breaking news
Marine Lines
-
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
30 వేల మంది పహారా
ముంబై: అత్యంత కట్టుదిట్టమైన పోలీసు పహారా మధ్య గురువారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో మెరైన్ లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాగ్‌పూర్‌నుంచి తీసుకొచ్చాక మహిమ్‌లోని ఆయ న ఇంట్లో 2గంటల పాటు మృతదేహాన్ని ఉంచారు. కుటుంబీకులు, బంధువులు కడచూపు చూసుకున్నారు. ప్రార్థనలు చేశారు. అనంతరం మెరైన్ లైన్స్‌లోని శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే ఉద్దేశంతో అంతిమయాత్రకుఅనుమతి నిరాకరించారు. మీడియా చిత్రీకరణను కూడా నిషేధించారు. ఈ మార్గాన్ని పూర్తిగా భద్రతా బలగాలతో నింపేశారు. మొత్తం 30,000 మంది పోలీసులను మోహరించారు. 4.15 గంటలకు శ్మశానవాటికకు మృతదేహం చేరుకునే సమయానికి ముంబైలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. అయితే లోపలికి అనుమతించే ముందు ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేసి వదిలారు. అయితే జనం రద్దీ పెరగడంతో తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. 5.15 కల్లా అంత్యక్రియలు ముగిశాయి. నేరచరిత కలిగిన 526 మంది ని ముంబై పోలీసులు బుధవారమే ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.