breaking news
Mars Orbitor
-
అంగారకుడి మీదకు.. మరో రెండురోజులే!
మార్స్ ఆర్బిటర్ ప్రయోగంలో కీలక దశ విజయవంతమైంది. శాస్త్రవేత్తలు ఆర్బిటర్ లోని లిక్విడ్ ఇంజన్ను మండించారు. అది విజయవంతంగా పనిచేస్తోందని వారు వెల్లడించారు. బుధవారానికల్లా అంగారక కక్ష్యలోకి 'మామ్' ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మామ్ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు ఇస్రో తగ్గించింది. 2013 నవంబర్ 5వ తేదీన మంగళ్యాన్ను ప్రయోగించారు. అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారతదేశం రికార్డు సాధించినట్లు అవుతుంది. ఇప్పటివరకు కేవలం అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగారకుడి మీదకు తమ వాహనాలను పంపాయి. ఈ ఘనత సాధించిన నాలుగో దేశం భారతదేశం అవుతుంది. ఇందుకు కేవలం మరి రెండురోజుల సమయం మాత్రమే ఉండటంతో శాస్త్రవేత్తలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం
సూళ్లూరుపేట : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారక యాత్ర విజయవంతంగా నాలుగు దశలను పూర్తి చేసుకుంది. కీలక మైన నాలుగో దశను విజయవంతంగా దాటింది. లక్షిత వేగంతో దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ సి 25 గురించి సమాచారం అందినట్లు షార్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత కీలకమైన పీఎస్-4 ఇంజిన్ ప్రారంభమైందని వారు తెలిపారు. కాగా అంతకు ముందు ప్రయోగానంతరం మార్స్ ఆర్బిటర్ మిషన్ భూమి చుట్టూ దాదాపు 5 సార్లు చక్కర్లు కొట్టింది. ఆ తరువాత అంగారక కక్ష్య మార్గంలోకి ప్రవేశించింది. ఈ చక్కర్లు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పద్ధతి ప్రకారం జరిగాయి. తొలి దశలో పెరిగీ (భూమికి అతి దగ్గరగా ఉండే దశ) దాదాపు 250 కి.మీ. ఉంటే.. అపొగీ(భూమికి అతి దూరంగా ఉండే దశ) దాదాపు 23,000 కిలోమీటర్లుంటుంది. తరవాతి 4 దశల్లో పెరిగీలో పెద్ద మార్పుండదు గానీ అపొగీ మాత్రం 40,000 నుంచి దాదాపు 2 లక్షల కి.మీ వరకు పెరిగింది. ఈ దశల తరువాత ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్య మార్గంలోకి దూసుకెళ్లింది. ఇక రెండోది హీలియో సెంట్రిక్ దశ. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంగారకుడుండే నిర్దిష్ట స్థానం ఆధారంగా ఈ దశ ప్రయాణం ఉంటుంది. ఇక అంగారక గ్రహ ప్రభావముండే ప్రాంతం (ఆ గ్రహం నుంచి 5.7 లక్షల కిలోమీటర్లు)లోకి ప్రవేశించడంతో మూడో దశ మొదలవుతుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఉపగ్రహం క్రమేపీ ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. కాగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం మొత్తం బరువు దాదాపు 1,336 కిలోలు. దీంట్లో 860 కిలోలు ఇంధనం. మిగతా బరువులో దాదాపు 15 కిలోల బరువుతో 5 శాస్త్రీయ పరికరాలుంటాయి.