breaking news
Mary Mata
-
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
మమ్ము ఆశీర్వదించు మేరీమాతా! గుణదల తిరునాళ్ల సంరంభం
దేశంలోని క్రైౖస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా విజయవాడలోని గుణదల మేరీమాత క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమాతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతియేటా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచీ లక్షలాది యాత్రికులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.నూరేళ్ల క్రితమే ప్రతిష్ట..కతోలిక క్రైస్తవులు భారతదేశంలో సేవనారంభించిన తొలినాళ్లలో అనగా 1925లో గుణదల ప్రాంతంలో విద్యాబోధన ప్రారంభించారు. గుణదల కొండ సమీపంలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్కి అప్పటి రెక్టర్ ఫాదర్ గా పనిచేస్తున్న అర్లాటి స్వామి కొండ పైభాగంలో సహజసిద్దం గా ఉన్న కొండ గుహను గుర్తించారు. భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ఆ గుహలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచీ కతోలిక క్రైస్తవులు, ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు కొండపై ఉన్న మరియమాత స్వరూపాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేడాదికి ఒకసారి ఫిబ్రవరి 11వ తేదీన మరియమాత ఉత్సవాలను జరుపుకోవడం సంప్రదాయమైంది.అర్లాటి స్వామి మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన నాటి నుంచీ మేరీమాత పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కొండ శిఖరాగ్రాన యేసుక్రీస్తు శిలువను ప్రతిష్టించారు.1937లో కొండగుహలో మేరీమాత విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేశారు. అటుపై ప్రత్యేక్ర ప్రార్థనలు, సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని నిర్మించారు. కొండగుహను తొలిచి మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 1948లో కొండ శిఖరాగ్రానికి చేరుకునే దారిలో దేవ రహస్యములు తెలియపరిచే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుణదల పుణ్యక్షేత్రంలో పనిచేసే గురువులు భక్తులకోసం మౌలిక సదు΄ాయాలు, మెట్లమార్గాలు ఏర్పాటు చేశారు. రానురాను ప్రాచుర్యం పెరిగి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మేరీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టారు.ఆచారాలుకులమతాలకు అతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. తొలుత మరియమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. మైనపువత్తులు వెలిగించటం, కొబ్బరికాయ లు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, దివ్యపూజలు చేయించడం, యాత్రికులు నిద్ర చేయటం వంటి ఆచారాలను అనుసరిస్తుంటారు.ఉత్సవాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమష్టి దివ్యబలిపూజ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అంతేకాకుండా నిరంతరం క్రై స్తవ భక్తి గీతాలాపనలు, ప్రత్యేక ప్రసంగాలు, క్రై స్తవ నాటికలు ప్రదర్శిస్తున్నారు. మహోత్సవాలు ప్రారంభంప్రస్తుతం 101వ తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 10 లక్షలమందికి పైగా విచ్చేస్తారని అంచనా. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రార్థనల్లో కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్, ఖమ్మం పీఠాధిపతి సగతి ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభంఆదివారం ఉదయం విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ యేలేటి విజయం జయరాజులు ప్రత్యేక ప్రార్థనలు, సమష్టి దివ్యబలి పూజ సమర్పించి తిరునాళ్ల మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ గురువులుసందేశాలిచ్చారు– చక్రాల శరత్ రాజుసాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) -
కైండ్‌నెస్‌తో మ్యాన్‌కైండ్‌ను గెలవొచ్చు!
‘మ్యాన్‌కైండ్’ అనే పదంలోనే ‘కైండ్’ అనే మాట ఉంది. మతం అంటే మానవాళి అందరిపట్లా దయతో ఉండమని అర్థం. జీసస్కు జన్మనిచ్చినందుకు సర్వమానవాళీ మేరీమాతకు తమ తమ సొంత అమ్మలకు ఇచ్చే గౌరవం ఇచ్చింది. అందుకే తెలుగులో ఆమెను మనం సంబోధించినప్పుడల్లా ‘మేరీ మాత’ అంటాం. ఒక్క బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆమె విశ్వమానవాళికే తల్లి అయ్యింది. అంతేకాదు... దయా దృష్టితో, కరుణతో సేవ చేసే వాళ్లందరినీ తల్లిని పిలిచినట్లే సంబోధిస్తాం. అందుకే మదర్ థెరిసాను తల్లిగా సంబోధించకుండా పిలువలేం. సేవ చేసే ప్రతి మనసులోనూ మాతృహృదయామృతాన్నే చవిచూస్తాం. అందుకే ఏ మతం వారు ఆమె పేరును ఉచ్చరించాలన్నా ‘అమ్మ’ అనే విశేషణం లేకుండా ఆమెను పిలవలేరు. అదే సేవలోని గొప్పదనం. సేవాదృక్పథానికి మతం అనే కృత్రిమమైన ఎల్లలు ఎప్పుడూ అడ్డురావు. - డా॥బొల్లినేని భాస్కర్‌రావు చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, కిమ్స్, సికింద్రాబాద్


