం వరుణుడితో ఎలాంటి ప్రమాదం లేదు. అయితే మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2 కోట్లా మైదానంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇది రెండో వన్డే మాత్రమే. 1989లో ఇక్కడ భారత్‌తో ఆడిన వెస్టిండీస్ 20 పరుగులతో గెలిచింది. ఆందోళన లేదు ‘ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన లేదా బ్యాట్స్‌మెన్ విఫలమైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను. దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ వైఫల్యాల వల్ల నేను 50 మంచి ఇన్నింగ్స్ ఆడగలనేమో. ఆటగాడు ఫామ్‌లో లేనప్పుడు కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ విషయంలో భారత క్రికెటర్లంతా అదృష్టవంతులు.’ - ధావన్ మోహిత్ స్థానంలో ఇషాంత్ శర్మ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు పేసర్ మోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. కాలి కండరానికి గాయం కారణంగా తనకి విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు ప్రకటించారు. మోహిత్ స్థానంలో ఇషాంత్ శర్మని జట్టులోకి ఎంపిక చేశారు. ఇషాంత్ చివరిసారిగా జనవరిలో వన్డే ఆడాడు. విజయాలను కొనసాగించాలి ‘గతంలో ఎన్నో సార్లు సిరీస్‌లో మంచి ఆరంభం లభించినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అయితే ఈసారి విజయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు మాకు పెద్ద పరీక్షలాంటిది. కష్టాల్లో కూడా మా జట్టు కలిసి కట్టుగా ఉంది. ఖచ్చితంగా గెలవాలనే కసి అందరిలో కనిపించడం మంచి పరిణామం. అనేక మంది విండీస్ దిగ్గజాలు మాకు సహకరిస్తుండటం జట్టుకు మేలు చేస్తోంది.’ - డ్వేన్ బ్రేవో, వెస్టిండీస్ కెప్టెన్ కోహ్లిపైనే అందరి కళ్లు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లి ఇప్పుడు సొంతగడ్డపై ఢిల్లీలోనైనా సత్తా చాటాలని భావిస్తున్నాడు. శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న అతనిపైనే అందరి దృష్టి నిలిచింది. ముందుగా పేస్ వికెట్‌పై కోహ్లి సాధన చేశాడు. గాయంతో మోహిత్ తప్పుకోగా, షమీకు విశ్రాంతి ఇవ్వడంతో... ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్‌లతో పాటు ఎక్కువ సేపు నెట్స్ బౌలర్లు అతనికి బంతులు విసిరారు. దీనిని కోచ్ డంకన్ ఫ్లెచర్ పర్యవేక్షించారు. అనంతరం స్పిన్ వికెట్‌పై మిశ్రా, జడేజాల బౌలింగ్‌ను ఎదుర్కొన్న కోహ్లి, కొన్నిసార్లు భారీ షాట్లు ఆడగలిగినా, చాలా సార్లు మిస్ కూడా అయ్యాడు. అనంతరం అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, విరాట్‌కు ‘త్రోడౌన్’లు విసిరారు. ఫిరోజ్ షా కోట్లాలో గతంలో నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి 12, 112, 7 పరుగులు చేయగా, ఒకసారి అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.