breaking news
Mangalhat
-
కుళ్లిపోయిన వెయ్యి కిలోల మాంసం సీజ్
హైదరాబాద్: కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్‌పై పోలీసులు దాడులు చేశారు. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళ్‌హాట్‌లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ కిస్తీ చమాన్ ప్రాంతంలో అఫ్రోజ్ అనే వ్యక్తి ఎ టు జెడ్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాడు. బుధవారం మంగళ్‌హాట్ పోలీసులతో పాటు టాస్‌్కఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందం, వెటర్నరి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ గోడౌన్లో కుళ్లిపోయిన, అపరిశుభ్రమైన, దుర్వాసనతో కూడిన దాదాపు వెయ్యి కిలోల మేకలు, గొర్రెల మాంసం విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడు అఫ్రోజ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 రోజుల క్రితం ఇదే గోడౌన్‌పై దాడులు చేసి కుళ్లిన మాంసాన్ని, విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. తిరిగి కుళ్లి పోయిన మాంసంతో విక్రయాలు చేస్తుండడంతో పోలీసులు మరోసారి దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. పట్టుకున్నారు.. గోప్యంగా ఉంచారు.. ఉప్పల్: గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేస్తున్న పలు సంస్థలపై హెచ్–ఫాస్ట్ అధికారులు బుధవారం దాడులు చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. రామంతాపూర్ బాలకృష్ణానగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేసి వాటిపై శ్రీనివాస్ స్వగృహ ఫుడ్స్ పేరిట లేబుల్స్ అతికించిన ప్యాకెట్లను రిటేల్ షాపుల్లో విక్రయిస్తున్నాడు. ఫుడ్ సేప్టీ అధికారులు గత నెల 30న దాడి చేసి 20 బ్యాగుల మైదా, 20 టిన్నుల ఆయిల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. రామంతాపూర్ సాయికృష్ణానగర్‌లో నాయుడు ఫుడ్స్ కంపెనీ పేరిట నిర్వహిస్తున్న తిను బండారాల సంస్థపైనా దాడి చేసిన అధికారులు.. షేక్ మహబూబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. -
పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..
సాక్షి, జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి ఇంట్లో తరచూ గొడవల కారణంగా మనస్థాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఇంద్రానగర్‌లో ఉంటున్న కరణ్ ఖాళీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్ పాటిగడ్డ అస్మత్‌పేట్ ప్రాంతానికి చెందిన శ్వేత(22)తో వివాహం జరిగింది. ఇటీవల వారికి కూతురు కూడా జన్మించింది. అయినా గొడవలు తగ్గకపోవడంతో మనస్థాపం చెందిన శ్వేత శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
-
ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ప్లాస్టిక్ గోదాములో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


