సీజేపీపై అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన కొందరు దాతలు వాళ్లకు నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించే శక్తులు ఈ నిధుల వెనుక ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దేశంలో పాలనను అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ భారత యువతకు పిలుపునిచ్చారామె.ఎక్స్లో చేసిన పోస్టులో మిల్బెన్.. మోదీని వ్యతిరేకించే అమెరికా దాతలు దీప్కే, సీజేపీకి నిధులు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడం కొందరు దాతల పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తులను గుర్తించి, వారిని తీవ్రవాద భావజాలం వైపు మళ్లించి, తిరిగి వారి దేశాలకు పంపి గందరగోళం సృష్టించేందుకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.To all the beautiful young patriots in India: This is not the time to be silent. @abhijeet_dipke and the @Cockroachisback are being funded by donors in the U.S. who are against Prime Minister @NarendraModi and your future under his leadership. Do not fear, my young patriots. Your Prime Minister, who has served India for 25 years, 12 years as Prime Minister, elected three consecutive terms, is not going to bow to disruptive forces from my country. And these select donors have a pattern globally - target conservative global leaders, find an U.S. educated person from the country, radicalize them, send them back to the country, and fund them to start chaos and destruction. None of them have been successful but have impacted the development and governance of the country. It is time for a new voice in #India, born, raised, educated on the soil of India, to RISE UP, organize, and peacefully protest the disruptive spirit of the Cockroach Party. There should always be a counter movement to uphold democracy and freedom. Rise up, young patriots! Rise up!— Mary Millben (@MaryMillben) October 14, 2026ప్రజాజీవితంలో 25 ఏళ్ల అనుభవం, ప్రధానిగా 12 ఏళ్ల పాలన ఉన్న మోదీ.. తన దేశానికి చెందిన విచ్ఛిన్నకర శక్తులకు తలొగ్గబోరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడేందుకు ప్రతిఉద్యమం ఉండాలని పేర్కొంటూ.. భారత యువత సంఘటితమై సీజేపీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కోరారు. ‘ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. యువ దేశభక్తులారా, ముందుకు రండి’ అంటూ పిలుపునిచ్చారు.బ్యాక్గ్రౌండ్ ఇదే..మేరీ మిల్బెన్ అమెరికాకు చెందిన గాయని, నటి. ఆఫ్రికన్-అమెరికన్ నేపథ్యానికి చెందిన ఆమె.. దేశభక్తి గీతాలు, జాతీయ గీతాల ఆలాపనతో గుర్తింపు పొందారు. అమెరికాలోని ఓక్లహోమాలో పాస్టర్ కుమార్తెగా పెరిగిన ఆమె.. సంగీత రంగంలోకి రాకముందు అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వంలో వైట్హౌస్ ప్రెసిడెన్షియల్ అపాయింటీగా పనిచేశారు. అనంతరం గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా అధ్యక్షుల కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఐదుగురు అమెరికా అధ్యక్షుల కార్యక్రమాల్లో జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు.మోదీతో ప్రత్యేక అనుబంధంభారత్లోనూ మేరీ మిల్బెన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2022లో భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ ఆహ్వానంపై ఆమె తొలిసారి భారత్కు వచ్చారు. అదే ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. 2023 జూన్లో ప్రధాని మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ పాల్గొన్న అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో ఆమె పేరు భారత్లో బాగా చర్చకు వచ్చింది. మోదీ ప్రభుత్వానికి మద్దతుగా గతంలోనూ ఆమె పలుమార్లు వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే బీజేపీ నేతల ప్రశ్నలుసీజేపీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశంపై బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ప్రతిపక్ష నేతలు, సీజేపీ విదేశీ మద్దతుతో దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సైతం డిప్కే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నవారెవరని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను దీప్కే తోసిపుచ్చారు. పైగా విదేశీ నిధులు సీజేపీ కార్యకలాపాలకు చేరి ఉంటే, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. అదెలాగో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఉన్న మంత్రిత్వ శాఖనే వివరించాలని సెటైర్ వేశారు. ప్రస్తుతం సీజేపీ నేతలు, మద్దతుదారులు ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మిల్బెన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ క్రమంలో విదేశీ నిధుల ఆరోపణలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: అప్రకటిత ఎమర్జెన్సీ ఎందుకు మోదీగారూ?