breaking news
Masaipet tragedy
-
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే పోలీసులు
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్కు రైల్వే పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. కాకతీయ టెక్నో స్కూల్కు విద్యాశాఖ అనుమతి ఉందని, బస్సు ఫిట్నెస్ సరిగానే ఉందని నివేదికలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సైకిలిస్టులు, పాలు విక్రయించే వ్యక్తుల నుంచి రైల్వే పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడలేదని పేర్కొన్నారు. త్వరలో రైల్వే అధికారులు ఈ కేసును మూసివేయనున్నట్లు సమాచారం. కాగా గత నెల 24న మాసాయిపేట వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇప్పటికీ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
-
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సికింద్రాబాద్ లోని యశోద హస్పిటల్లో ఐదురోజులుగా చికిత్సపొందుతున్న తరుణ్ అనే విద్యార్థి మృతి సోమవారం సాయంత్రం మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంగతిత తెలిసిందే.