breaking news
Manish Yadav
-
సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం
నటి సిమ్రాన్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనంటోంది నటి మనీషా యాదవ్. వళక్కుయన్ 19/7 చిత్రం ద్వారా తమిళ తెరకు ప్రత్యక్షమైన ఈ ఉత్తరాది భామ, ఆ తరువాత కాదల్ చెయ్వీర్ తదితర విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య చిన్న వివాదంలో చిక్కుకుని కోలీవుడ్‌కు దూరమైన మనీషా తాజాగా జి.వి.ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. టైటిల్‌తోనే బోలెడు ప్రచారం పొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే కయల్ చిత్రం ఫేమ్ ఆనంది ఒక నాయికగా నటి స్తోంది. మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తోంది. ఇప్పుడు నటి మనీషా యాదవ్ మరో హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రంలో చోటు సంపాదించుకోవడం గురించి మనీషా మాట్లాడుతూ, ‘త్రిష ఇల్లన్న నయనతార’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇందులో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని చెప్పింది. జి.వి.ప్రకాశ్ కుమార్ మంచి సంగీత దర్శకుడే కాక, నటనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారన్న విషయాన్ని మూడు రోజుల షూటింగ్‌లోనే తాను గ్రహించానని పేర్కొంది. దర్శకుడు ఆదిక్ సన్నివేశాలను అర్థవంతంగా వివరిస్తూ ఆర్టిస్టుల నుంచి తనకు కావలసిన అభినయాన్ని రాబట్టుకుంటున్నారని అంది. ఇకపోతే తాను నటి సిమ్రాన్‌కు తీవ్ర అభిమానినని పేర్కొంది. ఆమె నటిస్తున్న చిత్రంలో తానూ ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. సిమ్రాన్లా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ తాను ఆమెను కలుసుకోలేదని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో కలుసుకునే అవకాశం రాబోతుందన్న ఎగ్జయిట్‌మెంట్‌తో ఉ న్నానని మనీషా అంది. ఈ చిత్రాన్ని కామియో ఫిల్మ్స్ పతాకంపై సీజె. కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
చెర్రీ, బన్నీలతో నటించాలని ఉంది
బీకామ్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యింది. కామ్‌గా సీఏ చేద్దామనుకుంది. కానీ, కుదర్లేదు. సినిమాల్లో అవకాశం వచ్చింది. ఓసారి ప్రయత్నిస్తే పోలా అనుకుంది. ‘వళక్కు ఎన్ 18/9’ చిత్రం ద్వారా హీరోయిన్ అయ్యింది. ఇంతకీ తన పేరు చెప్పనేలేదు కదూ. మనీషా యాదవ్. ‘తూనీగ తూనీగ’ చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనిపించిన మనీషా ‘ప్రేమించాలి’తో తనకు తెలుగులో బ్రహ్మాండమైన బ్రేక్ వస్తుందని ఆశిస్తోంది. ఎస్కే పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తోన్న పదో చిత్రం ఇది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మనీషా మాట్లాడుతూ - ‘‘టీనేజ్‌లో ప్రేమలో పడిన ఓ యువతీ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. మానసిక పరిపక్వత లేని వారి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? అనేది ప్రధానాంశం. యువతీయువకుల ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చే చిత్రం అవుతుంది. ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను’’ అని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తెలుగులో కూడా సినిమాలు చేయాలని ఉందని మనీషా తెలిపింది. రామ్‌చరణ్, అల్లు అర్జున్ సరసన అవకాశం వస్తే చేస్తానని, చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పింది మనీషా.