breaking news
Martina
-
కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి
ఆ అమ్మాయి వయొలిన్ సాధన చేస్తుంటే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. కాని ఇప్పుడు మొత్తం కేరళ ఆ అమ్మాయిని చూసి గర్విస్తోంది. 14 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ వారి ఫెలోషిప్‌కు ఎంపికై రికార్డు సృష్టించింది మార్టినా.ఈ వయసులో ఈ ఫెలోషిప్ సాధించిన వారు దేశంలో లేరు.ఏ వయసు వారైనా కేరళలో లేరు.సంగీతంతో ఆరోహణ దిశలో పయనిస్తోంది మార్టినా. సుప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు రాసిన ‘వాయులీనం’ కథలో భార్య తీవ్రంగా జబ్బు పడితే ఆమెను కాపాడుకోవడానికి భర్త ఆమె ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న వయొలిన్‌ని అమ్మేస్తాడు. ఆమె బతుకుతుంది. అమ్మకానికి వెళ్లిపోయిన వయొలిన్‌ని తలుచుకుని, మిగిలిన డబ్బుతో భర్త కొన్న చీరను చూస్తూ ‘పోనీలేండి జ్ఞాపకంగా పడి ఉంటుంది’ అంటుంది వేదనగా. జీవితంలో కళాసాధన, కళాసాధనకు ఎదురు నిలిచే జీవితం గురించి చెప్పిన కథ ఇది.మార్టినా జీవితంలో తండ్రి కూడా ఇలాంటి త్యాగమే చేశాడు. మొదలైన ప్రయాణం 14 ఏళ్ల మార్టినా ఇప్పుడు వయొలిన్లో గొప్ప పేరు సంపాదించి ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ ఫెలోషిప్ పోందిందిగాని ఇక్కడి వరకూ చేరడానికి ఆమె తండ్రి పడిన కష్టం ఉంది. మార్టినాది కన్నూరు జిల్లాలోని పెరవూర్. తండ్రి చార్లెస్‌కు బాల్యంలో గొప్ప మ్యుజీషియన్ కావాలని ఉండేది కాని ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొద్దోగొప్పో నేర్చుకున్న కీబోర్డుతో చర్చ్‌లో సంగీతం వాయించేవాడు. ఆ డబ్బు సరిపోక మిగిలిన సమయాల్లో ఆటో నడిపేవాడు. భార్య షైనీ గృహిణిగా ఉన్నంతలో సంసారాన్ని లాక్కువచ్చేది. అయితే ఐదారేళ్ల వయసు నుంచే కూతురు మార్టినా సంగీతంలో విశేష ప్రతిభ చూపడం వారికి ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆందోళన కలిగించాయి. ఆనందం కూతురికి సంగీతం వచ్చినందుకు, ఆందోళన అందుకు తగ్గట్టుగా నేర్పేందుకు వనరులు లేనందుకు. ఎనిమిదవ తరగతి వరకూ పెరవూర్లోనే చదువుకున్న మార్టినా అక్కడే ఉన్న ‘రాగం స్కూల్ ఆఫ్ మ్యూజిక్’లో వయొలిన్ నేర్చుకుంది. కానీ తర్వాతి స్థాయి వయొలిన్ నేర్చుకోవాలంటే త్రిశూర్‌లో చేరాలి. అంటే కుటుంబం మొత్తం త్రిశూర్‌కు మారాలి. అక్కడ మొదలైంది సమస్య. ఆటో అమ్మేసిన తండ్రి ఉంటున్న పెరవూర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశూర్‌కు కాపురం మారాలంటే చాలా ఖర్చు. సాధనకు వీలైన ఇల్లు తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం లక్ష రూపాయల విలువైన కొత్త వయొలిన్ కొనాలి. ఇవన్నీ ఆలోచించి తండ్రి ఆటో అమ్మేశాడు. అంతేకాదు తమ చిన్నపాటి ఇంటిని కూడా అమ్మేద్దామనుకున్నాడు. కాని బంధువులకు సంగతి తెలిసి వారు తలా ఒక చేయి వేశారు. 2019లో త్రిశూర్‌కు షిఫ్ట్ అయినప్పటి నుంచి మార్టినా సాధన పెంచింది. ఉదయం ఐదు గంటలకు లేచి స్కూల్ సమయం అయ్యే వరకు సాధన చేసేది. అయితే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. దాంతో మరో ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఏమైనా సరే కూతురిని గొప్ప వయొలినిస్ట్ చేయాలని చార్లెస్ సంకల్పం బూనాడు. జాతీయ విజేత త్రిశూర్‌లో, కొచ్చిలో గొప్ప గొప్ప గురువుల దగ్గర సాధన చేసి వయొలిన్ నేర్చుకుంది మార్టినా. తీగలను మీటి మీటి ఆమె చేతి వేలికొసలు రక్తాన్ని చిమ్మేవి. మెడ మీద వయొలిన్ ఉంచి ఉంచి కదుములు కట్టేవి. అయినా సరే మార్టినా తన సాధన మానలేదు. ఫలితం? ఆల్ ఇండియా వయొలిన్ కాంటెస్ట్ 2022, 2023... రెండు సంవత్సరాలూ ఆమే విజేతగా నిలిచింది. 100 మంది వయొలినిస్ట్లను ఓడించి మరీ! ఆ తర్వాత ‘సౌత్ ఏసియన్ సింఫనీ’లో సభ్యురాలు కాగలిగింది. ఈ సింఫనీ కోసం 11 దేశాల వయొలినిస్ట్లు పోటీ పడుతుంటారు. చివరగా ప్రతిష్ఠాత్మక ట్రినిటీ కాలేజ్ లండన్ ఫెలోషిప్ పోందింది. 14 ఏళ్ల వయసులో ఈ ఫెలోషిప్‌ను పోందిన వారు లేదు. చార్లెస్, షైనీల ఆనందానికి అవధులు లేవు.ఈ గొప్ప కళాకారిణి సంగీతానికి కొత్త శోభను తేవాలని కోరుకుందాం. -
సానియా జంట జైత్రయాత్ర
సిడ్నీ ఓపెన్‌లోనూ విజేత ఇండో-స్విస్ జోడీకిది వరుసగా ఏడో టైటిల్ సిడ్నీ: ప్రత్యర్థులు ఎవరైనా... వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... అన్నింటినీ అధిగమిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా సిడ్నీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ జంటకే టైటిల్ లభించింది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 1-6, 7-5, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీపై అద్భుత విజయం సాధించింది. వరుసగా 30వ మ్యాచ్‌లో గెలిచిన సానియా-హింగిస్ జంటకిది వరుసగా ఏడో టైటిల్ కాగా... ఓవరాల్‌గా 11వది. విజేతగా నిలిచిన వీరిద్దరికీ 40,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 25 వేలు) తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతేడాది బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఈ టైటిల్‌ను నెగ్గిన సానియా ఈసారి హింగిస్‌తో కలిసి సాధించడం విశేషం. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఒకదశలో తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 2-5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే గత ఆరు నెలలుగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఈ జంట ఇలాంటి క్లిష్టమైన దశలోనూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఓపికతో ఆడింది. చక్కటి సమన్వయంతో రాణించి వరుసగా ఐదు గేమ్‌లు గెల్చుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. సూపర్ టైబ్రేక్‌లోనూ సానియా జంట ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా టైటిల్‌తో ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జాతో కలిసి మార్టినా హింగిస్ సంయుక్తంగా అగ్రస్థానంలోకి చేరుకుంటుంది. 2000 తర్వాత టాప్ ర్యాంక్ అందుకోవడం హింగిస్కిదే ప్రథమం. -
చిన్నారులకు మార్టినా పాఠాలు
-
చిన్నారులకు మార్టినా పాఠాలు
సానియా అకాడమీలో సందడి సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. ‘డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్’ ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించాలంటూ వారిలో స్ఫూర్తి నింపింది. ఈ సందర్భంగా డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జాను ప్రత్యేకంగా అభినందించిన మార్టినా... డబ్ల్యూటీఏ తరఫున జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఏ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ మెలీసా పైన్, భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. -
వారెవ్వా... సానియా
-
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ టైటిల్ విజేత పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. పేస్ జోడి ఫైనల్లో విజయం సాధించింది. పేస్ కిది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో పేస్, మార్టినా హింగిస్ జోడి 6-4, 6-3 తేడాతో డానియల్ నెస్టార్, క్రిస్టినా (ఫ్రాన్స్) పై గెలిచారు. 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో ఎనిమిది పురుషుల డబుల్స్, ఏడు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను సాధించాడు.